సాయి ధరమ్ తేజ్ ను స్టేజ్ పైనే ముద్దాడిన కలర్స్ స్వాతి, అంతా షాక్..
స్టేజ్ మీద షాక్ ఇచ్చింది కలర్స్ స్వాతి. మెగా మేనల్లుడికి ముద్దు పెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఈ సంఘటన ఎప్పుడు ఎలా జరిగిందంటే..?
swathi reddy
వికాస్ మలయాళీ పైలట్ ని పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైనా కలర్స్ స్వాతి, మళ్ళీ ఇన్నాళ్లకు రీ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పుడు ఆమె లేటెస్ట్ గా ‘మంత్ ఆఫ్ మధు’ అనే చిత్రం చేసింది. సినిమాలకు గుడ్ బై చెప్పి చాలా కాలం ఫారెన్ లోనే ఉండిపోయింది బ్యూటీ. ఇక చాలా కాలం తరువాత ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతోంది.
రిలీజ్ కు రెడీగా ఉన్న ఈ సినిమాకి సబంధించి ప్రెస్ మీట్ ను ఏర్పాట్ చేశారు టీమ్. అయితే ఈ ప్రెస్ మీట్ కు గెస్ట్ గా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ముఖ్య అతిథిగా వచ్చారు.
అయితే ఈ ప్రెస్ మీట్ లో కలర్స్ స్వాతి సాయి ధరమ్ తేజ్ కి ముద్దుపెట్టడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సంఘటనతో అంతా షాక్ అయ్యారు. అయితే అసలు విషయం కూడా ఇప్పుడే తెలిసింది.
కలర్స్ స్వాతి మరియు సాయి ధరమ్ తేజ్ మంచి స్నేహితులు అన్న విషయం.. ఈ ప్రెస్ మీట్ లో అందరికి తెలిసింది. వీరిద్దరు కలిసి ఒకే కాలేజీలో చదువుకున్నారట. అంతే కాదు కాలేజీ రోజుల నుంచి వీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అట. అప్పట్లో పరీక్షలలో స్వాతీ ఎగ్జామ్ పేపర్ నుండే సాయి ధరమ్ తేజ్ కాపీ కొట్టేవాడట.
స్వాతి ని సాయి ధరమ్ తేజ్ స్వాతి గాడు అని పిలవడం విశేషం. ఇద్దరు స్టేజి మీద జోకులు వేసుకుంటూ సరదాగా మాట్లాడగా , దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి. అయితే వీరి చనువు చూసి గుసగుసలాడిన వారికి అసలు నిజం తెలిసిన తరువాత షాక్ తగిలినట్టు అయ్యింది.
కలర్స్ పేరుతో మా టీవీలో ప్రసారమైన షోతో స్వాతి పాపులర్ అయ్యారు. టీనేజ్ లోనే బుల్లితెరను దున్నేసింది అమ్మడు. విపరీతంగా అభిమానులను సంపాదించింది. స్వాతి సెన్సాఫ్ హ్యూమర్, ఎనర్జీ, గలగలా మాట్లాడే తత్త్వం ఆమెను స్టార్ చేశాయి. అలా వచ్చిన ఫేమ్ తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చేసింది. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన డేంజర్ చిత్రంతో వెండితెరపై మొదటిసారి కనిపించింది.
అనంతరం సోలో హీరోయిన్ గా కూడా చేసి సక్సెస్ అయ్యింది. 2018లో ప్రియుడు వికాస్ వాసును పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్ళిపోయింది. అతడు వృత్తి రీత్యా పైలట్. అదే సమయంలో సిల్వర్ స్క్రీన్ కి దూరమైంది. కొన్నాళ్ల క్రితం ఇండియాకు వచ్చేసిన స్వాతి ఇక్కడే ఉంటున్నారు. కమ్ బ్యాక్ ఇస్తూ పంచతంత్రం టైటిల్ తో ఓ చిత్రం చేసింది. పంచతంత్రం గత ఏడాది విడుదలైంది. ప్రస్తుతం మంచి అవకాశాల కోసం చూస్తోంది.