- Home
- Entertainment
- Guppedantha Manasu: రిషి ప్రవర్తనికి షాకవుతున్న కాలేజీ స్టాఫ్.. తెలివిగా పావులు కదుపుతున్న జగతి!
Guppedantha Manasu: రిషి ప్రవర్తనికి షాకవుతున్న కాలేజీ స్టాఫ్.. తెలివిగా పావులు కదుపుతున్న జగతి!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుంది. తన కొడుకుకి జరిగిన అన్యాయానికి రివెంజ్ తీర్చుకోవటానికి పావులు కదుపుతున్న ఒక తల్లి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూలై 7 ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఫణీంద్ర, మహేంద్ర. అప్పుడే అక్కడికి వచ్చిన జగతి మీరు చెప్పిన డాక్యుమెంట్స్ రెడీ చేశాను బావగారు మీరు సైన్ పెట్టడమే లేటు అంటుంది. ఇలా ఇవ్వు అని చెప్పి ఆ ఫైల్ మీద సైన్ చేస్తాడు ఫణీంద్ర. అది గమనించిన దేవయాని, శైలేంద్ర అది ఏం ఫైలో అనుకుంటూ అక్కడికి వస్తారు.
అదే విషయం వెంటనే తండ్రిని అడుగుతాడు శైలేంద్ర. మిషన్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన అథారిటీస్ అన్ని జగతి కి అప్పగిస్తున్నట్లు డాక్యుమెంట్స్ ఇవి మీరు కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కాబట్టి మీరు కూడా సంతకాలు పెట్టండి అంటాడు ఫణీంద్ర. ఎలాగో ఆ పనులన్నీ పిన్ని చూసుకుంటుంది కదా ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ అవన్నీ ఎందుకు అంటాడు శైలేంద్ర.
మినిస్టర్ గారు చెప్పారంట అని చెప్తాడు ఫణీంద్ర. మిషన్ ఎడ్యుకేషన్ పనులు అందరం కలిసే చేస్తాము కానీ నా డైరెక్షన్లో జరుగుతాయి. నా డైరెక్షన్లో వర్క్ చేయడం నీకు ఇష్టం లేదా అని శైలేంద్ర ని అడుగుతుంది జగతి. అలా ఏం లేదు అని చెప్పి పక్కన తండ్రి ఉండటంతో జగతిని ఏమీ అనలేక కోపంతో సైన్ పెట్టేస్తారు తల్లి కొడుకులు. అందరూ అక్కడినుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏ ధైర్యంతో చేస్తున్నావు అని దేవయాని అడుగుతుంది.
నా కొడుకు కోసం చేస్తున్నాను వాడే నా ధైర్యం. ఇకమీదట మీరు ఏమి చేయలేరు నేను చేసేది చూస్తూ ఉండండి అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది జగతి. ఇదంతా మహేంద్ర వింటాడు. మరోవైపు ప్రిన్సిపల్ వసుధార కి ఫోన్ చేసి ఒక సెమినార్ కండక్ట్ చేస్తున్నాము దాంట్లో మీరు పార్టిసిపేట్ చేస్తారా చేస్తాను అంటే కారు పంపిస్తాను అంటాడు. ఇలాంటి ప్రోగ్రామ్స్ నాకు చాలా ఇంట్రెస్ట్ పార్టిసిపేట్ చేస్తాను అంటుంది వసుధార.
సరే అయితే కార్ పంపిస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ప్రిన్సిపల్. మరోవైపు గదిలోకి వచ్చిన భార్యతో నువ్వు వదిన గారితో శైలేంద్ర తోనే అంత ధైర్యంగా మాట్లాడుతున్నావు మళ్లీ వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటారేమో అంటాడు మహేంద్ర. లేదు మహేంద్ర నేను ధైర్యంగా మాట్లాడితే వాళ్లు కాస్త తగ్గుతారు. నేను చేస్తున్న పనుల మీద కాకుండా నేను ఎందుకిలా మాట్లాడుతున్నాను అని ఆలోచిస్తారు.
అయినా ఒకసారి భయపడినందుకే నా కొడుకు ని కోల్పోయాను నా బాధంతా రిషి, వసుధార ల గురించే అని బాధపడుతుంది జగతి. నువ్వేమీ బాధపడకు అందర్నీ అర్థం చేసుకునే రిషి నిజం తెలుసుకునే రోజు నిన్ను కూడా అర్థం చేసుకుంటాడు అని ధైర్యం చెప్తాడు మహేంద్ర. మరోవైపు లంచ్ అవర్ లో లెక్చరర్స్ అందరూ కూర్చుంటారు అప్పుడే అక్కడికి వచ్చిన రిషితో సెమినార్ గురించి మాట్లాడుతారు లెక్చరర్స్.
మీకు లీజర్ ఎప్పుడో చెప్తే దీని గురించి డిస్కస్ చేద్దాం అంటాడు రిషి. ఈవినింగ్ క్లాసులు అయిపోయాక వన్ అవర్ కూర్చుందాం సార్ అప్పుడైతే క్లాసులు ఉండవు. అప్పుడైతే వసుధార మేడం కూడా వస్తారంట అంటుంది లెక్చరర్. ఆవిడ ఎందుకు వస్తుంది ఆవిడకి హెల్త్ బాలేదు కదా ఈ ప్రోగ్రామ్ ముఖ్యమో హెల్త్ ముఖ్యమా అంటూ కోపంతో ఊగిపోతాడు రిషి. అతని ప్రవర్తనకి లెక్చరర్స్ షాకవుతారు.
ఏమో సర్ ప్రిన్సిపాల్ సర్ చెప్పారు అంటుంది లెక్చరర్. నేను వసుధారతో ఈ సెమినార్ గురించి డిస్కస్ చేస్తాను తర్వాత మీతో డిస్కస్ చేస్తాను తనైతే ఇక్కడికి రాదు అని చెప్తాడు రిషి. ఉన్నట్టుండి వైల్డ్ గా మాట్లాడుతున్నారేంటి ఈయనకి షార్ట్ టెంపర్ ఉందా అనుకుంటాడు ఒక లెక్చరర్. మరోవైపు భోజనాలు చేస్తూ మేము బయటికి వెళ్తున్నాము. వచ్చేసరికి రెండు మూడు రోజులు టైం పడుతుంది అని దేవయాని వాళ్ళకి చెప్తుంది జగతి.
ఎందుకు ఎక్కడికి అని కంగారుగా అడుగుతారు దేవయాని, శైలేంద్ర. అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాము ఒక ముఖ్యమైన పని మీద అంటాడు మహేంద్ర. నన్ను కూడా తీసుకెళ్లొచ్చు కదా నేను కూడా కాలేజీకి సంబంధించిన విషయాలు నేర్చుకుంటాను అంటాడు శైలేంద్ర. ఇది నువ్వు నేర్చుకునేది కాదులే అని చెప్తాడు మహేంద్ర. జగతి దంపతుల ప్రవర్తన చూసి పిన్ని బాబాయ్ కి నిజం చెప్పేసిందా అని అనుమానపడతాడు శైలేంద్ర. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.