MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Divya Saasha: 'తేరి' పాప దివ్యా సాషానేనా ఇది? హీరోయిన్‌లా మారిపోయిన సీఎం విజయ్ కూతురు.. ఫోటోలు వైరల్!

Divya Saasha: 'తేరి' పాప దివ్యా సాషానేనా ఇది? హీరోయిన్‌లా మారిపోయిన సీఎం విజయ్ కూతురు.. ఫోటోలు వైరల్!

సీఎం విజయ్ కూతురు దివ్యా సాషా తన అన్నయ్య డైరెక్ట్ చేసిన 'సిగ్మా' సినిమా చూసేందుకు థియేటర్‌కు వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 03 2026, 03:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సిగ్మా సినిమా చూసేందుకు వచ్చిన విజయ్ కూతురు
Image Credit : X

సిగ్మా సినిమా చూసేందుకు వచ్చిన విజయ్ కూతురు

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, సంగీత దంపతులకు పెళ్లై 25 ఏళ్లు దాటింది. వీరికి జేసన్ సంజయ్ అనే కొడుకు, దివ్యా సాషా అనే కూతురు ఉన్నారు. జేసన్ సంజయ్ ఇప్పటికే డైరెక్టర్‌గా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. తను డైరెక్ట్ చేసిన 'సిగ్మా' సినిమా ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. మరోవైపు విజయ్ కూతురు దివ్యా సాషా ఏం చేస్తుందనేది అందరికీ ఆసక్తిగా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వైరల్ అవుతున్న దివ్యా సాషా ఫోటోలు
Image Credit : X

వైరల్ అవుతున్న దివ్యా సాషా ఫోటోలు

చాలా రోజులుగా చెన్నైలో కనిపించని దివ్యా సాషా.. నిన్న తన అన్నయ్య జేసన్ సంజయ్ డైరెక్ట్ చేసిన 'సిగ్మా' ఫస్ట్ షో చూసేందుకు చెన్నైలోని కమలా థియేటర్‌కు వచ్చారు. తల్లి సంగీతతో కలిసి ఆమె థియేటర్‌కు వచ్చిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సీఎం కూతురు అనే ఎలాంటి బేషజాలు లేకుండా, చాలా సింపుల్‌గా వచ్చి సినిమా చూసి వెళ్లడం అందరి దృష్టిని ఆకర్షించింది.

35
చదువుపైనే పూర్తి ఫోకస్
Image Credit : X

చదువుపైనే పూర్తి ఫోకస్

దీంతో దివ్యా సాషా గురించి నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారు. 2005లో పుట్టిన దివ్యా సాషా.. చిన్నప్పటి నుంచి చదువుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. చెన్నైలోని AISC స్కూల్‌లో ఆమె తన స్కూలింగ్ పూర్తి చేశారు. చదువుతో పాటు ఆటలంటే కూడా ఆమెకు చాలా ఇష్టం. ముఖ్యంగా బ్యాడ్మింటన్‌లో మంచి టాలెంట్ ఉన్న దివ్యా.. స్కూల్ స్థాయి పోటీల్లో కూడా పాల్గొన్నారు.

45
'తేరి' సినిమాతో ఎంట్రీ
Image Credit : instagram

'తేరి' సినిమాతో ఎంట్రీ

కేవలం విజయ్ కూతురిగానే కాకుండా, చిన్న వయసులోనే దివ్యా సాషా వెండితెరపై కూడా కనిపించారు. అట్లీ డైరెక్షన్‌లో విజయ్ నటించిన 'తేరి' సినిమా 2016లో రిలీజైంది. ఈ సినిమా క్లైమాక్స్‌లో విజయ్ కూతురిగా దివ్యా సాషా ఓ చిన్న క్యారెక్టర్ చేశారు. అప్పట్లో ఆ సీన్స్ చూసి విజయ్ అభిమానులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత ఆమె మరే సినిమాలోనూ నటించలేదు. ఇప్పటివరకు తన చదువుపైనే ఆమె ఫోకస్ పెట్టారు.

55
సినిమాల్లో హీరోయిన్‌గా వస్తుందా?
Image Credit : X

సినిమాల్లో హీరోయిన్‌గా వస్తుందా?

విజయ్ టాప్ హీరోగా, కొడుకు జేసన్ సంజయ్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న టైమ్‌లో.. దివ్యా సాషా కూడా సినిమాల్లోకి వస్తుందా అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. కానీ ప్రస్తుతం ఆమె తన హయ్యర్ ఎడ్యుకేషన్ మీద మాత్రమే దృష్టి పెట్టారు. లండన్‌లో ఉంటూ చదువుకుంటున్న దివ్యా సాషా.. ఫ్యూచర్‌లో ఫుల్ టైమ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందా లేదా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jr NTR: చుట్టమల్లే సాంగ్ పై దారుణమైన ఏఐ వీడియో, కట్టలు తెంచుకున్న ఎన్టీఆర్ కోపం.. ఆ నీచుల్ని అస్సలు వదలను
Recommended image2
Vijay Rashmika New House: లగ్జరీ విల్లా కొనుగోలు చేసిన విజయ్ దేవరకొండ, రష్మిక.. వేరు కాపురం పెట్టబోతున్నారా ?
Recommended image3
Rachita Ram: మొన్న రజినీకాంత్ తో, ఇప్పడు చిరంజీవితో.. దూసుకుపోతున్న డింపుల్ క్వీన్
Related Stories
Recommended image1
Jr NTR: చుట్టమల్లే సాంగ్ పై దారుణమైన ఏఐ వీడియో, కట్టలు తెంచుకున్న ఎన్టీఆర్ కోపం.. ఆ నీచుల్ని అస్సలు వదలను
Recommended image2
Chiranjeevi: 40 ఏళ్ళు పూర్తి చేసుకున్న చిరంజీవి సినిమా, 100 కేజీఎఫ్ లతో సమానం..పేరు లేకుండానే సూపర్ హిట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved