Prema Entha Maduram: అనుకు పిచ్చి పట్టిందన్న సిఐ.. షాకైనా సుబ్బు ఏం చెయ్యనున్నాడు?
Prema Entha Maduram: బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రేమ ఎంత మధురం (Prema Entha Maduram) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇరవై సంవత్సరాల క్రితం రాగ సుధ (Ragsudha) తప్పి పోయినట్లు ఒక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందని సిఐ సుబ్బుకు చెప్పి వాళ్ళని కాసేవు స్టేషన్ లో ఉంచుతాడు. మరోవైపు మాన్సీ, నీరజ్ (Neeraj) అన్న మాటలకు చిరాకు పడుతూ ఉండగా అక్కడకు రఘురామ్ వచ్చి మాన్సీ చెయ్యి పట్టుకుంటాడు. దాంతో మాన్సీ చెంప మీద గట్టిగా కొడుతుంది.
ఆ తర్వాత వ్యక్తి ఆర్య వర్ధన్ (Arya vardhan) గారు కంపెనీ ఎంప్లాయిస్ అందరికీ ప్లాట్లు కట్టించి డిస్ట్రిబ్యూట్ చేసే పనిలో ఉన్నారట మేడం అని చెప్పగా మాన్సీ షాక్ అవుతుంది. ఆ తర్వాత స్టేషన్ కి యస్ఐ రాగ టిఫిన్ బండి దగ్గర రివాల్వర్ మర్చి పోయినందుకు వార్నింగ్ ఇస్తాడు సీఐ.
ఆ తర్వాత సీఐ కంప్లైంట్ చేసిన అమ్మాయి గురించి అడగగా ఎస్ఐ పద్దుల అనురాధ (Anuradha) అని చెబుతాడు. దాంతో సుబ్బు షాక్ అవుతాడు. ఒక అమ్మాయి టిఫిన్ బండి దగ్గరకు వచ్చిన సంగతి కూడా చెబుతాడు. దాంతో సుబ్బు (Subbu) ఆ మ్మాయి మా అమ్మాయి అని చెబుతాడు.
ఆ తర్వాత సిఐ అను (Anu) ని స్టేషన్ కి రమ్మను అని చెబుతాడు. ఆ తర్వాత ఎస్ ఐ అను కి కాల్ చేసి మీ అక్క మా పోలీస్ స్టేషన్ లోనే ఉంది మేడం అని చెప్పగా.. మేమిద్దరం ఆల్రెడీ కలిశాము. మాకు ఏం ప్రాబ్లం లేదు అని చెబుతుంది అను.ఇక ఈ విషయం గురించి పక్కనే ఉన్న ఆర్య (Arya) అడుగుతాడు.
దాంతో అను (Anu) వేరే విషయం చెప్పి కవర్ చేసుకుంటుంది. ఆ తర్వాత సి ఐ వీళ్ళని ఇంటికి పంపించమని చెప్పి మీ అమ్మాయి మెంటల్ కండిషన్ బాగానే ఉంది కదా అని సుబ్బును అడుగుతాడు. దాంతో సుబ్బు (Subbu) షాక్ అవుతాడు.
అదే క్రమంలో.. మీ అమ్మాయికు ఏ సమస్య లేకపోతే ఇరవై సంవత్సరాల క్రితం మిస్సైన వాళ్ల గురించి అడుగుతుందా అంటూ.. ఏంటయ్యా మాకు ఈ గోల అని సుబ్బుని (Subbu) అడుగుతాడు. ఆతరువాత సుబ్బు, రాగసుధను (Ragasudha) అసలు ఏం జరుగుతుంది అమ్మ అని అడుగుతాడు.