- Home
- Entertainment
- పక్కనే కూర్చొని శ్రద్దాని ఇబ్బంది పెట్టిన జానీ మాస్టర్, హాట్ గా ఉన్నావంటూ కామెంట్... హైపర్ ఆది చెప్పిన నిజాలు!
పక్కనే కూర్చొని శ్రద్దాని ఇబ్బంది పెట్టిన జానీ మాస్టర్, హాట్ గా ఉన్నావంటూ కామెంట్... హైపర్ ఆది చెప్పిన నిజాలు!
డాన్స్ రియాలిటీ షో ఢీ జడ్జి శ్రద్దా దాస్ ని పక్కనే కూర్చొని మరో జడ్జి జానీ మాస్టర్ ఇబ్బంది పెట్టాడట. నువ్వు హాట్ గా ఉన్నావని కామెంట్ చేశాడని ఆమె నేరుగా చెప్పగా, ఆది ఆ ఇబ్బంది గురించి మాట్లాడాడు.

ఢీ సీజన్ 14 చివరి దశకు చేరుకుంది. నెక్స్ట్ ఎపిసోడ్ జడ్జెస్ గా గణేష్ మాస్టర్, జానీ మాస్టర్, హీరోయిన్ శ్రద్దా దాస్ వ్యవహరించారు. ఢీ అంటే దుమ్ము రేపే డాన్స్ లతో పాటు హైపర్ ఆది మార్క్ కామెడీ కామన్. ఆయన నాన్ స్టాప్ పంచెస్ ప్రేక్షకులకు నవ్వులు పంచుతాయి.
పక్కనే ఉన్న అఖిల్ సార్థక్ ని ఇండస్ట్రీకి వచ్చి ఎన్నాళ్ళు అవుతుందని హైపర్ ఆది అడిగారు. పదేళ్లు అవుతుందని అఖిల్ చెప్పాడు. ఎంత సంపాదించావని హైపర్ ఆది మరో ప్రశ్న అడగ్గా... చాలా సంపాదించానని చెప్పాడు. అసలు ఏమీ చేయకుండానే ఇంత సంపాదించావంటే, ఏమైనా చేస్తే ఎంత సంపాదించేవాడివో అంటూ పంచ్ వేశాడు. దానికి అందరూ గట్టిగా నవ్వేశారు.
అనంతరం జడ్జి శ్రద్దా దాస్ ని ఆది ఓ ప్రశ్న అడిగారు. గణేష్, జానీ మాస్టర్స్ లో నాటీ ఎవరు? స్వీటీ ఎవరు? అన్నారు. జానీ మాస్టర్ నాటీ.. గణేష్ మాస్టర్ స్వీటీ అని శ్రద్దా చెప్పింది. అయితే జానీ నాటీనా? అని ఆది మరలా అడిగారు. కచ్చితంగా జానీ నాటీ అంటూ మరోసారి శ్రద్ద బల్ల గుద్ది చెప్పింది. పక్కనే కూర్చొని ఎంత ఇబ్బంది పెడితే ఇలా చెప్పిందని ఆది అన్నాడు.
తర్వాత శ్రద్దా... జానీ మాస్టర్ ఇవాళ నాకు ఓ కాంప్లిమెంట్ ఇచ్చాడని చెప్పింది. ఏమన్నాడని ఆది ఆసక్తిగా అడిగారు. నువ్వు చాలా హాట్ గా ఉన్నావ్ అన్నాడు.. అని చెప్పడంతో ఆది అవాక్కయ్యాడు. అరుంధతి ని పశుపతి కూడా ఇంత ఇబ్బంది పెట్టలేదని హైపర్ ఆది మరో పంచ్ వేశాడు. హైపర్ ఆది పంచ్ కి అందరూ గట్టిగా నవ్వేశారు.
శ్రద్ద ప్రక్కనే కూర్చొని జానీ మాస్టర్ ఆమెకు లైన్ వేస్తున్నాడని, ఇబ్బంది పెడుతున్నాడని ఆది ఫన్నీగా చెప్పాడు. ఢీ లేటెస్ట్ ప్రోమోలో చోటు చేసుకున్న ఈ సరదా సన్నివేశాలు నెక్స్ట్ ఎపిసోడ్ పై ఆసక్తి పెంచేశాయి. ఈ మధ్య ప్రియమణి కూడా ఢీ షోలో కనిపించడం లేదు. ఇప్పటికే పూర్ణ, సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ షోని వీడి వెళ్లిపోయారు.