అల్ట్రా స్టైలిష్ లుక్ లో చియాన్ విక్రమ్, వైరల్ అవుతున్న ఫోటోస్..
ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు తమిళ స్టార్ సీనియర్ హీరో చియాన్ విక్రమ్. సినిమాకో ప్రయోగం.. కొత్త లుక్ తో ఫ్యాన్స్ కు కనువిందు చేస్తున్నాడు విక్రమ్. తాజాగా అల్ట్రా స్టైలీష్ లుక్ లో మెరిసిపోతున్నాడు

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు విక్రమ్. చియాన్ విక్రమ్ గా తమిళనాట స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్న ఈహీరో.. గెలుపు ఓటములకు బెదరకుండా.. తను అనుకున్న సినిమాలు చేస్తున్నాడు. అందులో కొన్నిహిట్ అయినా.. కొన్ని ఫట్అయినా.. ఏమాత్రం చెక్కు చెదరడంలేదు. ఇక తాజాగా విక్రమ్ సిరికొత్త అవతారం ఎత్తాడు.
ఆరు పదుల వయస్సు దగ్గరకొస్తున్నా.. అల్ట్రా స్టైలీష్ లుక్ లో మెరిసిపోతున్నాడు విక్రమ్. ముసలి ఛాయలేమీ కనిపించకుండా పర్ఫెక్ట్ ఫిజిక్‌ను మెయింటైన్ చేస్తూ.. ఎప్పటికపుడు కొత్త కొత్త లుక్‌లో కనిపిస్తూ.. యంగ్ హీరోలు కూడా కుళ్లుకునేలా స్టూలిష్ గా కనిపిస్తున్నాడు విక్రమ్ తాజాగా తంగలాన్ చిత్రంలోనటిస్తున్నాడు.
ఈసినిమాలో డీగ్లామరైజ్‌డ్ లుక్‌లో కనిపించబోతున్నాడు విక్రమ్. అది అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక విక్రమ్.. తాజాగా ఎవరూ ఊహించని ట్రాన్స్‌ఫార్మేషన్‌లోకి మారిపోయాడు. హ్యాండ్సమ్ స్టార్ అనే పదానికి అర్ధం తీసుకువచ్చాడు. అపరిచితుడు సినిమాలో రెమో గుర్తున్నాడా.. అందులో కంటే కూడా ఎక్కువగా హ్యాండ్సమ్ లుక్ లో కనిపిస్తున్నాడు.
గజినీ సినిమా గుండులుక్ లో .. పొట్టిహెయిర్‌లో బ్లాక్ గ్లాగుల్స్ పెట్టుకుని బ్రాండ్ కాస్ట్యూమ్‌లో స్టైలిష్‌గా మెస్మరైజ్ చేస్తూ.. ఔరా అనిపిస్తున్నాడు విక్రమ్. ఇంతకీ తాజా లుక్ ఏదైనా ఫొటోషూట్‌కు సంబంధించిందా..? లేదా కొత్త సినిమా లుక్ అనేది తెలియాల్సి ఉంది.
ఇక వరుస సినిమాలతో దూసుకుపోతున్న విక్రమ్ ఈ ఏడాది.. మణిరత్నం డైరెక్న్ లో రెండు భాగాలుగా వచ్చిన... భారీ మల్టీస్టారర్ పొన్నియన్ సెల్వన్ సినిమాల్లో నటించి మెప్పించాడు . ఈసినిమాలో మెయిన్ క్యారెక్టర్ అయిన ఆదిత్య కరికాలన్ పాత్రలో అదిరిపోయే యాక్టింగ్‌తో అందరికి ఆకర్శించాడు. ప్రస్తుతం విక్రమ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడు.
ఇక ఆయన నటిస్తున్న ప్రాజెక్ట్ లలో యంగ్ డైరెక్టర్ పా.రంజిత్ డైరెక్ట్ చేస్తున్న తంగలాన్ కూడా ఒకటి. తమిళంలో అడ్వెంచరస్ సినిమాగా తెరకెక్కుతున్న ఈమూవీ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ తో రాబోతోంది. ఈసినిమాను చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్.. ఇ ఈమూవీని 2024 ఫస్ట్ క్వాటర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ఇప్పటికే ఈసినిమానుంచి విక్రమ్ లుక్ తో పాటు.. తంగలాన్ గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. మాళవికా మోహనన్, పార్వతి తిరువొత్తు హీరోయిన్లుగా నటిస్తున్న ఈసినిమాను స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. 2డీ, 3డీ ఫార్మాట్లలో కూడా ఈసినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.