- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: భయంతో వణికిపోతున్న చిత్ర.. పిల్లల్ని అలా చూసి మురిసిపోతున్న యష్?
Ennenno Janmala Bandham: భయంతో వణికిపోతున్న చిత్ర.. పిల్లల్ని అలా చూసి మురిసిపోతున్న యష్?
Ennenno Janmala Bandham: స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. తన బాస్ వలలో చిక్కుకొని బయటికి రాలేక సతమతమవుతున్న ఒక ఎంప్లాయ్ కధ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో సులోచన, సుహాసిని ఇద్దరూ డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సంగీత్ లో ఆడపెళ్లి వాళ్ళమే గెలవాలి అంటుంది సులోచన. నువ్వు ఇలాంటి ఓల్డ్ స్టెప్స్ వేస్తే మనం పోటీలో గెలవము అని ఆట పట్టిస్తుంది సుహాసిని. అలా ఏం కాదు అత్తగారు డాన్స్ చేస్తే అదిరిపోతుంది అంటూ ఎంకరేజ్ చేస్తాడు సుహాసిని భర్త.
మీ అత్తగారు ఒకసారి నడుం తిప్పేసరికి పాట మొత్తం పూర్తయిపోతుంది అంటూ ఆట పట్టిస్తాడు శర్మ. అంతలోనే అక్కడికి చిత్ర వస్తుంది. ముభావంగా ఉన్నా చిత్రని చూసి తనకి వాళ్ళ ఆయనకే కలిపి డాన్స్ పెట్టలేదని చిత్ర ఫీలవుతున్నట్లుగా ఉంది అయినా ఏం పర్వాలేదు పెళ్లయ్యాక కావాలంటే డాన్స్ వేసుకోండి ఇప్పుడు మాత్రం వాళ్లు మనకి కాంపిటేటర్స్ అంటాడు సుహాసిని భర్త.
ఇవన్నీ అవసరమా అంటుంది చిత్ర. వేద పెళ్లిలో ఎలాగూ ఎంజాయ్ చేయలేదు ఇప్పుడైనా ఎంజాయ్ చేద్దాం అంటాడు సుహాసిని భర్త. మరోవైపు మాలిని వాళ్ళు కూడా డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. నానమ్మ డాన్స్ ప్రాక్టీస్ బాగా చేయండి అక్కడ అమ్మమ్మ వాళ్ళు గెలవాలని తెగ ప్రయత్నిస్తున్నారు అంటుంది ఖుషి. ఏం పర్వాలేదు మనమే గెలుస్తాము అంటుంది మాలిని.
పొత్రం లాగా ఉన్నావు నువ్వేమీ గెలుస్తావు మేమే గెలుస్తాము కావాలంటే చూడండి అంటూ అక్కడికి వస్తుంది సులోచన. నన్నే పొత్రం అంటావా అంటూ మళ్ళీ ఇద్దరూ గలాటా పెట్టుకుంటారు. ఆపటానికి వచ్చిన వసంత్ ని పక్కకి తోసేస్తారు. అప్పుడు అక్కడే ఉన్న యష్ అత్తయ్య గారు మిమ్మల్ని ఇందాక ఎవరో పిలిచారు చెప్పడం మర్చిపోయాను అంటాడు.
అవునా అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సులోచన. డాన్స్ ప్రాక్టీస్ కోసమని చెప్పి మాలిని వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అందరం ఇక్కడే ఉన్నాము కానీ చిత్ర కనిపించడం లేదేంటి అంటుంది వేద. పిన్ని రూమ్ లో ఉంది ఎందుకో డల్ గా వుంది అని చెప్తుంది ఖుషి. అవునా అంటూ ఆమె దగ్గరికి వెళుతుంది వేద. ఎందుకు ఇలా ఉన్నావు ఏమైంది అని నిలదీస్తుంది.
నిజం చెప్తే మళ్ళీ గొడవలు అయిపోతాయి అనుకోని ఏమీ లేదు అంటూ ముభావంగా చెప్తుంది చిత్ర. ఈ కంగారు ప్రతి పెళ్లికూతురుకి ఉండేదే. కొత్త ఇంట్లో ఎలా మసలుకోవాలా అని భయం. కానీ నీకు ఆ భయం అక్కర్లేదు కదా ఇక్కడ నీకు కొత్త వారెవరున్నారు చెప్పు. నువ్వు కూడా మన మన అపార్ట్మెంట్ లోనే ఒక ఫ్లాట్ తీసుకుందువుగానివి అని చెల్లెలికి ధైర్యం చెప్తుంది వేద.
అది కాదక్క ఇప్పుడు ఈ సంగీత్ అది అవసరమా చిన్న పొరపాటు కే పెద్ద రియాక్షన్ ఇస్తుంది మాళవిక ఇప్పుడు ఆమెకి అభి తోడయ్యాడు అని కంగారుగా చెప్తుంది చిత్ర. ఇదా నీ కంగారుకి కారణం అయితే సంగీత్ క్యాన్సిల్ చేసేద్దాం అంటుంది వేద. ఆ తర్వాత యష్ దగ్గరికి వెళ్తుంది. అతను డాన్స్ గురించి ఏదో మాట్లాడుతుంటే సంగీత్ క్యాన్సిల్ అయింది అని చెప్తుంది వేద.
అవునా అంటూ ఏదో మాట్లాడుతూ వేద అందాన్ని వర్ణిస్తాడు యష్. మీకు పిచ్చి పట్టింది అంటుంది వేద. అవును నీ పిచ్చే అంటాడు యష్. కబుర్లు ఆపండి అందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారు పదండి అని వేదా అనడంతో ఇద్దరు బయటికి వస్తారు. అదే సమయంలో హాల్లో అందరూ కూర్చొని సంగీత్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే చిత్ర వాళ్లు కూడా వస్తారు.
పిన్నిని ఏమైనా అన్నావా బాబాయ్ ఎందుకు డల్ గా ఉంది అని అడుగుతుంది ఖుషి. ఏమో తెలియదు అడిగితే నిజం చెప్పడం లేదు సంగీత్ కూడా క్యాన్సిల్ చేసేయమంది అంటాడు వసంత్. సంగీత్ క్యాన్సిల్ అయిపోయిందా మేము చాలా కష్టపడి ప్రాక్టీస్ చేసాము అంటారు మాలిని దంపతులు సులోచన దంపతులు. నేనే క్యాన్సిల్ చేయమన్నాను డాన్స్లు చేసి అలసిపోతే పెళ్ళికి బాగా ఎంజాయ్ చేయలేము అంటుంది వేద.
తరువాయి భాగంలో పెళ్లికి వచ్చిన ఆదిత్య ని మాలిని ముద్దులాడుతుంది. నాన్న నన్ను ప్రతి రెండు రోజులకు ఒకసారి వచ్చి చూస్తున్నాడు అని నానమ్మకి చెప్తాడు ఆదిత్య. మనవడిని ముద్దులాడుతూ మీ నాన్నకి నువ్వంటే ప్రాణం అంటుంది మాలిని. ఖుషి ఆదిత్య కి భోజనం తినిపిస్తుంది. వాళ్ళిద్దర్నీ చూసి మురిసిపోతాడు యష్. వేదకి థాంక్స్ చెప్తాడు.