Ennenno Janmala Bandham: గొడవ పడుతున్న వేద, యష్ ను చూసేసిన ఖుషి..!
Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennnenno Janmala bandam) సీరియల్ మంచి ప్రేమకథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ రోజు ఏప్రిల్ 5 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే చిత్ర (Chithra) నువ్వు నాకు ద్రోహం చేయడానికి సిద్ధమయ్యావు అని వసంత్ (Vasanth) ను అంటుంది. అంతేకాకుండా నువ్వు ఇప్పుడు మీ యష్ చెప్పు చేతల్లో ఉన్నావు అని అంటుంది. అదే క్రమంలో నాకోసం బ్రతుకుతా అని ఒక మాట చెప్పు నీకోసం నేను చావడానికి సిద్ధం అని చిత్ర అంటుంది.
ఇక వసంత్ చిత్ర (Chithra) మీద ప్రేమ ఉన్నప్పటికీ.. తన అన్నయ్య పర్మిషన్ కోసం ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత యష్ తన అత్తమామలు దగ్గరికి వెళ్లి ఒక హెల్ప్ అంటాడు. దామోదరం (Damodaram) గారి చెల్లెలు పని మీద హైదరాబాద్ వస్తుంది. ఆమెను కొన్ని రోజులు ఇంట్లో ఉంచుకోవాలి అని అంటాడు.
సులోచన (Sulochana) దంపతులు ఆ విషయాన్ని ఆనందంగా యాక్సెప్ట్ చేస్తారు. ఇక యష్ (Yash) మాటలు విన్న వేద వాళ్ల తలిదండ్రులను పక్కకు పిలిచి పరాయి వాళ్ళ ను మన ఇంట్లో ఉంచడం ఏమిటి అని యష్ ప్లాన్ చెడగొట్టేలా చేస్తుంది. ఇక అల్లుడుగారు నోరు తెరిచాడు అడిగాక మేము చేయాలి అని సులోచన దంపతులు అంటారు.
ఇక ఆల్రెడీ ఆ అమ్మాయి హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యింది పికప్ చేసుకోవడానికి వసంత్ (Vasanth) ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాడు అని యష్ తన అత్తగారి తో అంటాడు. ఇక వేద, చిత్ర లు వినేలాగా షి ఈజ్ వెరీ ఎట్రాక్టివ్ అండ్ క్లాసిక్ అని అంటాడు. మరోవైపు వసంత్ నిధి (Nidhi) ను కారులో తీసుకొని వస్తుంటాడు.
ఆ తరువాత చిత్ర (Chithra) వసంత్ కు కాల్ చేసి నిధిని తీసుకు వస్తున్నందుకు జలసీగా చిరాకు పడుతూ ఉంటుంది. ఇక వేద యష్ దగ్గరకి వచ్చి ఆ అమ్మాయిని ఎవర్నో తీసుకుని వచ్చి మా ఇంట్లో పెట్టడం ఏంటి అని అడుగుతుంది. ఆ విషయంలో యష్ (Yash), వేదల మధ్య చాలా పెద్ద క్లాష్ జరుగుతుంది.
ఇక తరువాయి భాగం లో యష్ (Yash) తన అత్తగారింట్లో కూరగాయలన్నీ వేద తో కట్ చేపిస్తూ ఉంటాడు. అంతేకాకుండా నీ లాంటి అమ్మాయి తో ఆడుకోవడంలో ఉన్న కిక్కే వేరు అని ఆనంద పడతాడు. దాంతో వేద (Vedha) రివర్స్ లో యష్ చేత కూరగాయలు కట్ చేయిస్తుంది.