MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Raasi: అప్పుడు లేని బాధ ఇప్పుడెందుకు, రాశికి ఇచ్చిపడేసిన అనసూయ.. నా పేరు వాడితేనే వాళ్లకి పాపులారిటీ

Raasi: అప్పుడు లేని బాధ ఇప్పుడెందుకు, రాశికి ఇచ్చిపడేసిన అనసూయ.. నా పేరు వాడితేనే వాళ్లకి పాపులారిటీ

మహిళల డ్రెస్సులపై వివాదం నడుస్తోన్న నేపథ్యంలో అనసూయకి నటి రాశి కౌంటర్‌ ఇచ్చింది. దీనికి అనసూయ కూడా సారీ చెప్పింది. కానీ ఆ విషయంపై మరోసారి అనసూయ రియాక్ట్ అయ్యింది. ఇది రచ్చ లేపుతుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 09 2026, 04:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మహిళల విషయంలో అనసూయ డేర్‌ రియాక్షన్‌
Image Credit : youtube/@iDreamCelebrities

మహిళల విషయంలో అనసూయ డేర్‌ రియాక్షన్‌

టాలీవుడ్‌లో మహిళలకు సంబంధించిన చాలా వివాదాల్లో అనసూయ పేరు వినిపిస్తుంటుంది. పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ఆమెని ఇన్‌ వాల్వ్ చేస్తుంటారు. మహిళల ఫ్రీడమ్‌కి సంబంధించిగానీ, వాళ్లని తక్కువ చేసి మాట్లాడే విషయంలో ఆమె ఎప్పటికప్పుడు ఖండిస్తుంటుంది. కౌంటర్‌ ఇస్తుంటుంది. ఘాటుగా రియాక్ట్ అవుతూ మహిళా శక్తిని చాటే ప్రయత్నం చేస్తుంటుంది. ఈ విషయంలో ఎవరికీ తాను బయపడదు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని, తన అభిప్రాయాన్ని గట్టిగానే చెబుతుంది అనసూయ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
శివాజీ కామెంట్ల విషయంలో వివాదంలో ఇరుక్కున్న అనసూయ
Image Credit : instagram/@itsme_anasuya

శివాజీ కామెంట్ల విషయంలో వివాదంలో ఇరుక్కున్న అనసూయ

అయితే అనసూయ తన అభిప్రాయాలు చెప్పే క్రమంలో అవి వివాదాలుగా మారుతుంటాయి. దానికి మరికొంత మంది సెలబ్రిటీలు స్పందించడం, తను క్రేజీగా రియాక్ట్ కావడం, మీడియా సైతం దాన్ని హైలైట్‌ చేయడంతో అనసూయ హాట్‌ టాపిక్‌గా మారుతుంది. ఆమెనే చెప్పినట్టు కొంత కాలం ట్రోలర్స్ కి, మీడియాకి ఆమె కంటెంట్‌గా మారుతుంది. శివాజీ హీరోయిన్ల దుస్తులపై చేసిన కామెంట్లకి అనసూయ రియాక్ట్ కాగా, ఆ రచ్చ ఇంకా నడుస్తూనే ఉంది. అయితే లేటెస్ట్ గా నటి రాశి కూడా స్పందించింది. ఓ షోలో తనని డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌తో అవమానించిన విధానంపై ఆమె ఘాటుగా రియాక్ట్ అయ్యింది. దీనికి అనసూయ కూడా స్పందించి క్షమాపణలు చెప్పింది.

Related Articles

Related image1
The Raja Saab Movie Review: ది రాజా సాబ్ మూవీ రివ్యూ, రేటింగ్.. ప్రభాస్‌ ఇలా చేశాడేంటి?
Related image2
Anasuya: వామ్మో దాని గురించి మాట్లాడితే మరో 10 రోజులు స్టఫ్‌ అయిపోతా.. శివాజీపై మరో విధంగా సెటైర్లు
35
రాశికి అనసూయ క్రేజీ కౌంటర్‌
Image Credit : Asianet News

రాశికి అనసూయ క్రేజీ కౌంటర్‌

ఈ క్రమంలో మరోసారి రాశి మాటలకు స్పందించింది. అనసూయ నెటిజన్లు, తన అభిమానులతో చాట్‌ చేసింది. ఇందులో అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ముఖ్యంగా మీరు ట్రోల్‌ కి గురవుతున్నారనే ప్రశ్న రాగా, ఆమె అదిరిపోయే సమాధానం చెప్పింది. తన అభిప్రాయం బలంగా చెబుతానని, కానీ దాన్ని వివాదం చేస్తుంటారని వెల్లడించింది. ఈ క్రమంలోనే రాశికి సంబంధించిన ప్రశ్న వచ్చింది. ఆ షోలో నాగబాబు వంటి వారు ఉన్నారు, అప్పుడెందుకు దీన్ని ఖండించలేదనే ప్రశ్నకి అనసూయ సమాధానం చెప్పింది.

45
అప్పుడు లేని బాధ ఇప్పుడెందుకు
Image Credit : raasi instagram

అప్పుడు లేని బాధ ఇప్పుడెందుకు

అనసూయ మాట్లాడుతూ, `అప్పుడెప్పుడో జరిగిందానికి ఇప్పుడెందుకు అడిగారనేది నేను అడుతున్నానా? అప్పుడు లేని బాధ ఇప్పుడెందుకు అని నేను అడిగానా? తప్పు అనిపించింది కాబట్టి క్షమాపణలు అడిగాను. నేను తెలుగు రాకా అలా అనలేదు. తెలుగు రాని తనం అనే స్కిట్‌ పై చేసిన కామెడీ అది. ఇప్పుడు కూడా నాకు ఆ సినిమా పేరు తెలియదు. అది సినిమా స్ఫూఫ్‌ అని కూడా తెలియదు. నేను తిన్నింటి వాసాలు లెక్కపెట్టలేను. నేను ఇలాంటి స్కిట్లని చాలా సార్లు తిరస్కరించాను. కానీ ఆ షో క్రియేటివిటీ కోసం చేయాల్సి వచ్చింది. నాపై జోకులు వేస్తారు. వేరే వాళ్లపై వేస్తే తీసుకుంటారనుకున్నా, కానీ మేడమ్‌కి నచ్చలేదు అని చెప్పింది. అందుకే సారీ చెప్పాను, అంతేకాదు ఆ షో జర్నీ విషయంలో నాకు ఏం షేమింగ్‌ లేదు` అని వెల్లడించింది అనసూయ.

55
తన పేరుని వాడుకొని పాపులారిటీ
Image Credit : youtube/@iDreamCelebrities

తన పేరుని వాడుకొని పాపులారిటీ

ఈ సందర్భంగా మీ పేరు వాడితే, మీ గురించి మాట్లాడితేనే వాళ్లకి పాపులారిటీ వస్తుందని మరో నెటిజన్ అడగ్గా, అది అందరికి తెలుసు. కానీ ఒప్పుకోరు. నాకంటే ఎక్కువగా ఇలాంటివి మాట్లాడేవారు ఉంటారు. నాకంటే పెద్ద వాళ్లు కూడా ఉంటారు. కానీ నా పేరే తీస్తారు, నా గురించే మాట్లాడుతుంటారు. దానికి కారణం నా పేరు చెబితేనే వాళ్లు ఫేమస్‌ అవుతారు` అంటూ ఇచ్చిపడేసింది అనసూయ. పరోక్షంగా నటి రాశితోపాటు తనపై కామెంట్లు చేసిన చాలా మంది సెలబ్రిటీలకు ఆమె కౌంటర్ ఇచ్చిందని చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అనసూయ భరద్వాజ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bethlehem Kutumba Unit Movie Review: బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌ మూవీ రివ్యూ, మమితా బైజు సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Mokshagna: మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీపై క్లారిటీ? ముహూర్తం ఫిక్స్ చేసిన బాలకృష్ణ, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image3
Krishna Movies: కృష్ణాష్టమికి చూడాల్సిన 7 యానిమేటెడ్ సినిమాలు ఇవే!
Related Stories
Recommended image1
The Raja Saab Movie Review: ది రాజా సాబ్ మూవీ రివ్యూ, రేటింగ్.. ప్రభాస్‌ ఇలా చేశాడేంటి?
Recommended image2
Anasuya: వామ్మో దాని గురించి మాట్లాడితే మరో 10 రోజులు స్టఫ్‌ అయిపోతా.. శివాజీపై మరో విధంగా సెటైర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved