MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sankranti 2027 కి నలుగురు సీనియర్ల సినిమాలు, టాలీవుడ్‌ చరిత్రలో మొదటిసారి.. అభిమానులకు అసలైన పండగ

Sankranti 2027 కి నలుగురు సీనియర్ల సినిమాలు, టాలీవుడ్‌ చరిత్రలో మొదటిసారి.. అభిమానులకు అసలైన పండగ

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జున ఈ నలుగురు హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్‌ కావడం చాలా అరుదు. జరగలేదనే చెప్పాలి. కానీ వచ్చే సంక్రాంతి ఈ అరుదైన సందర్భం చోటు చేసుకోబోతుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 08 2026, 08:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
2027 సంక్రాంతికి చిరు, బాలయ్య, వెంకీ, నాగార్జున సినిమాలు
Image Credit : box office andhra

2027 సంక్రాంతికి చిరు, బాలయ్య, వెంకీ, నాగార్జున సినిమాలు

టాలీవుడ్‌లో ప్రస్తుతం నాలుగు స్థంభాలుగా నలుగురు హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జునలను పిలుస్తుంటారు. అయితే ఈ నలుగురి సినిమాలు ఒకేసారి విడుదలైన సందర్భాలు లేవనే చెప్పాలి. కానీ ఇప్పుడు మొదటిసారి ఈ నలుగురు హీరోలు ఒకేసారి రాబోతున్నారు. అది కూడా సంక్రాంతికి రానుండటం విశేషం. టాలీవుడ్‌ చరిత్రలోనే తొలిసారి ఇలాంటి అరుదైన సందర్భం రాబోతుంది. అందుకు వచ్చే సంక్రాంతి వేది క కాబోతుండటం విశేషం. వచ్చే2027 సంక్రాంతికి చిరంజీవి, నాగార్జున, బాలయ్య, వెంకటేష్‌ సినిమాలు విడుదలకు ప్లాన్‌ చేసుకుంటున్నారట.

25
బాబీతో చిరంజీవి మూవీ సంక్రాంతికే ప్లాన్‌
Image Credit : Instagram/Chiranjeevi

బాబీతో చిరంజీవి మూవీ సంక్రాంతికే ప్లాన్‌

చిరంజీవి ఈ సంక్రాంతికి `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీతో ఆడియెన్స్ ని అలరించారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రీజినల్‌ ఫిల్మ్స్ లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో వెంకటేష్‌ కీలక పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే. దీనితో సంక్రాంతి టేస్ట్ ఏంటో చిరంజీవి చూశారు. దీంతో వచ్చే సంక్రాంతిని కూడా టార్గెట్‌ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం చిరు.. బాబీ దర్శకత్వంలో మూవీ చేయబోతున్నారు. మార్చిలో ఇది ప్రారంభం కానుంది. ఇందులో మోహన్‌ లాల్‌ కనిపిస్తారని టాక్‌. ప్రియమణి హీరోయిన్‌గా ఫైనల్‌ అయ్యిందట. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

Related Articles

Related image1
Raviteja: ఈ స్టార్‌ హీరో వల్ల రవితేజకి 5 బ్లాక్‌ బస్టర్స్.. మాస్‌ మహారాజాకి లైఫ్‌ ఇచ్చింది ఎవరో తెలుసా?
Related image2
Balakrishna vs Rajasekhar: ప్రేమికులరోజు స్పెషల్‌గా రాజశేఖర్‌తో పోటీ పడి అడ్రస్‌ లేకుండాపోయిన బాలకృష్ణ సినిమా ఇదే
35
వెంకటేష్‌తో అనిల్‌ రావిపూడి మూవీ సంక్రాంతికి ఫిక్స్
Image Credit : Facebook / Venkatesh

వెంకటేష్‌తో అనిల్‌ రావిపూడి మూవీ సంక్రాంతికి ఫిక్స్

అదే సంక్రాంతికి వెంకటేష్‌ మూవీ కూడా కన్ఫమ్‌ అయ్యింది. వెంకటేష్‌ ఇప్పుడు త్రివిక్రమ్‌తో `ఆదర్శకుటుంబం` మూవీ చేస్తున్నారు. దీని తర్వాత అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయబతున్నారు. వీరి కాంబినేషన్‌లో ఇప్పటికే `ఎఫ్‌ 2`, `ఎఫ్‌3`, `సంక్రాంతికి వస్తున్నాం` వంటి చిత్రాలు వచ్చాయి. వీటితోపాటు ఈ సంక్రాంతికి `మన శంకర వర ప్రసాద్‌ గారు`లోనూ మెరిశారు. అనిల్‌ రావిపూడి సంక్రాంతి టార్గెట్‌ గా వచ్చి హిట్‌ కొడుతున్నారు. సంక్రాంతి పండక్కి ఉన్న సత్తా ఏంటో ఆయన బాగా చూశారు. దీంతో నెక్ట్స్ వెంకటేష్‌తో చేయబోతున్న సినిమాని కూడా సంక్రాంతికే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు.

45
గోపీచంద్‌ మలినేని, బాలయ్య మూవీ కూడా సంక్రాంతినే టార్గెట్‌
Image Credit : Face book/Nandamuri Balakrishna

గోపీచంద్‌ మలినేని, బాలయ్య మూవీ కూడా సంక్రాంతినే టార్గెట్‌

 అలాగే బాలకృష్ణ కూడా సంక్రాంతి బరిలో దిగబోతున్నారు. ప్రస్తుతం ఆయన గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. గ్యాంగ్‌ స్టర్‌ కథతో ఈ సినిమా సాగుతుందట. ఆ మధ్యనే ఈ మూవీని ఓపెనింగ్‌ చేశారు. త్వరలోనే రెగ్యూలర్‌ షూటింగ్‌ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాని కూడా సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. సరిగ్గా మూడేళ్ల క్రితం బాలయ్య, గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో `వీరసింహారెడ్డి` చేశారు. ఇది సంక్రాంతికే విడుదలయ్యింది. ఇప్పుడు చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన `వాల్తేర్‌ వీరయ్య` కూడా అదే సంక్రాంతికి వచ్చి హిట్‌ అయ్యింది. ఇప్పుడు సేమ్‌ కాంబినేషన్స్ లో మరోసారి ఈ ఇద్దరు పోటీ పడుతుండటం విశేషం.

55
సంక్రాంతికి తన మూవీని ప్రకటించిన నాగార్జున
Image Credit : youtube print shot/zee telugu

సంక్రాంతికి తన మూవీని ప్రకటించిన నాగార్జున

ఇక సడెన్‌గా ఇప్పుడు సంక్రాంతి బరిలోకి కింగ్‌ నాగార్జున కూడా వచ్చి చేరారు. ఆయన ఇప్పుడు కార్తీక్‌ అనే దర్శకుడితో `కింగ్‌100` చేస్తున్నారు. ఆ తర్వాత `సోగ్గాడే చిన్ని నాయన` ఫేమ్‌ కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. `సోగ్గాడే చిన్న నాయన`కి సీక్వెల్‌గా ఇది రాబోతుందని సమాచారం. వచ్చే సంక్రాంతికి జనవరి 15న ఈ మూవీని విడుదల చేయబోతున్నట్టు నాగార్జున ప్రకటించారు. డేట్‌ మార్క్ చేసుకోండి అంటూ ఆదివారం వెల్లడించడం విశేషం. దీంతో నలుగురు సీనియర్లు వచ్చే సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద పోటీ పడబోతున్నారనేది కన్ఫమ్‌ అయ్యింది. నలుగురు హీరోల మధ్య పోటీ రసవత్తరంగా ఉండబోతుందని చెప్పొచ్చు. అదే సమయంలో అభిమానులకు అది కనువిందు చేసే పండగగా కూడా ఉండబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా నలుగురు సీనియర్ల సినిమాలు ఒకేసారి విడుదలకావడం కూడా తెలుగు సినిమా చరిత్రలో అరుదైన సందర్భంగా చెప్పొచ్చు. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతి హీటు ఇప్పట్నుంచే పెరిగిపోతుంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ
అక్కినేని నాగార్జున
దగ్గుబాటి వెంకటేష్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Raviteja: ఈ స్టార్‌ హీరో వల్ల రవితేజకి 5 బ్లాక్‌ బస్టర్స్.. మాస్‌ మహారాజాకి లైఫ్‌ ఇచ్చింది ఎవరో తెలుసా?
Recommended image2
Balakrishna vs Rajasekhar: ప్రేమికులరోజు స్పెషల్‌గా రాజశేఖర్‌తో పోటీ పడి అడ్రస్‌ లేకుండాపోయిన బాలకృష్ణ సినిమా ఇదే
Recommended image3
OTT: ఓటీటీలోకి క్రేజీ హీరో జీవా సూపర్ హిట్ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే ?
Related Stories
Recommended image1
Raviteja: ఈ స్టార్‌ హీరో వల్ల రవితేజకి 5 బ్లాక్‌ బస్టర్స్.. మాస్‌ మహారాజాకి లైఫ్‌ ఇచ్చింది ఎవరో తెలుసా?
Recommended image2
Balakrishna vs Rajasekhar: ప్రేమికులరోజు స్పెషల్‌గా రాజశేఖర్‌తో పోటీ పడి అడ్రస్‌ లేకుండాపోయిన బాలకృష్ణ సినిమా ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved