- Home
- Entertainment
- 1300 కోట్ల ఆస్తి, 16 ఏళ్లకే స్టార్ డమ్, 8 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న హీరోయిన్ ఎవరో తెలుసా?
1300 కోట్ల ఆస్తి, 16 ఏళ్లకే స్టార్ డమ్, 8 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న హీరోయిన్ ఎవరో తెలుసా?
16 ఏళ్లకే స్టార్ హీరోయిన్, ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోల సరసన నటించి మెప్పించి బ్యూటీ, 1300 కోట్ల ఆస్తికి యజమాని, దాదాపు 8 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోన్న ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

సినీ పరిశ్రమలో చాలా తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే చిన్న వయస్సులో కెరీర్‌ను ప్రారంభించి, స్టార్ స్థాయికి ఎదిగి, ఆ తర్వాత స్థిరమైన జీవితం గడపగలుగుతారు. అలాంటి వ్యక్తులలో ఆసిన్ ఒకరు. ఆమె నటనా ప్రయాణం అద్భుతంగా సాగింది. స్టార్ గా వెలిగింది, చిన్న వయస్సులో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన ఆసిన్, ఇప్పుడు సినిమాలకు దూరంగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది.
కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో జన్మించిన ఆసిన్‌కి చిన్నప్పటి నుంచే నాట్యం, కళల పట్ల ఆసక్తి ఉండేది. మోహినీయాటం, భరతనాట్యం వంటి సంప్రదాయ నృత్యాల్లో శిక్షణ పొందిన ఆమె, మోడలింగ్ ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆమెకు కేవలం 15 ఏళ్ల వయస్సులోనే 2001లో వచ్చిన మలయాళ సినిమా ‘నరేంద్రన్ మకన్ జయకాంతన్ వగా’ ద్వారా సినిమా ఎంట్రీ దక్కింది. ఈ చిత్రం కమర్షియల్ విజయం సాధించడంతో ఆసిన్‌కు కొత్త అవకాశాలు తలుపుతట్టాయి.
2003లో తెలుగులో వచ్చిన ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాదు ఇందులో ఆమె నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటిగా అవార్డు కూడా గెలుచుకుంది. అనంతరం రవితేజ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన నటించి వరుసగా హిట్ సినిమాలు అందుకుంది.
తెలుగు సినిమాలతో పాటు తమిళ చిత్రాల్లో విజయ్, సూర్య, అజిత్, విక్రమ్ లాంటి ప్రముఖుల సరసన నటించి ఆసిన్ స్టార్‌డమ్‌ను సంపాదించింది. నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆసిన్, బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. అక్కడ సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్ వంటి ప్రముఖులతో కలిసి నటించింది.
ఎంతో మంది హీరోయిన్లకు ఆదర్శంగా నిలిచిన ఆసిన్, తన సినీ కెరీర్ ను మంచి పేరుతో పూర్తి చేసుకుంది. సరైన సమయంలో వ్యక్తిగత జీవితాన్ని ఎంచుకుంది. మైక్రోమ్యాక్స్ కంపెనీ సీఈవో రాహుల్ శర్మతో ప్రేమలో పడిన ఆమె, కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత 2016లో పెళ్లి చేసుకుంది. పెళ్లి అనంతరం రాహుల్ కుటుంబం చేసిన అభ్యర్థన మేరకు ఆసిన్ సినిమాలకు పూర్తిగా దూరమైంది.
ప్రస్తుతం ఆసిన్ కుటుంబానికే పరిమితమై జీవితం గడుపుతోంది. రాహుల్ శర్మతో ఆమెకు ఆరిన్ అనే 6 ఏళ్ల కుమార్తె ఉంది. తన కుమార్తె పుట్టినరోజున మాత్రమే ఆసిన్ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తుంది. ఫ్యామిలీ లైఫ్ ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నఆసిన్.. ఇక సినిమాల్లోకి వచ్చే ఆలోన లేనట్టుతెలుస్తోంది.
తాజాగా ఆసిన్ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నటిగా కొనసాగిన కాలంలో ఆమె తన సంపాదనను వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల, ఆసిన్ ఆస్తి అమాంతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఆమె ఆస్తి విలువ 1300 కోట్ల రూపాయలకుపైగా ఉన్నట్లు అంచనా. కెరీర్ ఉన్నప్పుడే గట్టిగా సంపాదించి, సినీ రంగం నుంచి ప్రశాంతంగా తప్పుకున్న నటీమణుల్లో ఆసిన్ ఉదాహరణగా నిలిచింది.