విశ్వక్ సేన్ సినిమాలో బాలయ్య గెస్ట్ రోల్, కామెడీ పాత్రలో కనిపించబోతున్న నటసింహం
వరుస విజయాలతో జోరుమీదన్నాడు నందమూరి నటసింహం బాలయ్య బాబు. హాట్రిక్ విన్నర్ గా నిలిచిన ఈ మాస్ హీరో.. మాస్ కా దాస్ సినిమాలో గెస్ట్ రోల్ చేయబోతున్నారని మీకు తెలుసా?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసుకుంటూ, హిట్లు కొట్టుకుంటూ వెళ్తున్నాడు. పక్కా మాస్ సినిమాలలో నటిస్తూ హిట్ మీద హిట్ కొడుతున్నారు బాలకృష్ణ. ముఖ్యంగా 2021లో విడుదలైన ‘అఖండ’ సినిమా నుంచి ఆయన కెరీర్ మళ్లీ ఊపందుకుంది.
ప్రస్తుతం వరుసగా నాలుగు హిట్లతో పరుగులుపెడుతోంది. అఖండ తరువాత వచ్చిన ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ డాకు మహరాజ్, వంటి సినిమాలు మంచి విజయం సాధించాయి. ప్రస్తుతం ఆయన ‘అఖండ 2’ సినిమాతో మరోసారి మాస్ అవతారంలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
ఇక ఇదిలా ఉండగా, బాలకృష్ణ అభిమానులను ఆశ్చర్చపరిచే విధంగా మరొక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఇటీవలే ప్రకటించబడిన ‘ఈ నగరానికి ఏమైంది 2’ సినిమాలో బాలకృష్ణ ఓ గెస్ట్ రోల్ చేయనున్నారన్న సమాచారం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ సినిమాకు తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించనున్నాడు. 2018లో వచ్చి యూత్ ఫుల్ మూవీ ఈనగరానికి ఏమైయింది. అప్పట్లో సూపర్ హిట్ గా నలిచిన ఈ సినిమాకు ఇది రీమేక్ గా పార్ట్ 2 తెరకెక్కుతోంది. మొదటి భాగంలో కనిపించిన అదే నటీనటులతో ‘ఈ నగరానికి ఏమైంది 2’ అనే సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమాకు ‘ENE రిపీట్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. యూత్ ఫుల్ కామెడీ, ఫ్రెండ్షిప్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని మూవీ టీమ్ వెల్లడించింది.
ఈ సినిమాకు తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించనున్నాడు. 2018లో వచ్చి యూత్ ఫుల్ మూవీ ఈనగరానికి ఏమైయింది. అప్పట్లో సూపర్ హిట్ గా నలిచిన ఈ సినిమాకు ఇది రీమేక్ గా పార్ట్ 2 తెరకెక్కుతోంది. మొదటి భాగంలో కనిపించిన అదే నటీనటులతో ‘ఈ నగరానికి ఏమైంది 2’ అనే సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమాకు ‘ENE రిపీట్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. యూత్ ఫుల్ కామెడీ, ఫ్రెండ్షిప్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని మూవీ టీమ్ వెల్లడించింది.
ఇక గెస్ట్ రోల్ విషయానికి వస్తే, బాలకృష్ణ ఈసినిమాలో సుమారు 15 నిమిషాల పాటు కనిపించనున్నారని సమాచారం. ఆయన పాత్ర పూర్తిగా కామెడీ కోణంలో ఉండనుందని తెలుస్తోంది. బాలయ్య గత కొన్ని సంవత్సరాలుగా చాలా గంభీరమైన, పవర్‌ఫుల్ రోల్స్ చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అటువంటి సమయంలో ఆయనను ఓ కామెడీ గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నారని తెలిసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
ఈ సినిమాలో బాలయ్యను తీసుకోవడానికి కారణం విశ్వక్ సేన్ అని తెలుస్తోంది. విశ్వక్ అంటే భాలకృష్ణకు చాలా అభిమానం. దర్శకుడు తరుణ్ భాస్కర్ తో కలిసి బాలకృష్ణను అడిగినట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. విశ్వక్ – బాలయ్య మధ్య మంచి రిలేషన్ ఉంది. దాంతో బాలయ్య ఈ పాత్ర చేయడానికి వెంటనే ఒప్పుకున్నారట.
ఇది నిజమైతే, ‘ఈ నగరానికి ఏమైంది 2’ సినిమాకు ఇది పెద్ద ఎత్తున హైప్ కలిగించనుంది. బాలయ్య ప్రత్యేక పాత్రతో యూత్ మధ్య మరింత క్రేజ్ సంపాదించగల అవకాశముంది. తాజా ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకుంటే, స్టార్ హీరోలు కామెడీ రోల్స్‌లో కనిపించడం అనేది ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా మారుతోంది.
ఇక విశ్వక్ సేన్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన ‘ఫంకీ’ అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత తాను నటించిన మొదటి హిట్ మూవీ ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్‌పై పూర్తి ఫోకస్ పెట్టబోతున్నారు. తారుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం మళ్లీ న్యూఎజ్ ఫ్రెండ్‌షిప్ డ్రామాగా తెరకెక్కనుంది.ఇక బాలయ్య పాత్రపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈసినిమాలో బాలయ్య కామెడీ టైమింగ్ మరోసారి తెరపై చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలో దీనిపై స్పష్టత రావొచ్చని సమాచారం.