- Home
- Entertainment
- చిరంజీవి, వెంకీ, నాగార్జున కాంబోలో మల్టీస్టారర్..కథ రెడీ చేసి టైటిల్ ఫిక్స్ చేసిన డైరెక్టర్, కానీ
చిరంజీవి, వెంకీ, నాగార్జున కాంబోలో మల్టీస్టారర్..కథ రెడీ చేసి టైటిల్ ఫిక్స్ చేసిన డైరెక్టర్, కానీ
రాఘవేంద్రరావు తన 100వ చిత్రంగా గంగోత్రి చిత్రాన్ని రూపొందించారు. అయితే తన 100వ చిత్రం విషయంలో తన ప్లాన్ వేరేగా ఉండేదని రాఘవేంద్రరావు అన్నారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Raghavendra Rao
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గురించి పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో అగ్రదర్శకుడిగా ఆయన దశాబ్దాల పాటు కొనసాగారు. ఎన్టీఆర్ శోభన్ బాబు లాంటి పాత తరం హీరోలతో సూపర్ హిట్ చిత్రాల తెరకెక్కించారు. ఆ తర్వాత చిరంజీవి వెంకటేష్, నాగార్జున, బాలయ్య తో అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలు రూపొందించారు. ఆయన దర్శకత్వ ప్రతిభ అంతటితో ఆగిపోలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇలాంటి హీరోలని లాంచ్ చేసింది కూడా ఆయనే.
megastar chiranjeevi
రాఘవేంద్రరావు మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో ఎన్నో మెమొరబుల్ చిత్రాలు ఉన్నాయి. జగదేకవీరుడు అతిలోకసుందరి, ఘరానా మొగుడు చిత్రాలు ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో రిలీజ్ చిత్రాల ట్రెండ్ కొనసాగుతోంది. జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రం మే 9న రిలీజ్ కి రెడీ అవుతోంది.
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావు కొన్ని ఆసక్తికర విషయాలు రివీల్ చేశారు. రాఘవేంద్రరావు తన 100వ చిత్రంగా గంగోత్రి చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంతో అల్లు అర్జున్ టాలీవుడ్ కి పరిచయమైన సంగతి తెలిసిందే. అయితే తన 100వ చిత్రం విషయంలో తన ప్లాన్ వేరేగా ఉండేదని రాఘవేంద్రరావు అన్నారు. నా 100వ చిత్రం ఎప్పటికీ గుర్తుండిపోయేలా తెరకెక్కించాలని అనుకున్నా. అది చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లతో మల్టీ స్టార్ మూవీ.
ఈ చిత్రానికి ఆ ముగ్గురు హీరోలు ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం. కథ కూడా దాదాపుగా పూర్తయింది. ఆ చిత్రానికి 'త్రివేణి సంగమం' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశాం. అల్లు అరవింద్ అశ్వినీ దత్ ఇద్దరూ ఈ చిత్రాన్ని తమ నిర్మిస్తామని ముందుకు వచ్చారు.
Allu Arjun
ఇక అంతా ఓకే అనుకున్న తరుణంలో అశ్వినీ దత్ తన అభిప్రాయాన్ని చెప్పారు. ముగ్గురు స్టార్లను పెట్టి ఎందుకంత టెన్షన్ తీసుకోవడం.. ఎవరో ఒకరు మాకు సన్నివేశాలు తగ్గాయి, సరైన పాట లేదు అని ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఈ టెన్షన్ అంతా ఎందుకు అని అశ్విని దత్ అన్నారు.
ఆయన చెప్పింది కూడా నిజమే కదా అని అనిపించింది. ముగ్గురు హీరోలని హ్యాండిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అందుకే త్రివేణి సంగమం చిత్రాన్ని విరమించుకున్నట్లు రాఘవేంద్రరావు తెలిపారు. రాఘవేంద్రరావు ధైర్యం చేసి ఆ చిత్రం రూపొందించి ఉంటే టాలీవుడ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేదేమో అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. త్రివేణి సంగమం చిత్రాన్ని డ్రాప్ చేసిన తర్వాత గంగోత్రి టేకప్ చేసినట్లు రాఘవేంద్రరావు తెలిపారు.