- Home
- Entertainment
- చిరంజీవి, రవితేజ మాత్రమే కాదు శర్వానంద్ కూడా అదే బాటలో.. సంక్రాంతికి సేఫ్ గేమ్, ఎవరికి నష్టం
చిరంజీవి, రవితేజ మాత్రమే కాదు శర్వానంద్ కూడా అదే బాటలో.. సంక్రాంతికి సేఫ్ గేమ్, ఎవరికి నష్టం
ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలలో సేఫ్ గేమ్ ఎక్కువగా కనిపిస్తోంది. వైవిధ్యమైన కథలకంటే అందరూ ఎంటర్టైన్మెంట్ నే నమ్ముకున్నారు. చిరంజీవి నుంచి శర్వానంద్ వరకు అందరి చిత్రాల జోనర్స్ దాదాపుగా ఒకేలా ఉన్నాయి.

సంక్రాంతి సినిమాలు
సంక్రాంతి సినిమాల సందడి రాజా సాబ్ చిత్రంతో మొదలైంది. జనవరి 12న రిలీజ్ కానున్న చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు మూవీతో సంక్రాంతి సంబరాలు మరో స్థాయికి చేరనున్నాయి. సంక్రాంతి సినిమాల్లో కామన్ గా ఒక అంశం కనిపిస్తోంది. ఈ చిత్రాలన్నీ దాదాపుగా ఒకే జోనర్ లో రూపొందాయి. రాజాసాబ్ ఒక్కటీ కాస్త డిఫెరెంట్ గా ఉన్నప్పటికీ అందులో కూడా మిగిలిన చిత్రాలతో పోల్చుకుని అంశాలు ఉన్నాయి. కామన్ గా కనిపించే అంశం ఏంటంటే.. అన్ని చిత్రాల్లో హీరోలు హీరోయిన్లతో నలిగిపోతూ కనిపిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ది రాజా సాబ్
ఇది హారర్ ఫాంటసీ చిత్రం అయినప్పటికీ హీరో.. ముగ్గురు హీరోయిన్ల మధ్య సతమతమవుతూ కనిపిస్తాడు. హారర్ ఎలిమెంట్స్ తో పాటు ఈ చిత్రంలో హీరో.. ముగ్గురు హీరోయిన్ల మధ్య సన్నివేశాలు కీలకంగా ఉంటాయి. జనవరి 9న రిలీజ్ అయిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది.
మన శంకర వరప్రసాద్ గారు
అనిల్ రావిపూడి సినిమా అంటే భార్య భర్తల మధ్య ఫన్ సీన్స్ ప్రధానంగా ఉంటాయి. ఈ చిత్రంలో కూడా చిరంజీవి, నయనతార భార్య భర్తలుగా నటిస్తున్నారు. ఇద్దరి మధ్య గొడవలు ఉన్నట్లు ట్రైలర్ లో చూపించారు.
భర్త మహాశయులకు విజ్ఞప్తి
మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమల తెరకెక్కించారు. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్లు. డింపుల్ హయతి రవితేజ భార్యగా నటిస్తుండగా.. ఆషిక ప్రేయసిగా నటిస్తోంది. వీరిద్దరి మధ్య నలిగిపోయే హీరోగా రవితేజ కనిపిస్తున్నాడు.
నారీ నారీ నడుమ మురారి
శర్వానంద్ హీరోగా సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం జనవరి 14న రిలీజ్ అవుతోంది. ఈ చిత్ర కథ కూడా ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోయే అంశంతోనే ఉంది. మాజీ ప్రేయసి, ప్రజెంట్ లవర్ మధ్య కన్ఫ్యూజన్ డ్రామాతో ఈ చిత్రం తెరకెక్కింది. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కూడా ఆకట్టుకునేలా ఉంది. కమెడియన్ సత్య, సునీల్, సీనియర్ నటుడు నరేష్ మంచి కామెడీ పండిస్తున్నారు.
అనగనగా ఒక రాజు
నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ చిత్రం కంప్లీట్ గా వినోదాత్మక సన్నివేశాలతో తెరకెక్కింది. ఈ చిత్రంలో కూడా పెళ్లి కోసం తిప్పలు పడే హీరోగా నవీన్ కనిపిస్తున్నాడు. మొత్తంగా సంక్రాంతి సినిమాలన్నీ దాదాపు ఒకే జోనర్ లో.. ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా తెరకెక్కాయి. మరి ఈ ఫార్ములా ఎవరికి కలసి వస్తుంది ? ఎవరికి నష్టం చేస్తుంది అనేది వేచి చూడాలి.

