MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Vishwanath and Sons 2 Days Collections: సూర్య విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ కి దుమ్ములేపే కలెక్షన్లు.. 2వ రోజు ర్యాంపేజ్‌

Vishwanath and Sons 2 Days Collections: సూర్య విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ కి దుమ్ములేపే కలెక్షన్లు.. 2వ రోజు ర్యాంపేజ్‌

సూర్య హీరోగా నటించిన `విశ్వనాథ్‌ అండ్‌ సన్స్` మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. ఈ మూవీ రెండో రోజు మరింతగా పుంజుకోవడం విశేషం. దీంతో ఇది అదిరిపోయే వసూళ్లని రాబట్టింది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 16 2026, 08:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ తో సూర్య మరో హిట్‌
Image Credit : Asianet News

విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ తో సూర్య మరో హిట్‌

`కరుప్పు` విజయంతో మంచి జోరుమీదున్నారు సూర్య. ఆయన ఇప్పుడు `విశ్వనాథ్‌ అండ్‌ సన్స్` చిత్రంలో నటించారు. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. నాగవంశీ నిర్మించారు. సాయి సౌజన్య మరో నిర్మాత. ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్‌గా నటించింది. రాధికా శరత్‌ కుమార్‌, రవీనా టండన్‌, వైవా హర్ష, సునీల్‌ రెడ్డి వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. దీనికి పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. సూర్య ఖాతాలో మరో హిట్‌ పడింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఫన్‌ అండ్‌ ఎమోషనల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా విశ్వనాథ్‌ అండ్‌ సన్స్
Image Credit : Asianet News

ఫన్‌ అండ్‌ ఎమోషనల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా విశ్వనాథ్‌ అండ్‌ సన్స్

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు వెంకీ అట్లూరి. ఫన్‌, ఎమోషన్స్, ఫ్యామిలీ ఎలిమెంట్లని మేళవించి రూపొందించారు. ఈ చిత్రానికి పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ ని అలరిస్తోంది. అయితే తమిళంతో పోటీగా తెలుగులోనూ ఆదరణ దక్కుతుంది. కలెక్షన్లు కూడా అలానే ఉన్నాయి. తమిళంలో చాలా వరకు నెగటివ్‌ని స్ప్రెడ్‌ చేస్తున్నారు. ట్రోల్‌ చేస్తున్నారు. తెలుగు ఆడియెన్స్ మాత్రం బ్రహ్మరథం పడుతున్నారు.

34
విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ 2 రోజుల కలెక్షన్లు
Image Credit : Asianet News

విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ 2 రోజుల కలెక్షన్లు

ఈ సినిమాకి అదిరిపోయే కలెక్షన్లు వస్తున్నాయి. రెండో రోజుల్లో రూ.74.47కోట్లు వసూలు చేసింది. 43.47కోట్ల ఇండియా గ్రాస్‌, సాధించగా, రూ.31కోట్లు ఓవర్సీస్‌లో రాబట్టడం విశేషం. ఇండియాలో రూ.37.60కోట్ల నెట్‌ రాబట్టింది. మొదటి రోజు దీనికి ఇండియాలో రూ.17.74కోట్లు రాగా, రెండో రోజు రూ.25కోట్లు రాబట్టడం విశేషం. ఇందులో ఏపీ, తెలంగాణలో రూ.17కోట్లు వచ్చాయి. తమిళనాడులో రూ.18కోట్లు వచ్చాయి. కర్నాటకలో ఐదు కోట్లు, కేరళాలో మూడున్నరకోట్లు వచ్చాయి. నార్త్ లో అరవై లక్షలు మాత్రమే రాబట్టింది. ఈ సినిమా తెలుగు వారికే ఎక్కువ కనెక్ట్ కావడం విశేషం.

44
విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ బడ్జెట్‌, బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌
Image Credit : Asianet News

విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ బడ్జెట్‌, బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌

`విశ్వనాథ్‌ అండ్‌ సన్స్` మూవీ సుమారు రూ.130కోట్లతో రూపొందింది. దీనికి థియేట్రికల్‌గా రూ.63కోట్ల బిజినెస్‌ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.20కోట్లకు సేల్‌ చేశారు. అంటే ఇక్కడ నలభై కోట్ల గ్రాస్‌ రావాలి. తమిళనాడులో నలభై కోట్లకు అమ్మారు. అక్కడ రూ.80కోట్ల గ్రాస్‌ రావాలి. ఓవర్సీస్‌లో రూ.15కోట్లకు అమ్మగా, రెండు రోజుల్లోనే టార్గెట్‌ రీచ్‌ అయ్యింది. ఇక ఆదివారం ఈ సినిమాకి కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. వంద కోట్లు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి వారాంతంలో సినిమా బ్రేక్‌ ఈవెన్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో మూవీ ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఎక్కితే పెద్ద రేంజ్‌లో కలెక్షన్లని రాబడుతుందని ట్రేడ్‌ వర్గాలు తెలియజేస్తున్నాయి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తమిళ సినిమా
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved