బాలకృష్ణకి షాకిచ్చిన చిరంజీవి, వెంకటేష్.. నాగార్జున అసలు పోటీలోనే లేరుగా!
సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ల మధ్య ఇప్పుడు వంద కోట్ల కలెక్షన్ల పోటీ నెలకొంది. అయితే షేర్ విషయంలో బాలయ్యకి షాకిస్తున్నారు చిరు, వెంకీ.
- FB
- TW
- Linkdin
Follow Us

సీనియర్ హీరోలకు సంబంధించి ఇప్పుడు వంద కోట్ల కలెక్షన్లకి సంబంధించిన చర్చ నడుస్తుంది. బాలయ్య బ్యాక్ టూ బ్యాక్ నాలుగు వంద కోట్ల సినిమాలు చేశారు. ఇప్పుడు వెంకటేష్ ఏకంగా రెండు వందల కోట్లని టచ్ చేయబోతున్నారు.
ఈ క్రమంలో వంద కోట్ల షేర్ ఏ హీరో సాధించారనే చర్చ మొదలైంది. ఈ విషయంలో బాలయ్యకి పెద్ద షాకిస్తున్నారు చిరంజీవి, వెంకటేష్. అయితే ఈ గేమ్‌లో నాగార్జున గేమ్‌లోనే లేకపోవడం గమనార్హం.
బాలకృష్ణ `అఖండ`తో విజయ పరంపర స్టార్ట్ చేశారు. వరుసగా `వీరసింహారెడ్డి`, `భగవంత్ కేసరి`, ఇప్పుడు `డాకు మహారాజ్` చిత్రాలతో విజయాలను అందుకున్నారు. ఈ నాలుగు సినిమాలు వంద కోట్లకుపైగా వసూళ్లని రాబట్టాయి.
సీనియర్ హీరోల్లో ఇలా బ్యాక్ టూ బ్యాక్ నాలుగు వంద కోట్ల సినిమాలు చేసిన హీరోగా బాలయ్య రికార్డు సృష్టించారు. కానీ బాలయ్యకి షాకిచ్చారు ఇద్దరు సీనియర్లు చిరు, వెంకీ. బాలయ్య సినిమాలు వంద కోట్ల గ్రాస్ వచ్చాయి, కానీ షేర్ సాధించలేదు. ఈ రికార్డుని చిరు, వెంకీ సాధించారు.
చిరంజీవి, వెంకటేష్ సినిమాలు వంద కోట్ల షేర్‌ని సాధించాయి. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవివి మూడు సినిమాలున్నాయి. వాటిలో `ఖైదీ నెంబర్ 150`, `సైరా`, `వాల్తేర్ వీరయ్య` ఉన్నాయి. `ఖైదీ నెంబర్ 150` సినిమా 164కోట్ల గ్రాస్‌ని, 104 కోట్ల షేర్‌ని సాధించింది.
ఇక `సైరా నరసింహారెడ్డి` మూవీ రూ. 240కోట్ల గ్రాస్‌ని, 141కోట్ల షేర్ సాధించింది. కానీ ఇది ఫ్లాప్ అయ్యింది. అనంతరం `వాల్తేర్ వీరయ్య` 225కోట్ల గ్రాస్‌ని 136కోట్ల షేర్‌ని సాధించాయి. ఇలా మూడు సినిమాలు వంద కోట్లకుపైగా షేర్‌తో సీనియర్లలో టాప్‌లో ఉన్నారు చిరంజీవి.
సీనియర్లలో ఈ అరుదైన ఘనత సాధించిన హీరోల్లో వెంకీమామ కూడా నిలిచారు. ఆయన నటించిన `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ ఈ సంక్రాంతికి విడుదలైంది. ఇది ఇప్పటికే రూ.200కోట్ల గ్రాస్‌ని వసూలు చేసింది. ఈ లెక్కన ఇది ఇప్పటికే వంద కోట్ల షేర్ దాటింది. అంతేకాదు ఈ మూవీ చిరంజీవి హైయ్యెస్ట్ గ్రాస్‌ని కూడా క్రాస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక సీనియర్లలో నాగార్జున ఇప్పటి వరకు వంద కోట్ల సినిమా చేయలేకపోయారు. ఇక వంద కోట్ల షేర్ మాట లేదు. వంద కోట్ల పోటీలో నాగ్ వెనకబడటమే కాదు, అసలు గేమ్‌లోనే లేరని చెప్పొచ్చు. మొత్తంగా సీనియర్లలో చిరంజీవి, వెంకీ వంద కోట్ల సినిమాలతో దూసుకుపోతున్నారు.
ఈ విషయంలో బాలయ్యకి కూడా షాకిచ్చారు. ఈ సంక్రాంతికి వచ్చిన బాలయ్య `డాకు మహారాజ్` కూడా సుమారు రూ.160కోట్ల గ్రాస్ చేసింది. కానీ ఇంకా వంద కోట్ల షేర్ సాధించలేదు. మరి పూర్తి రన్‌లో అయినా వంద కోట్లని టచ్ చేస్తుందేమో చూడాలి.
read more: టాప్ 10లో ఐదుగురు టాలీవుడ్ వాళ్లే, అల్లు అర్జున్ స్థానం ఏదో తెలుసా.. ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరోలు
also read: ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాభాలు దిల్ రాజుకు అందవా?