- Home
- Entertainment
- టాప్ 10లో ఐదుగురు టాలీవుడ్ వాళ్లే, అల్లు అర్జున్ స్థానం ఏదో తెలుసా.. ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరోలు
టాప్ 10లో ఐదుగురు టాలీవుడ్ వాళ్లే, అల్లు అర్జున్ స్థానం ఏదో తెలుసా.. ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరోలు
ఇండియాలో ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమ డామినేషన్ కనిపిస్తోంది. బ్లాక్ బస్టర్ అవుతున్న పాన్ ఇండియా చిత్రాలు ఎక్కువగా టాలీవుడ్ నుంచే నిర్మించబడుతున్నాయి. బాహుబలితో మొదలైన ఈ రచ్చ పుష్ప 2 వరకు కొనసాగింది.

ఇండియాలో ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమ డామినేషన్ కనిపిస్తోంది. బ్లాక్ బస్టర్ అవుతున్న పాన్ ఇండియా చిత్రాలు ఎక్కువగా టాలీవుడ్ నుంచే నిర్మించబడుతున్నాయి. బాహుబలితో మొదలైన ఈ రచ్చ పుష్ప 2 వరకు కొనసాగింది. ఇకపై కూడా కొనసాగుతుంది. బాహుబలి , బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, పుష్ప 1, పుష్ప 2, కల్కి, హను మాన్, కార్తికేయ 2 ఇలా తెలుగు చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ ని రూల్ చేస్తున్నాయి.
ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరోలుగా గతంలో బాలీవుడ్ హీరోల పేర్లు వినిపించేవి. ఇప్పుడు ఆ ప్లేస్ ని కూడా టాలీవుడ్ హీరోలు కబ్జా చేస్తున్నారు. తాజాగా ఒర్మాక్స్ మీడియా సంస్థ డిసెంబర్ నెలకి సంబంధించిన ఇండియా మోస్ట్ పాపులర్ హీరోల జాబితాని రిలీజ్ చేసింది. టాప్ 10 పాపులర్ హీరోల లిస్ట్ విడుదల చేశారు. ఇందులో కంప్లీట్ గా టాలీవుడ్ హీరోల డామినేషన్ కనిపిస్తోంది.
టాప్ 10 లో 5 గురు టాలీవుడ్ హీరోలే ఉన్నారు. ముగ్గురు బాలీవుడ్ నుంచి, ఇద్దరు కోలీవుడ్ నుంచి ఉన్నారు. అగ్రస్థానం కూడా టాలీవుడ్ హీరోకే దక్కింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ పాపులర్ హీరోగా నెంబర్ 1 స్థానాన్ని కైవశం చేసుకున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి రెండవ స్థానం దక్కింది. పుష్ప 2 తో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే.
మూడవ స్థానంలో తమిళ హీరో దళపతి విజయ్, నాల్గవ స్థానంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్, 5వ స్థానంలో యుంగ్ టైగర్ ఎన్టీఆర్, 6వ స్థానంలో తలా అజిత్ కుమార్, 7 వస్థానంలో సూపర్ స్టార్ మహేష్, 8వ స్థానంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఉన్నారు. చివరి రెండు స్థానాల్లో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ ఉన్నారు.