MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాపై విషప్రయోగం జరిగింది... 35 ఏళ్ల తర్వాత ఆ సంఘటనపై నోరువిప్పిన చిరంజీవి! 

నాపై విషప్రయోగం జరిగింది... 35 ఏళ్ల తర్వాత ఆ సంఘటనపై నోరువిప్పిన చిరంజీవి! 

చిరంజీవి మీద మర్డర్ అటెంప్ట్ జరిగిందనే ప్రచారం చాలా కాలంగా ఉంది. చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో జరిగిన ఈ సంఘటనపై ఈ తరానికి అవగాహన లేదు. తాజాగా ఆయన స్వయంగా అప్పటి సంఘటన గుర్తు చేసుకున్నారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jan 12 2023, 05:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

వాల్తేరు వీరయ్య విడుదలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. చిత్ర విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చిరంజీవి విరివిగా ప్రమోట్ చేశారు. ఆయన వరుస ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ ఆసక్తికర సంఘటన గుర్తు చేసుకున్నాడు. అభిమాని స్వయంగా తనపై విష ప్రయోగానికి పాల్పడ్డాడని చెప్పుకొచ్చారు. 1988లో జరిగిన ఈ ఉదంతాన్ని పూసగుచ్చినట్లు వివరించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25


మరణ మృదంగం మూవీ షూట్ అవుట్ డోర్ లో జరుగుతుంది. ఆ చిత్ర సెట్స్ లో కేక్ కట్ చేస్తున్నాము. ఒక అభిమాని వచ్చి నాకు స్వయంగా కేక్ తినిపించాడు. నాకు స్పూన్ తో కేక్ తినే అలవాటు లేదు. ఆ అభిమాని కూడా చేత్తో కేక్ తీసి నోట్లో పెట్టాడు. కేక్ నా నోటికి చేదుగా అనిపించింది. వెంటనే నేను బయటకు ఊసేశాను. పక్కనే ఉన్న చిత్ర నిర్మాత కే ఎస్ రామారావుకి సందేహం వచ్చింది. అతన్ని పట్టుకొని, కేక్ ని పరీక్షకు పంపారు. 

35


 కేక్ లో ఏదో కలిపాడని తెలియడంతో రామారావు అతన్ని కొట్టారు. గట్టిగా ప్రశ్నించడంతో నిజం ఒప్పుకున్నాడు.చిరంజీవి నాతో మాట్లాడం లేదు. కేరళ నుండి వశీకరణ పదార్థం తెచ్చి ఆయనకు తినిపించే ప్రయత్నం చేశాను, అన్నాడు. నేను అతన్ని ఏమీ చేయవద్దు వదిలేయమని చెప్పాను. కె ఎస్ రామారావు అతన్ని వదిలేశాడంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. 

45

కెరీర్లో ఎదుగుతున్న చిరంజీవిని చంపేందుకు ప్రత్యర్ధులు కుట్ర పన్నారని మరో వెర్షన్ కూడా ఉంది. కేక్ తిన్న చిరంజీవి అస్వస్థతకు గురయ్యారని, ఆయన్ని హుటాహుటిన చెన్నైలోని ఆసుపత్రికి తరలించారని, రెండు రోజుల చికిత్స అనంతరం కోలుకుని బయటకు వచ్చారని కొందరి వాదన. అప్పట్లో సమాచార విప్లవం ఈ స్థాయిలో లేదు. చిరంజీవి మీద జరిగిన దాడిని ఒకటి రెండు మీడియా సంస్థలు మాత్రమే కవర్ చేశాయి. 

55
Chiranjeevi

Chiranjeevi


ఇక వాల్తేరు వీరయ్య విజయంపై చిరంజీవి పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ప్రీ రిలీజ్ వేడుకతో పాటు అన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ లో బ్లాక్ బస్టర్ కొడుతున్నామంటూ బల్లగుద్ది చెబుతున్నారు. దర్శకుడు బాబీ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వాల్తేరు వీరయ్య రూపొందించారు. రవితేజ కీలక రోల్ చేస్తుండగా శృతి హాసన్, కేథరిన్ థెరిస్సా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
కృష్ణ తలచుకుంటే శోభన్‌బాబుని మించి వేల కోట్లు ఆస్తులు.. సగం చెన్నై, హైదరాబాద్‌ ఆయనదే.. సంచలన విషయాలు వెల్లడి
Recommended image2
Allu Arjun Peddi Review: నిన్ను చూస్తే గర్వంగా ఉంది బ్రదర్‌.. రామ్‌ చరణ్‌ పెద్దిపై అల్లు అర్జున్‌ సంచలన పోస్ట్
Recommended image3
మ‌రో సెన్సేష‌న్ సాంగ్ లోడింగ్‌.. ఇక‌పై ప్ర‌తీ పెళ్లి బ‌రాత్‌లో ఈ పాట ఉండాల్సిందే, సౌండ్ ల‌గారే అనాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved