- Home
- Entertainment
- సురేఖ కంటే ముందే మొగల్తూరు అమ్మాయితో ప్రేమలో చిరు.. ఇన్నేళ్లకు లవ్ ఫెయిల్యూర్ స్టోరీ బయటపెట్టిన మెగాస్టార్
సురేఖ కంటే ముందే మొగల్తూరు అమ్మాయితో ప్రేమలో చిరు.. ఇన్నేళ్లకు లవ్ ఫెయిల్యూర్ స్టోరీ బయటపెట్టిన మెగాస్టార్
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'లాల్ సింగ్ చడ్డా'. చిత్రంతో నాగ చైతన్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగ చైతన్య కీలకమైన రోల్ లో నటిస్తున్నాడు.

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'లాల్ సింగ్ చడ్డా'. చిత్రంతో నాగ చైతన్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగ చైతన్య కీలకమైన రోల్ లో నటిస్తున్నాడు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 11న పాన్ ఇండియా చిత్రంగా గ్రాండ్ రిలీజ్ కి రెడీ అయింది. తెలుగులో ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి ప్రజెంట్ చేస్తుండడం విశేషం.
ఎన్నడూ లేని విధంగా అమీర్ ఖాన్ తన చిత్రాన్ని జోరుగా తెలుగులో ప్రమోట్ చేస్తున్నారు. ఇటీవల చిరంజీవితో కలిసి అమీర్ ఖాన్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా కింగ్ నాగార్జున.. చిరంజీవి, అమీర్ ఖాన్, నాగ చైతన్య ని తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేశారు. లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్స్ కోసం ఈ ఇంటర్వ్యూ నిర్వహించారు.
ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయింది. ఇంటర్వ్యూ మొత్తం ఫన్నీగా.. చిరునవ్వులతో సాగింది. ఆకాశంలో నక్షత్రాల సమూహాన్ని గాలక్సీ అంటారు. నా ముందు ఓ గాలక్సీ ఉంది అంటూ చిరు, అమీర్, చైతు గురించి నాగ్ తెలిపారు.
ఈ చిత్రంలో మీరు కుర్రాడిలా, ఆర్మీ, అధికారిలా, మరో విభిన్నమైన లుక్ లో ఇలా ఎలా కనిపించగలిగారు అని నాగ్ అమీర్ ని ప్రశ్నించాడు. ఇలా లాల్ సింగ్ చడ్డా గురించి అనేక విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేసారు. నాగ చైతన్య ఇంటికి వచ్చినప్పుడల్లా లాల్ సింగ్ చడ్డా షూటింగ్ విశేషాలు చెప్పేవాడు అని నాగ్ అన్నారు.
లాల్ సింగ్ చడ్డా చిత్రంలోని లవ్ స్టోరీ గురించి చర్చ వచ్చినప్పుడు.. మీరు తొలిసారి ఎప్పుడు ప్రేమలో పడ్డారు అని అమీర్ ఖాన్ చిరంజీవిని ప్రశ్నించాడు. దీనితో చిరంజీవి సిగ్గుపడుతూ తన మొగల్తూరు ప్రేమ కథని బయట పెట్టారు. తాను తొలిసారి 7వ తరగతిలోనే ప్రేమలో పడ్డట్లు చిరు రివీల్ చేశారు.
అప్పట్లో మా మొగల్తూరులో అమ్మాయిలు సైకిల్ తొక్కడం అంటే అదో గొప్ప విషయం. ఆశ్చర్యంగా కూడా ఉండేది. ఆ అమ్మాయి పట్టుకుని సపోర్ట్ ఇస్తే నేను సైకిల్ తొక్కేవాడిని. కానీ ఎక్కువగా ఆ అమ్మాయి వంకే చూసేవాడిని అని చిరంజీవి తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ వివరించారు.
త్వరలో కంప్లీట్ ఇంటర్వ్యూ రానుంది. అందులో చిరంజీవి మొగల్తూరు లవ్ స్టోరీ గురించి, లాల్ సింగ్ చడ్డా గురించి అనేక విషయాలు తెలియనున్నాయి. నలుగురు స్టార్స్ ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతుండడం ఆసక్తి రేపుతోంది.