MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Chiranjeevi: పాండీబజార్‌లో అందరి ముందు అవమానం.. చిరంజీవి లైఫ్‌ని మార్చిన సంఘటన

Chiranjeevi: పాండీబజార్‌లో అందరి ముందు అవమానం.. చిరంజీవి లైఫ్‌ని మార్చిన సంఘటన

చిరంజీవి మెగాస్టార్‌గా ఎదిగి కోట్ల మందికి స్ఫూర్తిగా నిలిచారు. అయితే ఆయన కెరీర్‌ ప్రారంభంలో తాను ఫేస్‌ చేసిన అవమానం గురించి ఓపెన్‌ అయ్యారు. ఆ సంఘటన తనని చాలా మార్చేసిందని చెప్పారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 31 2026, 12:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా స్టార్‌గా ఎదిగిన చిరంజీవి
Image Credit : youtube/@etvteluguindia

ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా స్టార్‌గా ఎదిగిన చిరంజీవి

చిరంజీవి ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా సినిమాల్లోకి వచ్చి మెగాస్టార్‌గా ఎదిగారు. ఇప్పుడు టాలీవుడ్‌లో మహా వృక్షంలాగా ఎదిగారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఆయన కుటుంబ నుంచే దాదాపు పది మంది ఆర్టిస్ట్ లు ఇండస్ట్రీలోకి రావడానికి కారణమయ్యారు. ముప్పై ఏళ్ల క్రితమే కాదు, ఇప్పుడు కూడా తనే నెంబర్‌ 1 హీరో అనిపించుకుంటున్నారు. ఇటీవల `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీతో తానేంటో నిరూపించుకున్న విషయం తెలిసిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చిరంజీవికి అవమానం
Image Credit : youtube/@etvteluguindia

చిరంజీవికి అవమానం

అయితే చిరంజీవి హీరో కాకముందు తాను ఫేస్‌ చేసిన అవమానాలను వెల్లడించారు. తనని ఎలా అందరి ముందు అవమానించారో తెలిపారు. ఈ క్రమంలో ఒక సంఘటనని చిరంజీవి వెల్లడించారు. అప్పట్లో చిత్ర పరిశ్రమ మద్రాస్‌(చెన్నై)లో ఉండేది. అక్కడే చిరంజీవి యాక్టింగ్‌ స్కూల్‌లో శిక్షణ తీసుకున్నారు. నటుడిగా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో పాండీబజార్‌కి వెళ్లారట. అక్కడ సినిమాల్లో ప్రయత్నాలు చేస్తున్నవారంతా ఉండేవారు. అక్కడ ఒకరు తనని దారుణంగా అవమానించినట్టు చెప్పారు చిరంజీవి.

Related Articles

Related image1
Heroine Meena: మీనాకు తలబిరుసు ఎక్కువ, దారుణంగా ట్రోల్స్.. తన తప్పేంటో ఓపెన్‌గా చెప్పిన స్టార్‌ హీరోయిన్‌
Related image2
Niharika: మా ఇంట్లో వాళ్లు ఎంత ప్రేమిస్తారో, గెటప్‌ శ్రీను అంతే లవ్‌ చేస్తాడు.. జబర్దస్త్ కమెడియన్‌పై నిహారిక కామెంట్‌
35
హీరో అయిపోదామనే అంటూ ఎగతాళి
Image Credit : youtube/@Shinescreenscinema

హీరో అయిపోదామనే అంటూ ఎగతాళి

మనం ఎదిగే సమయంలో, ఒక రంగంలో నెగటివిటీకి దూరంగా ఉండాలని తెలిపారు. నెగటివ్‌ వైబ్రేషన్స్ అంటే తనకు అస్సలు ఇష్టం ఉండదని, అలాంటి చోట తాను ఉండలేనని చెప్పారు.  ఒకసారి సాయంత్రం సమయంలో సరదాగా టీ తాగడానికి పాండీ బజార్‌ వెళ్లారట చిరంజీవి. ఫ్రెండ్‌ తీసుకెళ్తే చిరంజీవి వెళ్లాడు. తనని చూసి ఒక వ్యక్తి.. `ఏంట్రా మీ ఫ్రెండా? ఏంటి సినిమాల్లో వేషాలు వేద్దామనా అని అడిగాడట. ఆ అవునండి అని చెప్పాడట చిరంజీవి. ఏ వేషాలు అంటే.. అవకాశం వస్తే హీరోగా చేయాలని ఉందని చెప్పాడు చిరంజీవి. అది విని అతను.. ఓరేయ్‌ అని నవ్వుతూ, పక్కన ఉన్న కుర్రాడిని పిలిచి, వీడు ఎంత అందంగా ఉన్నాడు చూడు. వాడికే దిక్కూ, దివానా లేదు. ఈయన హీరో అయిపోతాడట.. అరేయ్‌ బాబూ మేమంతా అదే పరిస్థితిరా అని నవ్వాడట.

45
ఆంజనేయుడితో మాట్లాడుకునే చిరంజీవి
Image Credit : Youtube/@GoldBoxEnt

ఆంజనేయుడితో మాట్లాడుకునే చిరంజీవి

ఆ సమయంలో మొత్తం డిజప్పాయింట్‌ అయ్యాడట చిరంజీవి. ఎంతో హుషారుగా వెళ్లిన ఆయన డల్‌ గా రూమ్‌కి వచ్చాడట. ఎందుకు వెళ్లానా అక్కడికి అని బాధపడ్డాడట. తాను మోటివేషనల్‌ బుక్స్ చదవలేదు, ఎవరూ గురువులు లేరు, కానీ ఆ సమయంలో నా ఆంజనేయ స్వామితోనే ఇంటరాక్ట్ అవుతాను, ఆయనతోనే చెప్పుకుంటాను. ఆయన సమాధానాలు చెప్పినట్టుగా అనిపిస్తుంది. వాటిని తీసుకుంటాను, అలానే అక్కడికి ఎవడు వెళ్లమన్నాడు, అక్కడ అంతా ఫ్రస్టేటెడ్‌ పిపుల్స్ ఉంటారు. అక్కడకి వెళ్తే ఉత్సాహం వస్తుందనుకుంటున్నావా? ఎవరు వెళ్లమన్నాడు? నేను ఉన్నా కదా, మనం ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం కదా అని అనుకున్నాడట. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మళ్లీ పాండీబజార్‌ వైపు వెళ్లలేదని తెలిపారు చిరంజీవి. ఆ సంఘటన తనని చాలా మార్చేసిందని తెలిపారు చిరంజీవి.

55
మన శంకర వర ప్రసాద్‌ గారు బ్లాక్‌ బస్టర్‌ కొట్టిన చిరంజీవి
Image Credit : Asianet News

మన శంకర వర ప్రసాద్‌ గారు బ్లాక్‌ బస్టర్‌ కొట్టిన చిరంజీవి

నెగటివ్‌ ఉన్న చోటుకి మనం వెళితే, మనం కూడా డల్‌ అయిపోతాం. తనకున్న ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడం మూలంగా తనకింత మానసిక స్థైర్యం వచ్చిందని తెలిపారు చిరంజీవి. ఇటీవల సంక్రాంతికి `మన శంకర వర ప్రసాద్‌ గారు` చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న ఆయన ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. త్వరలోనే ఇది ప్రారంభం కానుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు ద్రోహం చేసిన సురేఖ, పవర్ స్టార్ జీవితాన్ని మలుపు తిప్పిన చిరంజీవి భార్య
Recommended image2
Pawan Kalyan: పవన్‌ వల్లే ఉదయ్‌ కిరణ్‌ ఫోటోలు లీక్‌.. సుస్మిత ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ వెనుక జరిగింది ఇదే
Recommended image3
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Related Stories
Recommended image1
Heroine Meena: మీనాకు తలబిరుసు ఎక్కువ, దారుణంగా ట్రోల్స్.. తన తప్పేంటో ఓపెన్‌గా చెప్పిన స్టార్‌ హీరోయిన్‌
Recommended image2
Niharika: మా ఇంట్లో వాళ్లు ఎంత ప్రేమిస్తారో, గెటప్‌ శ్రీను అంతే లవ్‌ చేస్తాడు.. జబర్దస్త్ కమెడియన్‌పై నిహారిక కామెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved