MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bigg Boss 10: హౌస్ లో డ్రామా కింగ్ అతడే, షాలిని కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్

Bigg Boss 10: హౌస్ లో డ్రామా కింగ్ అతడే, షాలిని కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ ఆసక్తికర పరీక్షా పెట్టారు. బిగ్ బాస్ అడిగిన దాని ప్రకారం వైల్డ్ కార్డు సభ్యులు ఓజీ సభ్యులు ఒక్కొక్కరికీ ఒక్కో క్యారెక్టర్ నేమ్ ఇచ్చారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 14 2026, 11:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బిగ్ బాస్ తెలుగు 10
Image Credit : Asianet News

బిగ్ బాస్ తెలుగు 10

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో భాగంగా హౌస్ లో 38వ రోజు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాడు. వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ ఆసక్తికర పరీక్ష పెట్టారు. హౌస్ లో ఉన్న ఓజీ కంటెస్టెంట్స్ ఒక్కొక్కరి క్యారెక్టర్ ఆధారంగా వాళ్లకు డ్రామా క్వీన్, సేఫ్ ప్లేయర్, మ్యాన్యుపులేటర్ ఇలాంటి పేర్లు ఇవ్వాలి అని బిగ్ బాస్ తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
డ్రామా కింగ్ అతడే
Image Credit : Asianet News

డ్రామా కింగ్ అతడే

దీనితో వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ చర్చించుకుని ఒక్కొక్కరికి ఒక్కో పేరు ఇచ్చారు. డ్రామా కింగ్ రోహిత్ అని డిసైడ్ చేశారు. తనది కానీ విషయంలోకి దూరి డ్రామా క్రియేట్ చేస్తారు అని వైల్డ్ కార్డు సభ్యులు పేర్కొన్నారు. విక్టిమ్ కార్డు ప్లే చేసేది ఎవరు అంటే షాలిని అని నిర్ణయించారు. చిన్న సమస్యలో కూడా విక్టిమ్ కార్డుగా సింపతీ కొట్టేయాలని అనుకుంటుంది. బ్యాక్ స్టాబెర్ గా ఝాన్సీ సేఫ్ ప్లేయర్ గా దేబ్జానీ పేర్లు నిర్ణయించారు.

34
బ్రెయిన్ లెస్ ఎవరంటే
Image Credit : Asianet News

బ్రెయిన్ లెస్ ఎవరంటే

బ్రెయిన్ లెస్ గా వర్షిణి, మ్యాన్యుపులేటర్ గా ముఖేష్ పేర్లు చెప్పారు. ఇలా ఇంటి సభ్యులు ఒక్కొక్కరి క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తూ ఒక్కో క్యారెక్టర్ నేమ్ ఇచ్చారు. ఇదంతా సీక్రెట్ గా జరిగింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఓజీ సభ్యులని బ్లూ టీం, గ్రీన్ టీం గా విభజించి గేమ్ పెట్టారు. ఈ గేమ్ ప్రకారం బ్లూ టీం నుంచి ఒకరు, గ్రీన్ టీం నుంచి ఒకరు వచ్చి ముందుగా గంట మోగించాలి. ఎవరు ముందుగా గంట మోగిస్తే వాళ్లకు బిగ్ బాస్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే ఛాన్స్ దక్కుతుంది. హౌస్ లో ఎవరికీ వైల్డ్ కార్డు సభ్యులు డ్రామా కింగ్ అనే బిరుదు ఇచ్చారు అని బిగ్ బాస్ ప్రశ్నిస్తారు. కరెక్ట్ గా చెబితే పాయింట్స్ లభిస్తాయి.

44
షాలిని కాళ్ళు పట్టుకున్న రామకృష్ణ
Image Credit : Asianet News

షాలిని కాళ్ళు పట్టుకున్న రామకృష్ణ

అలా ప్రతి క్యారెక్టర్ నేమ్ చెబుతూ దానిని వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ఎవరికి ఇచ్చారో గెస్ చేయడమే ఈ గేమ్. అంతకు ముందు రామకృష్ణ, షాలిని మధ్య పెద్ద రచ్చే జరిగింది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా రామకృష్ణ.. షాలినిని అడ్డుకున్నాడు. ఈ క్రమంలో ఆమెని నెట్టాల్సి వచ్చింది. దీనితో రామకృష్ణ తనని గట్టిగా తోసేశాడు అంటూ షాలిని రోహిత్ కి చెప్పుకుని ఏడ్చేసింది. దీనితో రామకృష్ణ కావాలని తాను నెట్టలేదని.. అనుకోకుండా జరిగింది అని సారీ చెప్పాడు. అయినా షాలిని కూల్ కాకపోవడంతో ఆమె కాళ్ళు పట్టుకునేందుకు కూడా రెడీ అయ్యాడు. కానీ శివ కుమార్ వచ్చి సమస్యని పరిష్కరించారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
బిగ్ బాస్ తెలుగు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Neha Sharma: చిరుత హీరోయిన్ నేహా శర్మ గ్లామరస్ ఫొటోలు..పింక్ డ్రెస్ లో స్టన్నింగ్ షో
Recommended image2
Ram Charan - Sukumar: రామ్ చరణ్ RC17 కోసం సుకుమార్ టీమ్ రెడీ.. హైదరాబాద్‌లో కొత్త ఆఫీస్ ప్రారంభం
Recommended image3
Yash Ramayana Look: 'రామాయణం'లో యశ్ రావణుడి గెటప్‌పై బాలీవుడ్ నటుడి షాకింగ్ కామెంట్స్.. ఏం మారలేదు అంటూ..
Related Stories
Recommended image1
కృష్ణ, శోభన్ బాబు నుంచి సూర్యకాంతం వరకు, లెజెండ్స్ అంతా ఉన్నారు.. దర్శకుడే ఫ్లాప్ అన్నారు, కట్ చేస్తే
Recommended image2
Rajamouli: రాజమౌళి సినిమాల్లో వరస్ట్ మూవీ అదే, తేల్చేసిన కార్తికేయ.. బెస్ట్ మూవీస్ ఆర్ఆర్ఆర్, బాహుబలి కాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved