చిరంజీవి నెక్ట్స్ హరీష్ శంకర్ తోనే ?టైటిల్ అదే?
ఇప్పటికే కథ విని ఓకే చేసిన చిరంజీవి ... రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్‌కు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ట్విట్టర్ లో వీళ్లిద్దరి హ్యాష్‌ట్యాగ్‌లే ట్రెండ్ అవుతున్నాయి

Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి మరో కొత్త సినిమా కమిటయ్యాయని తెలుస్తోంది. భోళా శంకర్ కాస్త డల్ అయ్యారనుకున్నా..వరస ప్రాజెక్టులతో తన అభిమానులలో ఆయన జోష్ నింపుతున్నారు. ఈ క్రమంలో ఆయన యంగ్ డైరక్టర్స్ తో వరుస సినిమాలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే తన 156వ సినిమా ‘విశ్వంభర’షూటింగ్ లో బిజీగా ఉన్న చిరు, ఇప్పుడు ఓ కొత్త ప్రాజెక్ట్ చేయనున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇండస్ట్రీకి ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ ను అందించిన హరీశ్ శంకర్ దర్శకత్వంతో ఆయన ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ,చిరంజీవి కుమార్తె సుష్మిత కలిపి ఈ ప్రాజెక్టుని నిర్మించనుందని టాక్. ఈ సినిమాకి బీవీఎస్ రవి దీనికి కథను అందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథ విని ఓకే చేసిన చిరంజీవి ... రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్‌కు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
దీంతో ట్విట్టర్ లో వీళ్లిద్దరి హ్యాష్‌ట్యాగ్‌లే ట్రెండ్ అవుతున్నాయి. గతంలో పూరి,చిరంజీవిల కాంబినేషన్ లో చేద్దామనుకున్న ఆటో జాని కథనే కొద్దిపాటి మార్పులతో చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్ లో వినిపిస్తోంది. అప్పట్లో ఈ ప్రాజెక్టుకు కొంత హరీష్ సహకారం అందించారని, దాన్నే ఇప్పుడు తీసి పాలిష్ చేసి మళ్లీ పట్టాలు ఎక్కిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.
టైటిల్ ఆటోజాని అయితే వింటేజ్ గా మాస్ గా ఉంటుందని భావిస్తున్నారట. ఇందులో ఫస్టాఫ్ లో చిరంజీవి ఆటో జాని గా కనిపిస్తూ ఇంటర్వెల్ దగ్గర ఓ ట్విస్ట్ రివీల్ అయ్యి సెకండాఫ్ టర్న్ తీసుకుంటుందని అప్పట్లో వినిపించింది. పక్కా కమర్షియల్ సినిమా అని, ట్విస్ట్ లు, పంచ్ డైలాగులులతో ఫ్యాన్ బోయ్ హరీష్ ఈ స్క్రిప్టుని అదరకొట్టాడని తెలుస్తోంది.
గతంలో చిరంజీవి అంటే తనకెంతో ఇష్టమని హరీశ్ ఎన్నో సందర్భాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లకు తనకు మెగాస్టార్ తో చేసే అవకాసం రావటంతో హరీష్ శంకర్ ఓ రేంజిలో అదరకొట్టబోతున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఈ వార్త అఫీషియల్ అయితే కాదు. కేవలం మీడియా వర్గాల్లో వినిపిస్తున్నది మాత్రమే.
ముందుగా మెగాస్టార్ తన కూతురు సుస్మిత కొణిదెల హోమ్ బ్యానర్ లో సినిమా చేద్దామని అనుకున్నారు కానీ ఆ తర్వాత ఆ సినిమాను పక్కన పెట్టి యూవీ క్రియేషన్స్ విశ్వంభరకు వెళ్లారు. ఇప్పుడు తన పెద్ద కుమార్తెతో హరీష్ శంకర్ సినిమాను నిర్మించే అవకాశం ఉంది. బేసిక్ ఐడియా లాక్ చేశారని టాక్. వారం రోజుల పాటు దానిపై కూర్చొని ఫైనల్ స్టోరీని ఒకే చేసినట్టు తెలుస్తుంది. కథ లాక్ అయ్యాక ఈ ప్రాజెక్టును అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తారు.
ప్రస్తుతం చిరంజీవి ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’లో నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన దీని ప్రచార చిత్రానికి మంచి స్పందన వచ్చింది. చిరు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది.
మరోవైపు హరీశ్ శంకర్ కూడా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) పనుల్లో ఉన్నారు. పవన్ కల్యాణ్ హీరోగా రానున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయిక. ఈ చిత్రంతో పాటు రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’ రూపొందిస్తున్నారు. దీని షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. రవితేజపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ రెండింటి తర్వాత చిరుతో ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది.