- Home
- Entertainment
- రమ్యకృష్ణ ఫేవరేట్ హీరో కోసం అందరి ముందు కొట్టుకున్న చిరంజీవి, నాగార్జున.. స్టార్ హీరోలు ఇలా చేశారేంటి?
రమ్యకృష్ణ ఫేవరేట్ హీరో కోసం అందరి ముందు కొట్టుకున్న చిరంజీవి, నాగార్జున.. స్టార్ హీరోలు ఇలా చేశారేంటి?
సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కోసం మెగాస్టార్ చిరంజీవి, మన్మథుడు నాగార్జున పోటీ పడ్డ సందర్భం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. అందరి ముందు ఈ ఇద్దరు చేసిన పని రచ్చ అవుతుంది.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా తెలుగు సినిమా పరిశ్రమని ఊపేసింది రమ్యకృష్ణ. ఇప్పుడు ఆమె పవర్‌ఫుల్ రోల్స్ లో మెప్పిస్తుంది. ఆమె చాలా తక్కువగానే సినిమాలు చేస్తుంది. కానీ బలమైన పాత్రలతో మెప్పిస్తుంది. అందుకే ఇప్పటికీ తన సమకాలీకుల్లో ఏ హీరోయిన్‌కి లేని క్రేజ్ రమ్యకృష్ణకి ఉందంటే అతిశయోక్తి కాదు.
`బాహుబలి`లో శివగామి పాత్ర తర్వాత రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ పుంజుకుంది. ఆమె స్టామినా ఏంటో ప్రపంచానికి తెలిసింది. అందుకే ఆమెని ఆ రేంజ్‌లో వాడుకోవాలనే మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. తను కూడా బలమైన పాత్రలకే ప్రయారిటీ ఇస్తూ సినిమాలు చేస్తుంది. `రంగమార్తాండ`, `గుంటూరు కారం` ఆ కోవలోకి చెందినవే.
ఇక హీరోయిన్‌గా ఉన్నప్పుడు మాత్రం టాలీవుడ్ టాప్ హీరోలందరితోనూ జోడీ కట్టింది రమ్యకృష్ణ. గయ్యాలి ప్రియురాలిగానే, యాటిట్యూడ్ ఉన్న లవర్‌గా, సాంప్రదాయానికి పెద్ద పీట వేసే ఇల్లాలుగా, అమాయకురాలైన భార్యగా నటించి మెప్పించింది. `నరసింహా` వంటి చిత్రాల్లో నెగటివ్ రోల్స్ లోనూ మెరిసింది. గ్లామర్ విషయంలోనూ తగ్గేదెలే అని నిరూపించుకుంది.ఎక్కువగా ఆమె గ్లామర్ రోల్స్ తోనూ అలరించింది.
సౌందర్య, రోజా, రంభ, మీనా, నగ్మా వంటి హీరోయిన్లు ఇండస్ట్రీని ఊపేస్తున్న సమయంలో రమ్యకృష్ణ కూడా వారికి దీటుగా రాణించింది. పోటీపడి సినిమాలు చేసి స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. స్టార్ హీరోలు చిరు, బాలయ్య, వెంకీ, నాగ్ వంటి వారు కూడా ఆమెతో సినిమాలు చేసేందుకు ఇష్టపడేవారు. ఆమెని హీరోయిన్‌గా కోరుకునే వారు.
అయితే చిరంజీవి, నాగార్జున మాత్రం రమ్యకృష్ణ కోసం పోటీ పడ్డారు. కొట్టుకునేంత పని చేశారు. అందరి ముందు తానంటే తాను ఫేవరేట్ అని చెప్పించుకునేందుకు హంగామా చేశారు. ఇది పెద్ద రచ్చ అయ్యింది. మరి ఇంతకి ఏం జరిగింది. చిరంజీవి, నాగార్జున కొట్టుకోవడమేంటి? అనేది చూస్తే,
అయితే తెలుగు ఇండస్ట్రీలోని అందరు పాల్గొనేలా ఓ కార్యక్రమం జరిగింది. ఇందులో టాప్ స్టార్స్ అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రమ్యకృష్ణతోపాటు చిరంజీవి, నాగార్జున ఇలా అనేక మంది స్టార్స్ పాల్గొన్నారు. అయితే ఈ ముగ్గురు పక్క పక్కనే కూర్చొన్నారు. ఈ వేడుకకి సుమ యాంకర్‌గా వ్యవహరించింది.
ఇందులో సుమ స్టేజ్ దిగి వచ్చి హీరో, హీరోయిన్లతో సరదాగా మాట్లాడించింది. అందులో భాగంగా రమ్యకృష్ణ వద్దకు వచ్చి మీ కెరీర్‌లో, మీరు నటించిన హీరోల్లో మీకు నచ్చిన, ఫేవరేట్ హీరో ఎవరు అని అడిగింది. అందుకు తానే ఫేవరేట్ హీరో అని చిరంజీవి, తానే అని నాగార్జున పోటీపడ్డారు. కెమెరా ముందు తాను ఫేవరేట్ అని చెప్పేందుకు చిరంజీవి తహతహలాడగా, నాగార్జున సైతం తానేం తక్కువ కాదని తనవంతు ప్రయత్నం చేశారు. అయితే చిరు, నాగ్ పక్కపక్క చైర్లలోనే ఉన్నారు, దీంతో ఇద్దరు కొట్టుకునేలా ప్రవర్తించడం విశేషం.
దీనికి రమ్యకృష్ణ.. నవ్వుతూ సుమా ఇది టూ మచ్ అని చెప్పింది. దీంతో మైక్ లాక్కొన్న నాగార్జున నాతో ఎక్కువ సినిమాలు చేసింది. అందుకే నేను ఫేవరేట్ అని నాగ్ చెప్పగా, చిరంజీవి మైక్ తీసుకుని నాతో మంచి పేరొచ్చే సినిమాలు చేసింది. అందుకే నేను ఫేవరేట్ అని ఆయన చెప్పారు.
దీనికి రమ్యకృష్ణ రియాక్ట్ అవుతూ ఇంతకంటే ఏం కావాలి అంటూ నవ్వులు చిందించింది. ఈ సన్నివేశంతో ఆ ప్రాంగణమంతా హోరెత్తిపోయింది. ఫన్నీగా చోటు చేసుకున్న ఈ సన్నివేశం ఈవెంట్‌లోనే హైలైట్‌గా మారింది. అయితే ఇప్పుడు ఇది యూట్యూబ్‌లో ట్రెండ్ అవడం విశేషం.