చిరంజీవి-కృష్ణవంశీ దేశభక్తి చిత్రం ఎందుకు ఆగింది? షాకింగ్ రీజన్
దేశభక్తి నేపథ్యంలో చిరంజీవి, కృష్ణవంశీ కాంబినేషన్‌లో 2004లో 'వందేమాతరం' అనే సినిమా ప్లాన్ చేశారు. అయితే, బడ్జెట్ పరిమితుల కారణంగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఈ విషయంపై ఇరువర్గాల నుంచి అధికారిక ప్రకటన రాలేదు.
Chiranjeevi, Krishna Vamsi, Patriotic Venture
తెలుగు చిత్ర పరిశ్రమకు దొరికిన విలక్షణ దర్శకుల్లో కృష్ణవంశీ ఒకరనే సంగతి తెలిసిందే. సామాజిక అంశాలు, దేశభక్తి, సంస్కృతి, సాంప్రదాయాలు, కుటుంబ సంబంధాలు ఆయన సినిమాల్లో కనిపిస్తాయి.
రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుంచి వచ్చిన కృష్ణవంశీ ఆలోచనలు కూడా అంతుచిక్కరు. కానీ గురువు భావాలూ ఆయనతో కనినించవు. తొలుత అనగనగా ఒకరోజు సినిమాకు దర్శకత్వం వహించే బాధ్యత కృష్ణవంశీకే దక్కింది. కానీ ఆ చిత్ర బడ్జెట్ పరిధి దాటిపోతుండటంతో డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పించారు.
Chiranjeevi, Krishna Vamsi, Patriotic Venture
కానీ కృష్ణవంశీలోని ప్రతిభ, చురుకుదనం గమనించిన ఆర్జీవీ.. తనే ప్రొడ్యూసర్‌గా గులాబీ చిత్రం ద్వారా దర్శకుడిని చేశారు. రెండో చిత్రానికే ఏకంగా ఏకంగా కింగ్ నాగార్జునతో సినిమా తీసే ఛార్స్ కొట్టేసిన కృష్ణవంశీ నిన్నే పెళ్లాడతాతో బ్లాక్‌బస్టర్ కొట్టారు.
సింధూరంతో నక్సలైట్లు, పోలీసుల మధ్య సామాన్య ప్రజలు ఎలా నలిగిపోతున్నారో చూపించారు. అంత:పురం, సముద్రం, మురారి, ఖడ్గం, శ్రీ ఆంజనేయం, చక్రం, డేంజర్, రాఖీ, చందమామ, మహాత్మ, గోవిందుడు అందరివాడే వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తన మార్క్ చూపించారు. ఈ మధ్య ఎందుకో కృష్ణవంశీ జోరు తగ్గింది అనుకునేలోగా గతేడాది రంగమార్తాండతో వచ్చి సందడి చేశారు కృష్ణవంశీ.
అయితే కృష్ణవంశీకు చిరంజీవి తో సినిమా చేయాలనేది చిరకాల కోరిక. అయితే అది నెరవేరలేదు. అందుకేనేమో రంగ మార్తాండ చిత్రానికి చిరు వాయిస్ ఓవర్ అందించారు. అయితే చిరంజీవితో ఆయన సినిమా ఎందుకు ఆగిపోయిందనేది ఇప్పటికి చాలా మందికి అర్దం కాని విషయం. అయితే తాజాగా ఆ విషయం గురించి సోషల్ మీడియాలో వినిపించింది. సినిమా స్క్రిప్టు కూడా రాసుకున్న స్క్రిప్టు ఎందుకు ఆగిపోయిందనే కారణం తెలిసింది.
అప్పట్లో అంటే 2003, 2004లలో హిందీలో దేశభక్తి చిత్రాల ట్రెండ్ మొదలుకాగానే అదే ఊపుతో తెలుగులో కృష్ణవంశీ చిరంజీవితో వందేమాతరం చిత్రాన్ని తియ్యటానికి ప్లాన్ చేశాడు.
హిందీలో భగత్ సింగ్ రెండు మూడు చిత్రాలు వచ్చిన పరిస్థితుల్లో ఈ చిత్రం వర్కవుట్ అవుతుందనుకున్నారు. ఆ సినిమా చిరంజీవి కెరీర్ కి ఫెచ్ అవుతుందని ఓ.కే. అన్నాడు. ఈ చిత్రాన్ని 2004 ఆగస్టు 15న ప్రారంభించనున్నట్టు కృష్ణవంశీ ప్రకటిం చాడు కూడా.
తదనంతర పరిణామాలు ముఖ్యంగా అంజి ఫ్లాప్ చిరం జీవిని పునరాలోచనల్లో పడవేశాయి. చిరంజీవితో చిత్రానికి కృష్ణవంశీ సూచించిన బడ్జెట్ 20 కోట్లు . ప్రాంతీయ చిత్రాలకు అన్ని కోట్లు వెచ్చించటం బిజినెస్ రీత్యా ఇబ్బంది అవుతుందని అని గ్రహించిన చిరంజీవి ఆ ప్రాజెక్ట్ డ్రాప్ చేసుకుందామని అన్నాడట.
దాంతో ఆ చిత్రం ఎనౌన్స్మెంట్ ముందే ఆగిపోయింది. ఈ సినిమా వర్క్ కోసం తన విలువైన కాలాన్ని పాడు చేసుకున్నానని కృష్ణవంశీ బాధపడినట్టు అప్పట్లో చెప్పుకున్నారు. అయితే ఈ సినిమా ప్రపోజల్ ఆగిపోయినట్టు కూడా ఇరువురూ ప్రకటన ఇవ్వలేదు. అయితే ఈ ప్రాజెక్ట్ లేనట్టేనని ఇరువర్గాలూకు అంటున్నాయి.
వాస్తవానికి రంగమార్తాండ తర్వాత కృష్ణవంశీ మరో కొత్త ప్రాజెక్ట్ ఏది అనౌన్స్ చేయలేదు. ఆయనతో సినిమాలు తీసేందుకు నిర్మాతలు రెడీగానే ఉన్నా కృష్ణవంశీయే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదనేది నిజం. కానీ ఒకానొక దశలో సినిమాలన్నీ ఫ్లాప్ కావడం, చేతిలో సినిమాలు లేకపోవడంతో జీవితం ఎలా ఉందో.. ఎటు పోతుందో అర్ధం కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఓ దశలో దర్శకుడిగా చనిపోయాననే ఫీలింగ్ ఉండేది. కానీ చిరంజీవి అవకాశం ఇచ్చి నన్ను బతికించాడు. కానీ తాను ఇబ్బందుల్లో ఉన్న విషయాన్ని తెలుసుకుని రామ్ చరణ్‌తో గోవిందుడు అందరివాడేలా సినిమా తీసే అవకాశాన్ని చిరంజీవి ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడే కాదు జీవితంలో చాలా సందర్భాల్లో అన్నయ్య చిరంజీవి తనకు అండగా నిలుస్తూ వచ్చారని తెలిపారు. ఇప్పుడు మరోసారి ఆ ఆగిపోయిన ప్రాజెక్టు బయిటకు తీస్తే ఎలా ఉంటుంది అనేది అభిమానుల కోరిక.