MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • చిరంజీవి ఎమోషనల్ , మనసు నిండిపోయింది, ప్రేమ మరువలేనంటూ మెగాస్టార్ కృతజ్ఞతలు.. ఎవరికో తెలుసా?

చిరంజీవి ఎమోషనల్ , మనసు నిండిపోయింది, ప్రేమ మరువలేనంటూ మెగాస్టార్ కృతజ్ఞతలు.. ఎవరికో తెలుసా?

చిరంజీవి ఎమెషనల్ అయ్యారు.. తనపై ఇంత ప్రేమాభిమానాలు చూపించినందుకు పొంగిపోయారు. ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలిపారు. మెగాస్టార్ ఇంత సంతోషంగా స్పెషల్ నోట్ ఎవరికి రాశారో తెలుసా? అసలు విషయం ఏంటంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 20 2026, 06:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మన శంకర వర ప్రసాద్ గారు సక్సెస్ జోష్ లో చిరంజీవి..
Image Credit : Asianet News

మన శంకర వర ప్రసాద్ గారు సక్సెస్ జోష్ లో చిరంజీవి..

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా మన శంకర వర ప్రసాద్ గారు. నయనతార హీరోయిన్ గా నటించిన ఈసినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. రికార్డుల మోత మోగిస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్నిరికార్డులు బ్రేక్ చేయడానికి రెడీగా ఉంది చిరంజీవి సినిమా. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈసినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి.. థియేటర్లలో ప్రేక్షకుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ సంచలనం సృష్టిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బాక్సాఫీస్ దగ్గర మెగా మూవీ దూకుడు..
Image Credit : Book My Show

బాక్సాఫీస్ దగ్గర మెగా మూవీ దూకుడు..

మన శంకర వర ప్రసాద్ గారు సినిమా విడుదలైన ఎనిమిదవ రోజు కూడా అద్భుతమైన వసూళ్లు నమోదు చేయగా, భారీ అడ్వాన్స్ బుకింగ్‌లతో తొమ్మిదవ రోజున మరింత జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన మన శంకర వర ప్రసాద్ గారు సినిమా ఇప్పటికే ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్‌ను సాధించి షాక్ ఇచ్చింది. చాలా వేగంగా ఈ మార్క్‌ను చేరిన తెలుగు సినిమాగా మన శంకర వర ప్రసాద్ గారు ప్రత్యేక ఘనతను అందుకుంది. అంతేకాకుండా, ఉత్తర అమెరికాలో 3 మిలియన్ డాలర్ల వసూళ్లను అధిగమించి, చిరంజీవి తో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్‌లలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

35
మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక కృతజ్ఞతలు
Image Credit : Asianet News

మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక కృతజ్ఞతలు

ఈ ఘన విజయం నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఒక ఎమెషనల్ మెసేజ్ ను అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమా విజయం వెనుక నిలిచిన ప్రేక్షకులు, డిస్ట్రిబ్యూటర్లు, అలాగే సినిమా టీమ్ మొత్తానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన కెరీర్‌లోని ప్రతి మైలురాయి తరతరాల సినీ అభిమానుల ప్రేమాభిమానాల ఫలితమేనని చిరంజీవి అన్నారు. మెగాస్టార్ ఇంకేమన్నారంటే..

45
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..
Image Credit : Youtube/@GoldBoxEnt

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..

“మన శంకర వర ప్రసాద్ గారు సాధించిన ఈ అద్భుతమైన విజయాన్ని చూసి నా మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. నేను ఎప్పుడూ మీ ప్రేమకు ప్రతిరూపమని చెబుతూనే ఉంటాను. ఈ రోజు మీరు దానిని మరోసారి నిరూపించారు. ఈ రికార్డు తెలుగు ప్రేక్షకులది, డిస్ట్రిబ్యూటర్లది, దశాబ్దాలుగా నా వెంట నిలిచిన మెగా అభిమానులది. థియేటర్లలో మీ విజిల్స్‌నే నాకు ప్రాణం. రికార్డులు వస్తాయి, పోతాయి… కానీ మీ ప్రేమ మాత్రం శాశ్వతం” అని చిరంజీవి తన సందేశంలో తెలిపారు.

55
మూవీ టీమ్ పై మెగా కామెంట్స్..
Image Credit : facebook

మూవీ టీమ్ పై మెగా కామెంట్స్..

చాలా కాలం తరువాత తనకు బ్లాక్‌బస్టర్ విజయం అందించిన దర్శకుడు అనిల్ రావిపూడిని కూడా చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. అలేగే నిర్మాతలు సాహు , సుష్మితతో పాటు మొత్తం టీమ్ చేసిన కృషికి అభినందనలు తెలియజేశారు. తనపై వారు చూపిన నమ్మకానికి ఈ విజయం అంకితమని చెబుతూ, వేడుకలను కొనసాగిద్దామని అభిమానులను ఉద్దేశించి సందేశం ఇచ్చారు. ఈ ఎమోషనల్ మెసేజ్ ద్వారా అభిమానుల మనసును మరోసారి గెలుచుకున్నారు చిరంజీవి . ఇక ఈ మెసేజ్ ను మెగా అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నయనతార
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: తీశావులే బోడి బాహుబలి అంటూ.. రాజమౌళిని అవమానించింది ఎవరో తెలుసా? హీరో నాని చెప్పిన సీక్రెట్..
Recommended image2
Nagarjuna: హలో బ్రదర్ సినిమాలో నాగార్జున డూప్ గా నటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా? ఎలా ఒప్పుకున్నాడంటే?
Recommended image3
Love Story Movies: గర్ల్ ఫ్రెండ్ తో ఎప్పుడూ గొడవలేనా.. అయితే ఈ 6 సినిమాలు తప్పకుండా చూడాల్సిందే
Related Stories
Recommended image1
ఇండియా రిచ్ స్టార్స్ లో ఇద్దరు తెలుగు హీరోలు, టాప్ 10 లో ఫస్ట్ ప్లేస్ ఎవరిదో తెలుసా?
Recommended image2
పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా..? డైరెక్టర్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved