MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సినిమా కోసం ఏడాది వయసున్న తన కూతురితో వీడియో చేసిన చిరు.. ఎన్టీఆర్ తర్వాత నువ్వే, జోస్యం చెప్పిన డైరెక్టర్

సినిమా కోసం ఏడాది వయసున్న తన కూతురితో వీడియో చేసిన చిరు.. ఎన్టీఆర్ తర్వాత నువ్వే, జోస్యం చెప్పిన డైరెక్టర్

చిరంజీవి ఓ సినిమా కోసం తన పెద్ద కుమార్తె సుస్మిత ఏడాది వయసు పసిపాపగా ఉన్నప్పుడు ఓ వీడియో చేశారట. ఆ వీడియో చూసి స్టార్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 09 2026, 07:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిరంజీవి కమిట్మెంట్
Image Credit : Instagram/SushmitaKonidela

చిరంజీవి కమిట్మెంట్

మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేస్తారు. డ్యాన్సులు, ఫైట్స్, నటన ఇలా ప్రతిదీ అభిమానులకు నచ్చేలా చిరంజీవి చూసుకుంటారు. కోదండరామిరెడ్డి తర్వాత చిరంజీవి దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుతో ఎక్కువ సినిమాలు చేశారు. వీరిద్దరి కాంబోలో ఘరానా మొగుడు, జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి అద్భుతమైన సినిమాలు వచ్చాయి.

25
రాఘవేంద్ర రావు దర్శకత్వంలో
Image Credit : Asianet News

రాఘవేంద్ర రావు దర్శకత్వంలో

ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి అడవి దొంగ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో అడవి దొంగ సినిమా ఫిక్స్ అయింది. కథ ప్రకారం హీరో ఎక్కువగా అడవుల్లో జంతువుల మధ్య ఉంటాడు. ఒక అడవి మనిషిలా ఎలా నటించాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి అని ఆలోచిస్తున్నా.

Related Articles

Related image1
మీ తాత మళ్ళీ పుట్టాడు రా.. జూనియర్ ఎన్టీఆర్ నటనకు ఫిదా, సెట్ లో చప్పట్లు కొడుతూ ఉండిపోయిన సీనియర్ నటుడు
Related image2
OTT Movies: చిరు, నవీన్ పోలిశెట్టి, శివాజీ ఒకేసారి దండయాత్ర..ఈ వారం ఓటీటీలో వినోదాల విందు గ్యారెంటీ
35
పెద్ద కుమార్తె సుస్మితతో ఆడుకుంటూ..
Image Credit : youtube/etv alitho saradaga show

పెద్ద కుమార్తె సుస్మితతో ఆడుకుంటూ..

అప్పుడు నా పెద్ద కూతురు సుస్మితకి ఏడాది వయసు మాత్రమే. చిన్న పాప కాబట్టి నేలపై పాకుతూ ఉండేది. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. నేను కూడా సుస్మితతో ఆడుకుంటూ నేలపై పాకుతూ పోట్లాడినట్లు సరదాగా గడిపేవాడిని. ఆ దృశ్యాలని చిన్న కెమెరాలో షూట్ చేశా. ఒక రోజు రాఘవేంద్ర రావు గారిని ఇంటికి పిలిచా. గురువు గారు.. అడవి దొంగ సినిమాలో నటించేందుకు నేను ఒక ప్రయత్నం చేశాను అని ఆ వీడియో రాఘవేంద్ర రావు కి చూపించాను.

45
ఎన్టీఆర్ తర్వాత టాలీవుడ్ లో నువ్వే
Image Credit : Asianet News

ఎన్టీఆర్ తర్వాత టాలీవుడ్ లో నువ్వే

ఆ వీడియో చూసి రాఘవేంద్ర రావు గారు ఒక మాట అన్నారు. నీకు నటనపై ఇంత కమిట్మెంట్ ఉంది కాబట్టి ఇండస్ట్రీలో ఇక రామారావు తర్వాత నువ్వే అని అన్నారు. ఆయన తర్వాత అంత పెద్ద స్టార్ అవుతావు అని జోస్యం చెప్పారు. రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. సెట్ లో కి వెళ్ళాక ఎలా నటించాలో డైరెక్టర్ చెబుతారు కదా అని చిరంజీవి అనుకోలేదు. నేను కొత్తగా ప్రయత్నించాలి అని నిత్యం కష్టపడుతూనే ఉండేవారు అంటూ రాఘవేంద్ర రావు అన్నారు.

55
సంచలన విజయం
Image Credit : Instagram/Chiranjeevi

సంచలన విజయం

అడవి దొంగ మూవీ 1985లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఫస్ట్ హాఫ్ మొత్తం చిరంజీవికి డైలాగులు ఉండవు. దీనితో చిరంజీవికి డైలాగులు లేకుండా చేశారు ఇదేం సినిమా అని కామెంట్ చేశారు. సెకండ్ హాఫ్ తో సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది అని రాఘవేంద్ర రావు తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Viroshi Wedding: గ్రాండ్‌గా విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా మ్యారేజ్‌, హాజరైన గెస్ట్ లు వీరే.. సాయంత్రం మరో పెళ్లి
Recommended image2
Karthika Deepam 2 Today Episode: కాశీని పాముతో పోల్చిన స్వప్న- జ్యోతో ఆడుకున్న దాసు- పారు టెన్షన్
Recommended image3
Chiru-Charan: టాలీవుడ్‌లో అరుదైన రికార్డులు సెట్‌ చేసిన చిరంజీవి, రామ్‌ చరణ్‌.. పవన్‌, అల్లు అర్జున్‌ కూడా తర్వాతే
Related Stories
Recommended image1
మీ తాత మళ్ళీ పుట్టాడు రా.. జూనియర్ ఎన్టీఆర్ నటనకు ఫిదా, సెట్ లో చప్పట్లు కొడుతూ ఉండిపోయిన సీనియర్ నటుడు
Recommended image2
OTT Movies: చిరు, నవీన్ పోలిశెట్టి, శివాజీ ఒకేసారి దండయాత్ర..ఈ వారం ఓటీటీలో వినోదాల విందు గ్యారెంటీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved