- Home
- Entertainment
- మార్చలేనప్పుడు వదిలేయడమే అంటూ కళ్యాణ్ దేవ్ పోస్ట్... ఉదయ్ కిరణ్ లా ధైర్యం కోల్పోకు అంటూ వాళ్ళ మద్దతు!
మార్చలేనప్పుడు వదిలేయడమే అంటూ కళ్యాణ్ దేవ్ పోస్ట్... ఉదయ్ కిరణ్ లా ధైర్యం కోల్పోకు అంటూ వాళ్ళ మద్దతు!
చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ భర్తకు దూరమైన విషయం తెలిసిందే. అధికారిక ప్రకటన చేయకున్నప్పటికీ విశ్వసనీయ సమాచారం ఉంది. ఈ క్రమంలో కళ్యాణ్ దేవ్ పోస్ట్ ఆసక్తి రేపుతోంది.

Sreeja-Kalyan Dev
శ్రీజ కొణిదెల రెండో వివాహంగా కళ్యాణ్ దేవ్ ని చేసుకున్నారు. 2016లో వీరికి వివాహం కాగా ఓ పాప ఉంది. ఆ పాప పేరు నవిష్క. చిరంజీవి అల్లుడయ్యాక కళ్యాణ్ దేవ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. విజేత మూవీతో వెండితెరకు పరిచయమయ్యాడు. మెగా ఫ్యామిలీ ఆయనకు మద్దతు ఇచ్చారు. ఆ సినిమా పర్లేదు అనిపించుకుంది.
kalyan dev
కారణం తెలియదు కానీ శ్రీజ-కళ్యాణ్ దేవ్ విడిపోయారు. రెండేళ్లకు పైగా విడివిడిగా ఉంటున్నారు. కూతురు నవిష్క తల్లి వద్దే పెరుగుతుంది. అప్పుడప్పుడు కూతురిని కలిసే అవకాశం కళ్యాణ్ దేవ్ కి ఇచ్చారు. నవిష్క తనతో ఉన్న హ్యాపీ మూమెంట్స్ కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తారు.
Kalyan Dev-Sreeja
అప్పుడప్పుడూ శ్రీజ, కళ్యాణ్ దేవ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. పరోక్షంగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్న సందర్భాలున్నాయి. విడిపోయినట్లు శ్రీజ, కళ్యాణ్ దేవ్ అధికారిక ప్రకటన చేయలేదు. దూరంగా ఉంటున్న నేపథ్యంలో విడిపోయిన సంగతి నిజమే అని సమాచారం.
sreeja kalyan
తాజాగా కళ్యాణ్ దేవ్ మరో పోస్ట్ పెట్టారు. ఇంస్టాగ్రామ్ లో ఆయన... 'ఎప్పటికీ మార్చలేని విషయాలను వదిలేసే ధైర్యం వచ్చినప్పుడు ఆ క్షణాలు చాలా ఆనందమయం, నేను ఇప్పుడు అదే చేస్తున్నాను' అని కామెంట్ పెట్టాడు. ఈ కామెంట్ కళ్యాణ్ దేవ్ శ్రీజను ఉద్దేశించే చేశాడని నెటిజెన్స్ నమ్ముతున్నారు.
కళ్యాణ్ దేవ్ కి అతని అభిమానులు, సన్నిహితులు ధైర్యం చెబుతున్నారు. ఓ నెటిజెన్ అనూహ్యంగా... ఏం జరిగిన ధైర్యంగా ఉండండి. ఉదయ్ కిరణ్ లాగా చేయకండి, అంటూ కామెంట్ చేశాడు. ఉదయ్ కిరణ్ మరణానికి మెగా ఫ్యామిలీ పరోక్షంగా కారణమనే వాదన ఎప్పటి నుండో ఉంది. ఆ ఉద్దేశంతోనే సదరు నెటిజెన్ అలా స్పందించాడు.
శ్రీజకు దూరమయ్యాక కళ్యాణ్ దేవ్ రెండు సినిమాలు చేశాడు. ఆ చిత్రాలకు మెగా ఫ్యామిలీ నుండి మద్దతు లభించలేదు. సూపర్ మచ్చి 2022 సంక్రాంతి కానుకగా విడుదలైంది. కిన్నెరసాని టైటిల్ తో చేసిన మరొక చిత్రం డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేశారు. నటుడిగా కళ్యాణ్ దేవ్ కెరీర్ ముగిసిన సూచనలు కనిపిస్తున్నాయి.