- Home
- Entertainment
- ఇంట్లో చుట్టూ ఆడపిల్లలే, హాస్టల్ కి వార్డెన్‌లా ఉన్నా, అరే చరణ్ ఒక అబ్బాయిని ఇవ్వురా.. చిరుపై ట్రోల్స్
ఇంట్లో చుట్టూ ఆడపిల్లలే, హాస్టల్ కి వార్డెన్‌లా ఉన్నా, అరే చరణ్ ఒక అబ్బాయిని ఇవ్వురా.. చిరుపై ట్రోల్స్
మెగాస్టార్ చిరంజీవి ఆడపిల్లలపై చేసిన కామెంట్స్ ఇప్పుడు రచ్చ అవుతుంది. ట్రోలర్స్ నానా హడావుడి చేస్తున్నారు. చిరు అసలు బుద్ది ఇదేనంటూ ఆయన వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు.

chiranjeevi family
మెగాస్టార్ చిరంజీవి ట్రోలర్స్ కి దొరికిపోయాడు. ఆయన ఇటీవల హుందాగా మాట్లాడుతూ తన పెద్దరిక చాటుకుంటున్నారు. తన ఇమేజ్‌ని మరింతగా పెంచుకుంటున్నారు. కానీ తాజాగా ఆయన చేసిన కామెంట్ విమర్శలకు గురవుతుంది. ఆయనపై ట్రోల్స్ నడుస్తున్నాయి. ఆడపిల్లలపై చిరంజీవి చేసిన కామెంట్లు ఇప్పుడు రచ్చ అవుతుంది. మరి ఏం జరిగింది? చిరంజీవి ఏమన్నాడు? అనేది చూస్తే.
చిరంజీవి తాజాగా బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించిన `బ్రహ్మా ఆనందం` అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్ గా వెళ్లారు. అందులో రామ్ చరణ్ కూతురు క్లీంకార గురించి ప్రస్తావన వచ్చింది. యాంకర్ సుమ క్లీంకార తాతగారిని చూపించండి అని చెప్పింది. అప్పుడు చిరంజీవి స్పందిస్తూ, ఇంట్లో చుట్టూ ఆడపిల్లలే, వారిని చూస్తుంటే కొన్ని సార్లు లేడీస్ హాస్టల్ కి వార్డెన్‌లాగా ఉంటుందనిపిస్తుందని అన్నారు చిరంజీవి.
అంతేకాదు ఈ సారైనా ఒక్క మగపిల్లాడిని ఇవ్వరా అని ఆయన ఆ ఈవెంట్ వేదికగా చరణ్‌కి కోరారు, తమ లెగసీని కంటిన్యూ చేయడానికి ఒక్క మగపిల్లాడు కావాలని చిరంజీవి కోరుకున్నాడు. అదే సమయంలో మళ్లీ ఆడపిల్లను కంటాడేమో అనే భయంగా ఉందని చిరంజీవి మనసులో మాట బయటపెట్టేశాడు. వారసత్వం కావాలని చిరంజీవి కోరుకుంటున్నాడని, అదే సమయంలో ఇంట్లో అంతా ఆడపిల్లలే కావడంతో ఓ రకంగా ఆయన అబ్బాయిలు లేని లోటుని ఫీలవుతున్నట్టు ఆయన కామెంట్స్ ని బట్టి అర్థమవుతుంది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు చిరంజీవి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు రచ్చ చేస్తున్నారు. ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. చిరంజీవి ఆ సందర్భంలో సరదాగానే మాట్లాడినా, నెగటివ్ ఫ్యాన్స్ చిరంజీవిపై విమర్శలు చేస్తున్నారు. ఎంత చేసిన మీ అసలు బుద్ది బయటపెట్టుకున్నారని అంటున్నారు. తక్కువ ఆలోచన అని, ఈ స్టేట్‌మెంట్‌తో ఆయనేంటో అర్థమవుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.
చిరంజీవికి ముగ్గురు సంతానం. సుస్మిత, రామ్ చరణ్, శ్రీ. సుస్మితకి ఇద్దరు ఆడపిల్లలే, అలాగే శ్రీజకి కూడా ఇద్దరు ఆడపిల్లలే. ఇటీవల రామ్ చరణ్ కి కూడా క్లీంకార అమ్మాయినే. చిరంజీవి ఇంట్లో అమ్మ అంజనమ్మ, భార్య సురేఖ, కోడలు ఉపాసన, ఇద్దరు కూతుళ్లు, వారి ఐదుగురు మనవరాళ్లు, ఇలా ఇళ్లంతా ఆడవారితోనే ఉంటుంది. దాదాపు పది మంది ఆడవారు ఉంటారు. ఈ క్రమంలోనే చిరంజీవికి ఇలాంటి ఆలోచన వచ్చి ఉంటుంది. దీంతో ఇప్పుడు నోరు జారి ట్రోలర్స్ కి బలవుతున్నారు చిరు.
read more: కోడలు శోభితాకి `తండేల్` సక్సెస్ క్రెడిట్ ఇచ్చిన నాగార్జున.. నాగ చైతన్యపై ఎమోషనల్ కామెంట్స్
also read: Dilraju Decision: `గేమ్ ఛేంజర్` పరాజయం ఎఫెక్ట్.. స్టార్ హీరోలకు షాకిచ్చేలా దిల్ రాజు నిర్ణయం ?