- Home
- Entertainment
- Urvashi Rautela Net Worth : చిరంజీవి హీరోయిన్ ఊర్వశీ రౌటేలా ఎన్ని కోట్లు సంపాదించిందో తెలుసా?
Urvashi Rautela Net Worth : చిరంజీవి హీరోయిన్ ఊర్వశీ రౌటేలా ఎన్ని కోట్లు సంపాదించిందో తెలుసా?
బాలీవుడ్ నటి ఊర్వశీ రౌటేలా (Urvashi Rautela) పుట్టిన రోజువేడుకులను ఈరోజు ఘనంగా జరుపుకుంటోంది. స్పెషల్ సాంగ్స్ తో దుమ్ములేపుతున్న ఈ హాట్ బ్యూటీ ఎన్ని కోట్లు సంపాదించిందో ఆ వివరాలు ఆసక్తికరంగా మారింది.

స్పెషల్ సాంగ్స్ తో బాలీవుడ్ నటి ఊర్వశీ రౌటేలా దక్షిణాది ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పదేళ్లుగా ఈ బ్యూటీ ఇండస్ట్రీలో యాక్టివ్ గా కనిపిస్తోంది. వరుస చిత్రాలతో అలరిస్తూ వస్తోంది.
గతేడాది నుంచి తెలుగు చిత్రాల్లోనూ నటిస్తూ ఆకట్టుకుంటోంది. స్టార్ హీరోల చిత్రాల్లోని ఐటెమ్ సాంగ్స్ ల్లో నటిస్తూ అదరగొడుతోంది. చిరంజీవి సరసన ‘బాస్ పార్టీ‘, రామ్ పోతినేని చిత్రం ‘స్కంద’లో ‘మాస్ కల్ట్’ వంటి సాంగ్స్ చేసింది.
చివరిగా ‘ఏజెంట్’ చిత్రంలోనూ తన స్పెషల్ డాన్స్ తో అదరగొట్టింది. గ్లామర్ స్టెప్పులేసి మంత్రముగ్ధులను చేసింది. వరుస చిత్రాల్లో ఇలా నటించి టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారింది. అప్పటి నుంచి ఆమె గురించిన వార్తలు ఇక్కడా వైరల్ గా మారాయి.
అయితే..... ఈ రోజు ఊర్వశీ రౌటేలా పుట్టిన రోజు కావడం విశేషం. నేటితో ఈ ముద్దుగుమ్మ 30వ ఏటా అడుగుపెట్టింది. ఈ సందర్భంగా గోల్డెన్ కేక్ కట్ చేసి ఆశ్చర్యపరించింది. ఈ క్రమంలోనే ఊర్వశీ రౌటేలా నెట్ వర్త్ కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది.
ఊర్వశీ రౌటేలా కొద్దికాలం నుంచే స్పెషల్ సాంగ్స్ తో ఊపూపుతోంది. ఒక్క సాంగ్ కు భారీగానే ఛార్జ్ చేస్తోంది. ఇలా ఇప్పటి వరకు ఊర్వశీ రౌటేలా మొత్తంగా రూ.50 కోట్ల వరకు కూడబెట్టిందని తెలుస్తోంది. పలు ప్రాపర్టీస్ కూడా ఉన్నాయని తెలుస్తోంది.
ఇటు సినిమాలతో పాటు అటు మ్యూజిక్ ఆల్బమ్స్ లోనూ నటిస్తోంది. నెక్ట్స్ ‘లవ్ డోస్ 2‘ రాబోతోంది. ఒక్కొక్క మ్యూజిక్ వీడియోకి రూ.40 లక్షలు ఛార్జ్ చేస్తే.. సినిమాకు మాత్రం రూ.కోటీకి పైనే తీసుకుంటోంది. నెక్ట్స్ మరోసారి చిరు ’విశ్వంభర’లో స్పెషల్ డ్యాన్స్ చేయబోతున్నారని సమచారం.