రాజమౌళితో సినిమా, నా టైమ్ వేస్ట్.. చిరంజీవి బోల్డ్ స్టేట్‌మెంట్
Chiranjeevi, Rajamouli : మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి వరకు రాజమౌళి దర్శకత్వంలో పనిచేయలేదు. చాలా మంది సీనియర్ దర్శకులతో పనిచేశారు, ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్ తో పనిచేస్తున్నారు. కానీ జక్కన్న, చిరంజీవి కాంబినేషన్‌లో సినిమా పడలేదు. ఒకవేళ వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే ఎలా ఉంటుంది? మెగాస్టార్ మార్క్ కమర్షియల్ మీటర్‌లో రాజమౌళి సినిమా చేస్తే బాక్సాఫీసుకి పూనకాలే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

chiranjeevi, rajamouli
Chiranjeevi, Rajamouli : చిరంజీవి నాలుగున్నర దశాబ్దాలుగా చాలా మంది దర్శకులతో వర్క్ చేశారు. విశ్వనాథ్, రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, బి గోపాల్ నుంచి ఇప్పుడు బాబీ, వశిష్ట, శ్రీకాంత్ ఓడెల వంటి అప్ కమింగ్ డైరెక్టర్స్ తో వర్క్ చేశారు, వర్క్ చేస్తున్నారు. మూడు తరాల దర్శకులతో ఆయన పనిచేశారని చెప్పొచ్చు. ఇప్పుడు భారీ క్రేజీ మూవీస్‌తో రాబోతున్నారు చిరంజీవి.
chiranjeevi, rajamouli
అయితే ఇండియన్ సినిమా రూపురేఖలు మార్చేసిన రాజమౌళితో చిరంజీవి ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. గతంలో `మగధీర` సినిమా చేయాలనుకున్నారు కానీ కుదరలేదు. ఆ తర్వాత ఎప్పుడూ ఆ ప్లాన్ జరగలేదు.
తాజాగా దీనిపై స్పందించారు మెగాస్టార్. జక్కన్నతో మూవీ చేయకపోవడంపై రిగ్రెట్ ఉందా అనే ప్రశ్న ఎదురైన నేపథ్యంలో తనదైన స్టయిల్‌లో ఆయన స్పందించారు. తనకు ఇప్పుడు ఆ అవసరం లేదన్నారు. రాజమౌళితో సినిమా చేయడం టైమ్ వేస్ట్ అన్నారు చిరు.
chiranjeevi, rajamouli
మరి ఇంతకి ఆయన ఏం చెప్పాడనేది చూస్తే, నేను రాజమౌళితో పనిచేయాలనుకోవడం లేదు. నాకు నేనుగానే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నా. అందుకే రాజమౌళితో పనిచేయాల్సిన అవసరం లేదు. రాజమౌళి ఒక్కో సినిమాకి నాలుగైదేళ్లు వర్క్ చేస్తారు.
ఆ సమయంలో నేను నాలుగైదు సినిమాలు చేస్తాను. ఈ టైమ్‌లో అంత విలువైన సమయం వృథా చేసుకోవాలనుకోవడం లేదు` అని తెలిపారు చిరంజీవి. తాజాగా చిరంజీవి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ కి షాకిస్తున్నాయి.
Chiranjeevi starrer Vishwambhara film
చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీగా ఈ చిత్రం రూపొందుతుంది. త్రిష ఇందులో హీరోయిన్. భారీ స్థాయిలో దీన్ని తెరకెక్కిస్తున్నారు. జూన్‌లో ఈ మూవీ విడుదలయ్యే అవకాశం ఉంది.
మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా ఇటీవలే ప్రకటించారు. ఈ మూవీ వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. అలాగే శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో ఓ చేయాల్సి ఉంది చిరు.
Rajamouli
ఇక చివరగా `ఆర్‌ఆర్‌ఆర్`తో అలరించిన రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా `ఎస్‌ఎస్‌ఎంబీ29`పేరుతో మూవీని రూపొందిస్తున్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే యాక్షన్ అడ్వెంచరస్ మూవీ ఇది అని గతంలో రైటర్ విజయేంద్రప్రసాద్ చెప్పిన విషయం తెలిసిందే.
read more: బెట్టింగ్ యాప్ స్కామ్‌లో సోనూ సూద్.. కళియుగ కర్ణుడిపై నా అన్వేషణ అన్వేష్ సంచలన ఆరోపణలు