MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మెగా బాక్సాఫీస్ వార్... 2023 సంక్రాంతి బరిలో చిరు, బాలయ్య, ప్రభాస్, విజయ్!

మెగా బాక్సాఫీస్ వార్... 2023 సంక్రాంతి బరిలో చిరు, బాలయ్య, ప్రభాస్, విజయ్!

గత రెండేళ్లలో సంక్రాంతి సినిమా సమరం అంత రంజుగా లేదు. కరోనా ఆంక్షల నేపథ్యంలో పెద్ద చిత్రాల మధ్య పోటీ లేకుండా పోయింది. అయితే 2023 మాత్రం అతిపెద్ద బాక్సాఫీస్ వార్ కి సిద్ధం అవుతుందని తెలుస్తోంది. ఏకంగా నలుగురు బడా హీరోలు బరిలో దిగుతున్నారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Oct 17 2022, 02:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Prabhas

Prabhas

తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతికి తెలుగు సినిమా పరిశ్రమకు అవినాభావ సంబంధం ఉంది. నిర్మాతలు తమకు కాసులు కురిపించే పండుగగా సంక్రాంతిని భావిస్తారు. ఓకే రోజు రెండు చిత్రాలు విడుదలైనా మార్కెట్ ఉంటుంది. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా  కలెక్షన్ల సునామీ చూడొచ్చు. అందుకే బడా స్టార్స్ సంక్రాంతి బరిలో దిగేందుకు పోటీపడతారు. రెండేళ్లుగా కరోనా ఆంక్షల నేపథ్యంలో స్టార్ హీరోల చిత్రాలు సంక్రాంతికి విడుదల కాలేదు. 2023 సంక్రాంతికి మాత్రం ఏకంగా చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్, విజయ్ బాక్సాఫీస్ యుద్దానికి దిగుతున్నట్లు తెలుస్తుంది.

25

ప్రభాస్ ఆదిపురుష్ జనవరి 12న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. చాలా రోజుల క్రితమే మేకర్స్ అధికారికంగా విడుదల తేదీ ప్రకటించారు. రామాయణ గాథగా ఆదిపురుష్ చిత్రాన్ని ఓం రౌత్ తెరకెక్కించారు. కెరీర్ లో మొదటిసారి ప్రభాస్ రాముడు పాత్ర చేస్తున్నారు. కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడుగా నటిస్తున్నారు. కాగా ఆదిపురుష్ టీజర్ అనేక వివాదాలకు దారితీసింది. 
 

35


దర్శకుడు వంశీ పైడిపల్లి కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ తో వారసుడు చిత్రం చేస్తున్నారు. ఈ బైలింగ్వల్ మూవీ సైతం సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. తెలుగు తమిళ భాషల్లో వారసుడు విడుదల కానుంది. దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు. 
 

45

గాడ్ ఫాదర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న చిరు... మెగా 154 చిత్రాన్ని చకచకా పూర్తి చేస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి కాగా పాటల షూటింగ్ మిగిలివుందని సమాచారం. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్ర దర్శకుడు బాబీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. మెగా 154 టీజర్ దీపావళి కానుకగా విడుదల కానుందట. వాల్తేరు వీరయ్య టైటిల్ పరిశీలనలో ఉండగా సంక్రాంతి విడుదల చేయడం ఖాయమే అంటున్నారు. 
 

55
NBK 107 first hut glimpse

NBK 107 first hut glimpse


డిసెంబర్ లో విడుదలైన అఖండ రికార్డు కలెక్షన్లు రాబట్టింది. బాలయ్యను సక్సెస్ ట్రాక్ ఎక్కించడమే కాకుండా బ్లాక్ బస్టర్ విజయం అందించింది. అదే సెంటిమెంట్ తో ఆయన 107వ చిత్రాన్ని విడుదల చేయాలి అనుకున్నారు. ఎప్పుడు మనసు మార్చుకున్న బాలయ్య సంక్రాంతి బరిలోనే దిగుదాం అంటున్నారట. గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న NBK 107లో సంక్రాంతి కానుకగా విడుదల కానుందట. దీంతో 2023 జనవరిలో ప్రభాస్, చిరంజీవి, బాలయ్య, విజయ్ తమ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్నారట. ఈ క్రమంలో సినిమా ప్రేమికులు అతిపెద్ద పండగ చేసుకోనున్నారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pregnant Before Marriage: పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అయ్యా, అదే కలిసివచ్చింది.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Divorce: ఇద్దరు భార్యలకు విడాకులు.. ఏళ్ల తర్వాత అసలు కారణం చెప్పిన స్టార్ హీరో
Recommended image3
Epic Teaser: ఎపిక్ టీజర్ రివ్యూ, అన్న బాటలో తమ్ముడు.. వైష్ణవి చైతన్యతో లిప్ లాక్ తో రెచ్చిపోయిన ఆనంద్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved