MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కైకాల మరణం కలచివేస్తోంది.. మెగాస్టార్, పవర్ స్టార్, సూపర్ స్టార్ సంతాపం

కైకాల మరణం కలచివేస్తోంది.. మెగాస్టార్, పవర్ స్టార్, సూపర్ స్టార్ సంతాపం

కైకాల సత్యనారాయణ మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతికి గురయ్యింది.  టాలీవుడ్ స్టార్స్ ఒక్కొక్కరుగా కైకాలకునివాళి అర్పిస్తున్నారు. కొందరు ట్విట్టర్ ద్వారా తమ సంతాపాన్ని తెలుపుతున్నారు.. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 23 2022, 02:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డ, నవరస నటనా సార్వభౌముడు సత్యనారాయణగారి మృతి తనను కలచి వేస్తోందని అన్నారు మెగాస్టార్ చిరంజీవి.  కైకాలకునివాళి అర్పిస్తూ.. ఆయన ట్విట్టర్ లో ఓ నోట్ రిలీజ్ చేశారు. అంతే కాదు స్వయంగా కైకాల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఒకింత భావోద్వేగానికిలోనయ్యారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. కైకాల  ఆయన పోషించినటువంటి వైవిధ్యభరితమైన పాత్రలను భారతదేశంలో మరెవరూ పోషించి ఉండరని చెప్పారు. ఆయనతో కలిసి తాను ఎన్నో చిత్రాలలో నటించానని, ఆ సందర్భంగా ఆయన వ్యక్తిత్వాన్ని దగ్గర నుంచి పరిశీలించే అవకాశం తనకు కలిగిందని అన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

 డైలాగ్ డెలివరీలో ఆయనది ఒక ప్రత్యేకమైన పంథా అని చెప్పారు మెగాస్టార్ చిరంజివి. స్వచ్ఛమైన స్పటికంలాంటి వ్యక్తి అని, నిష్కల్మషమైన మనసున్న మనిషని కొనియాడారు. తనను తమ్ముడూ అంటూ తోడబుట్టినవాడిలా ఆదరించారని చెప్పారు. తమ మధ్య ఆత్మీయతానుగారాలు అంతకంతకూ బలపడుతూ వచ్చాయని అన్నారు. ఆయనతో తనకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పారు. 
 

35

నటనతో పాటు రుచికరమైన భోజనం అన్నా సత్యనారాయణగారికి చాలా ఇష్టమని చిరంజీవి తెలిపారు. తన శ్రీమతి సురేఖ చేతి వంటలంటే ఎంతో ఇష్టపడేవారని చెప్పారు. ఈ ఏడాది ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేయడం తనకు మిగిలిన సంతృప్తి అని అన్నారు. ఆయన ఇంటికి వెళ్లిన సందర్భంగా 'అమ్మా సురేఖా, ఉప్పుచేప వండి పంపించు' అని అన్నారని... మీరు త్వరగా కోలుకోండి, ఉప్పు చేపతో మంచి భోజనం చేద్దామని తాము అన్నామని గుర్తు చేసుకున్నారు. ఆ క్షణాన ఆయన చిన్న పిల్లాడిలా ఎంతో సంబరపడిపోయారని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. 

45

ఇక మెగాస్టార్ వెళ్లిన సమయంలోనే పవర్ స్టార పవన్ కల్యాణ్ కూడా కైకాలకు నివాళి అర్పించడానికి ఆయన ఇంటికి వెళ్లారు. కైకాల మరణం బాధించిందన్నారు. చెన్నైలో ఉన్నటప్పటి నుంచి మా కుటుంబంతో ఆయన అతనుబంధం కొనసాగుతుందన్నారు. ఈమధ్యే కలిసి  ఆరోగ్యం గురించి అడిగానని. కాని ఇలా కైకాలను చూస్తాను అనుకోలేదంటూ పవన్ కల్యాణ్ అన్నారు. అంతే కాదు జనసేన తరపున సంతాప సందేశాన్ని కూడా రిలీజ్ చేశారు పవర్ స్టరా్.  

55

ఇక టాలీవుడ్ సూపర్ స్టార్  మహేశ్ బాబు కూడా ట్విట్టర్ ద్వారా కైకాలకు నివాళి అర్పించారు. ఆయన మరణంపై  స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. కైకాల సత్యనారాయణగారి మృతి కలచివేస్తోందని మహేశ్ అన్నారు. ఆయనతో కలిసి నటించినప్పటి ఎన్నో మధుర జ్ఞాపకాలు తనకు ఉన్నాయని చెప్పారు. ఆయన మృతి తీరని లోటు అని అన్నారు. సత్యనారాయణగారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు. కైకాల చివరగా మహేష్ బాబు మహర్షి సినిమాలో నటించారు. మురారి సినిమాల్ వీరి కాంబినేషన్ కు మంచి పేరు వచ్చింది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
దెబ్బ తిన్నాడు, మళ్ళీ లేచాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజయ్ దేవరకొండ రణబాలి.. మరో రెండు క్రేజీ అప్డేట్లు
Recommended image2
Panchali Panchabhartruka: క్విక్‌ గన్‌ మురుగన్‌గా రాజేంద్రప్రసాద్‌.. `పాంచాలి పంచభర్తృక`లో నటకిరీటి రచ్చ
Recommended image3
Pooja Hegde: బాలీవుడ్ కి వెళితే ఎవరైనా ఇలా మారిపోవలసిందేనా.. సోషల్ మీడియా మొత్తం పూజా హెగ్డే గురించే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved