- Home
- Entertainment
- డైరెక్టర్ మారుతి ఇంట శుభకార్యం, సందడి చేసిన మెగాస్టార్, అల్లు అర్జున్ ,నాని, శర్వానంద్..
డైరెక్టర్ మారుతి ఇంట శుభకార్యం, సందడి చేసిన మెగాస్టార్, అల్లు అర్జున్ ,నాని, శర్వానంద్..
డైరెక్టర్ మారుతి ఇంట సందడి చేశారు టాలీవుడ్ స్టార్ హీరోలు. మారుతి ఇంట్లో జరిగిన శుభకార్యంలో పాల్గొన్నారు స్టార్ హీరోలు.

చిన్న సినిమాలతో స్టార్ట్ చేసి.. స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు మారుతి. వరుస సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదిచుకున్న మారుతి ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయేప్రయత్నం చేస్తున్నాడు.
స్టార్ డైరెక్టర్ మారుతి కూతురు హియా హాఫ్ శారీ ఫంక్షన్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులంతా తరలి వచ్చారు. మారుతీతో అనుబంధం ఉన్న స్టార్స్ తో పాటు.. ఆయన సినిమా చేసిన హీరోలు కూడా సందడి చేశారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ ఫంక్షన్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా మెరిసిపోయారు మెగాస్టార్ చిరంజీవి మారుతి కూతురిని ఆశీర్వదించారు. మెగా ఫ్యామిలీతో మొదటి నుంచి మారుతికి ప్రత్యేక అనుబంధం ఉంది. త్వరలో చిరంజీవితో కూడా మారుతి సినిమా ఉంటుందన్న టాక్ కూడా ఉంది.
ఇక ఈ ఈవెంట్ లో సందడి చేశారు మరో స్టార్ హీరో అల్లు అర్జున్. అల్లు అర్జున్ తో మారుతి సినిమా చేయకపోయినా.. ఇండస్ట్రీలోకి రాకముందే వీరిద్దరు మంచి మిత్రులు కావడంతో..మారుతి కూతురు ఫంక్షన్ లో బన్నీ సందడి చేశాడు.
ఇక మరో టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కూడా ఈ శుభకార్యంలో పాల్గొన్నారు. మారుతి కూతురిని ఆశీర్వదించారు. శర్వాతో కలిసి మహానుబావుడు సినిమా చేశారు మారుతి.
ఇక నేచురల్ స్టార్ నానీ ఈ ఫంక్షన్ లో స్పెషల్ అడ్రాక్షన్ గా నిలిచారు నేచురల్ స్టార్ నాని. వీరిద్దరి కాంబోలో భలేభలే మగాడివోయ్ సూపర్ హిట్ అతయ్యింది. ఈ కార్యక్రమానికి హాజరై మారుతి కూతురిని ఆశీర్వదించారు నాని. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
డైరెక్టర్ మారుతి.. ఈరోజుల్లో సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. 60 లక్షల బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమా సూపర్ హిట్ అయ్యి 15 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
ఆతరువాత బస్ స్టాప్, కొత్త జంట లాంటి వరుస సినిమాలతో టాలీవుడ్ లో పాతుకుపోయాడు మారుతి. వరుస సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. అటు తర్వాత భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతిరోజు పండగే లాంటి హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఎప్పటికప్పుడు తన ఇమేజ్ ను కాపాడుకుంటు.. పెంచుకుంటూ వస్తున్నాడు మారుతి..ప్రస్తుతం ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఓ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం అది చిత్రీకరణ దశలో ఉంది. ఇది కనుక హిట్ అయితే వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాన్ని దక్కించుకుంటాడు మారుతి. ఇదిలా ఉండగా.. తాజాగా