- Home
- Entertainment
- Chiranjeevi Acharya: ఆచార్యకు రన్ టైమ్ గుబులు... తలపట్టుకున్న చిరు, కొరటాల చివరికి రాధేశ్యామ్ లా కాదుకదా...?
Chiranjeevi Acharya: ఆచార్యకు రన్ టైమ్ గుబులు... తలపట్టుకున్న చిరు, కొరటాల చివరికి రాధేశ్యామ్ లా కాదుకదా...?
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా టీమ్ కు ఇప్పుడు కొత్త గుబులు మొదలయ్యింది. రన్ టైమ్ విషయంలో ఆచార్య పరిస్థితి కూడా రాధేశ్యామ్ లా అవుతుందేమో అని భయపడుతున్నారు మెగా టీమ్. ఇంతకీ ఆ రన్ టైమ్ ప్రాబ్లమ్ ఏంటీ..?

మెగాస్టార్ చిరంజీవి,రామ్ చరణ్ కాంబినేషన్ లో కొరటాల శివ డైరెక్ట్ చేసిన సినిమా ఆచార్య. రామ్ చరణ్ తో పాటు నిరంజన్ రెడ్డి కలిసి నిర్మించిన ఈసినిమాలో చిరుకు జతగా కాజల్.. రామ్ చరణ్ జోడీగా పూజా హెగ్డే నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 29న రిలీజ్ చేయబోతున్నారు.
దేవాలయ భూముల విషయంలో అవినీతికి పాల్పడుతున్న అక్రమార్కులు భరతం పట్టే నక్సలైట్లుగా ఈ సినిమాలో చిరంజీవి -రామ్ చరణ్ నటించారు. ఈ లుక్స్ లో చిరు,చరణ్ ను చూసిన మెగా ఫ్యాన్స్ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.
ఇక వచ్చే నెలలో రిలీజ్ కాబోతున్న ఆచార్య సినిమాకు కొత్త గుబులు పట్టుకుంది. ఈ సినిమా రన్ టైమ్ విషయంలో రాధేశ్యామ్ లా అయిపోతుందేమో అనే భయం మెగా స్టార్, కొరటాల ను భయపెడుతున్నట్టు తెలుస్తోంది. ఏం చేయాలా అని వారిద్దరు తలపట్టుకుని ఆలోచిస్తున్నట్టు సమాచారం.
ఆచార్య సినిమా నిడివి 3 గంటలకి పైగా వచ్చిందట. 3 గంటల నిడివి ఓకేనా...? లేదా బోర్ అనిపిస్తుందా...? అనే విషయంలో చిరూ - కొరటాల తర్జనభర్జనలు పడుతున్నారని సమాచారం. ఒక వేళ రన్ టైమ్ ని ఓ పావుగంట తగ్గిస్తే.. సినిమా లైన్ ఏమైనా దెబ్బతింటుందా...? అసలు అది వర్కౌట్ అవుతుందా అని ఆలోచనలో పడ్డారట ఇద్దరూ..
రాధేశ్యామ్ విషయంలో ఇదే ప్రాబ్లమ్ వచ్చింది. మూడు గంటలకు పైగా వచ్చిన సినిమాలో 20 నిమిషాల వరకూ కట్ చేశారు. దాంతో సినిమా అతుకులబొంతలా తయారయ్యింది. కొన్ని చోట్ల ఒక సీన్ కు మరొక సీన్ కు సంబంధం లేదు అన్నట్టుగా సినిమా గజిబిజిగా తయారయ్యింది. దాంతో రాధేశ్యామ్ కు ఇది పెద్ద మైనస్ అయ్యింది.
ప్రస్తుతం రాధేశ్యామ్ పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే.. ఇక ఈసినిమా లాగే ఆచార్య కూడా రన్ టైమ్ తగ్గిస్తే.. సోల్ దెబ్బతింటుందేమో అని భయపడుతున్నాడట కొరటాల. ఇదే విషయంలో మెగాస్టార్ తో కలిసి సమాలోచనలు జరుపుతున్నట్టు సమాచారం.
ఆచార్య ఓ పావుగంట నిడివిని తగ్గిస్తే ఎలా ఉంటుందా అనే విషయం ఇద్దరి మధ్య నలుగుతోందని సమాచారం త్వరలోనే ఈ విషయంలో ఒక నిర్ణయానికి రానున్నారని తెలుస్తోంది. రిలీజ్ కు ఇంకా నెలన్నర టైమ్ మాత్రమే ఉంది. ప్రమోషన్లు స్టార్ట్ చేయాల్సిన టైమ్ దగ్గర పడింది. ఈలోపే పని కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట.
మరి ఆచార్య విషయంలో మెగాస్టార్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మూడు గంటల సినిమా బోర్ కొడుతుందని కట్ చేస్తే.. ఆచార్యాకు రాధేశ్యామ్ లా దెబ్బతింటే పరిస్థితి ఏంటీ.. ? ఇప్పుడు ఇదే సమస్య చిరు కొరటాలకు నిద్రలేకుండా చేస్తుంది.
ఇక మణిశర్మ సంగీతాన్ని సమకూర్చిన ఆచార్య సినిమాలో సోనూసూద్ .. సంగీత,పోసాని, వెన్నెల కిశోర్ లాంటి స్టార్స్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఇక ఈసినిమాలో రెజీనా స్పెషల్ సాంగ్ లో చిరుతో చిందులేసింది. మెగా ఫ్యాన్స్ ఈసినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.