- Home
- Entertainment
- అసలేమనుకుంటున్నావ్ చిరంజీవి సినిమా అంటే.. ఆయన భార్య ఒప్పుకున్న తర్వాత ఓకే చేసిన సీన్ ఏంటో తెలుసా
అసలేమనుకుంటున్నావ్ చిరంజీవి సినిమా అంటే.. ఆయన భార్య ఒప్పుకున్న తర్వాత ఓకే చేసిన సీన్ ఏంటో తెలుసా
చిరంజీవి సినిమా విషయంలో నిర్మాత అశ్విని దత్ ఓ రచయితకి కండిషన్స్ పెట్టారట. ఆయనతో జరిగిన ఆర్గుమెంట్ ని ఆ రచయిత బయటపెట్టారు. ఇంతకీ ఎవరు ఆ రచయిత అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

రచయిత చిన్ని కృష్ణ సినిమాలు
ప్రముఖ రచయిత చిన్ని కృష్ణ గురించి పరిచయం అవసరం లేదు. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కథలు అందించిన ఆయన స్టార్ రైటర్ గా గుర్తింపు పొందారు. నరసింహనాయుడు, ఇంద్ర, గంగోత్రి ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు చిన్ని కృష్ణ కథలు అందించారు. చిన్నికృష్ణ ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏమనుకుంటున్నావ్ చిరంజీవి సినిమా అంటే..
చిరంజీవి నా అభిమాన నటుడు. ఆయన చిత్రానికి కథ అందించే అవకాశం రావడంతో చాలా థ్రిల్ ఫీల్ అయ్యా. స్టోరీ డిస్కషన్ కోసం నిర్మాత అశ్విని దత్ తో కూర్చున్నప్పుడు మా మధ్య ఆసక్తికర ఆర్గుమెంట్ జరిగింది. రాయలసీమ నేపథ్యంలో నేను అశ్విని దత్ కి ఇంద్ర కథ చెప్పాను. కథ విన్న తర్వాత ఆయనకి అంతగా నచ్చలేదు.
రాయలసీమ బ్యాక్ డ్రాప్ ఏంటి, అక్కడ వర్షాలు పడకపోవడం ఏంటి, చిరంజీవి డ్యామ్ నిర్మించడం ఏంటి.. అసలేం అనుకుంటున్నావ్ నువ్వు చిరంజీవి సినిమా అంటే అని ప్రశ్నించారు. మా కాంబినేషన్లో జగదేకవీరుడు అతిలోకసుందరి, చూడాలని ఉంది ఇలాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి తెలుసా.. వాటిని దృష్టిలో పెట్టుకుని నువ్వు కథ రాయాలి అని అన్నారు.
నేను నమ్మిన కథని చెప్పి ఒప్పించా
వైజయంతి మూవీస్ బ్యానర్ అంటే చాలా కండిషన్స్ ఉంటాయి. అశ్విని దత్ అంత సులభంగా కథని అంగీకరించరు. అలాంటి బ్యానర్ లో నేను నమ్మిన కథని చెప్పి ఒప్పించి సినిమా తీయించాను అని చిన్ని కృష్ణ అన్నారు. ఇంద్ర మూవీ ఇండస్ట్రీ హిట్ మాత్రమే కాదు సౌత్ ఇండియా మొత్తం చాలా రికార్డులు నెలకొల్పింది అని చిన్ని కృష్ణ తెలిపారు.
ఆ సీన్ తొలగించాలి అన్నారు
ఈ మూవీలో 'మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా' అనే సన్నివేశం గురించి అందరికీ తెలుసు. ఆ సీన్ ని చిత్ర యూనిట్ మొత్తం ఎవ్వరూ ఒప్పుకోలేదు. ఆ సన్నివేశాన్ని తొలగించాలని అందరూ కోరారు. కానీ నేను మాత్రం ఆ సీన్ ఉండాల్సిందే అని పట్టుపట్టాను. అశ్విని దత్ భార్య కూడా కథలు వింటారు ఆమె ఒపీనియన్ చెబుతారు. ఈ సన్నివేశానికి సంబంధించి కూడా ఆమె ఒపీనియన్ తీసుకోవాలని అనుకున్నారు.
అశ్విని దత్ భార్యకి నచ్చిన సీన్ అది
స్క్రిప్ట్ చదివినప్పుడే ఈ ఒక్క సీన్ ని ఆమె అండర్లైన్ చేసి పెట్టి ఉంచారట. అంత బాగా ఈ సన్నివేశం తనకు నచ్చిందని.. సినిమాలో తప్పకుండా ఈ సీన్ ఉండాలని అశ్విని దత్ భార్య తెలిపారు. ఒక తల్లి తన బిడ్డని కోల్పోయినప్పుడు ఆ కష్టం తండ్రికి తెలిసేలా తులసి మొక్కని నాటే సన్నివేశం అది. అంతటి అద్భుతమైన సీన్ తప్పకుండా ఉండాలని ఆమె అన్నారు. ఆ విధంగా ఇంద్ర సినిమాకు సంబంధించి చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయని చివరికి అంతా తాను చెప్పినట్టే జరిగిందని చిన్ని కృష్ణ గుర్తు చేసుకున్నారు.

