- Home
- Entertainment
- సమంతకి ఇక నా వాయిస్ ఇవ్వలేనేమో.. షాకింగ్ విషయాలు పంచుకున్న చిన్మయి.. ఏం జరిగిందంటే?
సమంతకి ఇక నా వాయిస్ ఇవ్వలేనేమో.. షాకింగ్ విషయాలు పంచుకున్న చిన్మయి.. ఏం జరిగిందంటే?
సమంత వాయిస్ అందరికి గుర్తుండిపోతుంది. నస్కీ వాయిస్‌తో ఆమె చెప్పే డైలాగ్‌లు మంత్రముగ్దుల్ని చేస్తాయి. అందుకు కారణం డబ్బింగ్ ఆర్టిస్టు చిన్మయి. సమంతకి ఎన్నో సినిమాలకు డబ్బింగ్ చెబుతూ వస్తోన్న చిన్మయి తాజాగా షాకిచ్చే విషయాలను బయటపెట్టింది.

సమంత నటించిన తొలి చిత్రం `ఏం మాయ చేసావె`. ఇందులో ఆమె చెప్పే డైలాగులను ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. ఆమె పాత్రకి వాయిసే పెద్ద అసెట్. సమంతకి ఆ వాయిస్ ఇచ్చింది డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్ చిన్మయి కావడం విశేషం. ఆమె హీరో, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ భార్య అనే విషయం తెలిసిందే. `ఏం మాయ చేసావే` నుంచి ఇప్పటి వరకు సమంత పాత్రకి చిన్మయినే డబ్బింగ్ చెబుతుంది.
సమంత వాయిస్ తో చిన్మయి కూడా పాపులర్ అయ్యింది. తాజాగా చిన్మయి ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది. సమంతతో గ్యాప్‌కి సంబంధించిన విషయాలను కూడా వెల్లడించింది. ఆమె చెబుతూ, సమంత చాలా మంచి వ్యక్తి అని, తెలుగులో తనకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ వచ్చిందంటే అది సమంత వల్లే అని చెప్పింది. అయితే ఇప్పుడు సమంత తన పాత్రలకు తనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటుందని, అందుకు చాలా ఆనందంగా ఉందని, కానీ తాను సామ్‌కి డబ్బింగ్ చెప్పే దశ ముగింపుకి వచ్చిందని చెప్పి షాకిచ్చింది.
తాను డబ్బింగ్ చెప్పకపోయినా, కలిసినప్పుడు ఫోటోలు పంచుకోకపోయినంత మాత్రాన తాము విడిపోయినట్టు కాదని చెప్పింది. తన వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడం తనకు ఇష్టముండదని పేర్కొంది సమంత. తాము ఇద్దరం చాలా సార్లు కలుసుకున్నామని, డిన్నర్‌కి కూడా వెళ్లామని చెప్పడం వల్ల ఎవరికి లాభం అని పేర్కొంది చిన్మయి. అందుకే తామిద్దరం కలిసిన విషయాలు ఎవరికీ చెప్పనని చెప్పింది. చాలా వరకు ఇద్దరు ఇంట్లోనే కలుసుకుంటారట.
తన భర్త రాహుల్, సమంత ఇద్దరు మంచి స్నేహితులని, ఆమెని చూస్తుంటే తనకు ఎంతో గర్వంగా ఉందని, వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ మంచి పేరు సొంతం చేసుకుందని, ఎంతో మంది పిల్లలకు ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా సాయం చేస్తుందని వెల్లడిచింది. మనుషుల గురించి చెబుతూ, వారికి సాయం కావాల్సి వస్తే `మీరు దేవత` అని పొగుడుతారని, అదే ఏదైనా అంశంపై మాట్లాడితే మీరు ఫెమినిస్ట్ అంటూ తిడతారని పేర్కొంది.
chinmayi
ఈ సందర్భంగా సమంత విషయాన్ని ప్రస్తావిస్తూ, `ఫ్యామిలీ మ్యాన్ 2` సమయంలో సామ్‌ని చాలా మంది విమర్శించడం తనకు నచ్చలేదని, అందుకే ఆమెకి సపోర్ట్ చేస్తూ మాట్లాడినట్టు పేర్కొంది. సమంత పాత్ర మీకు నచ్చకపోతే మర్యాదపూర్వకంగా మీ అభిప్రాయాన్ని చెప్పాలని, అంతేకానీ నిందించాల్సిన అవసరం లేదని పేర్కొంది చిన్మయి.