MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: దీపను చంపేయడానికి ప్లాన్ వేసిన చారుశీల.. ఒకే ఇంట్లో సౌందర్య ఇంద్రుడు దంపతులు?

Karthika Deepam: దీపను చంపేయడానికి ప్లాన్ వేసిన చారుశీల.. ఒకే ఇంట్లో సౌందర్య ఇంద్రుడు దంపతులు?

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు డిసెంబర్ 24వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

4 Min read
Author : Navya G
| Updated : Dec 24 2022, 07:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈరోజు ఎపిసోడ్ లో శౌర్య ఆలోచిస్తూ మా అమ్మ నాన్నలు ఎందుకు హైదరాబాద్ వెళ్లడం లేదు ఒకవేళ వాళ్ళు ఉంటే నానమ్మ వాళ్ళ దగ్గరే ఉండాలి కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ రాసి ఇచ్చిన స్లిప్పు చూసి దీన్ని చూస్తే అమ్మానాన్నలు బతికే ఉన్నారని అనిపిస్తుంది. బాబాయ్ అన్నట్టుగా నేను అన్నాను కాబట్టి చారుశీల మేడం ఇలా రాసిచ్చిందా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోని చంద్రమ్మ వచ్చి మాట్లాడించగా సౌర్య డల్ గా మాట్లాడడంతో ఏమైంది బంగారు ఏమి ఆలోచిస్తున్నావు అని అడగగా పిన్ని అందరూ అనుకున్నట్టుగా అమ్మానాన్నలు లేరా అనడంతో ఉన్న వాళ్ళని లేరు అని చెబితే అంతకంటే పాపం మరొకటి లేదు అనుకుంటూ ఉంటుంది చంద్రమ్మ.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

అప్పుడు ఏం పిన్ని మాట్లాడవు అనడంతో నువ్వు ఉన్నావని నమ్ముతున్నావు అదే నమ్మకంతో ఉండు ఎప్పటికైనా కనిపిస్తారు అని అంటుంది చంద్రమ్మ. ఇంతలోని ఇంద్రుడు అక్కడికి రావడంతో బాబాయ్ హాస్పిటల్ కి వెళ్దాం పద అనగా ఎందుకమ్మా అనడంతో అదేంటి బాబాయ్ ఈ స్లిప్పు రాసిచ్చారు కదా ఒకవేళ మా నాన్నని రాసి ఆ మేడంకి ఇచ్చి వెళ్ళారేమో అని అంటుంది సౌర్య. అప్పుడు ఇంద్రుడు రేపు వెళ్దాం లే బంగారం అనడంతో ఇప్పుడే వెళ్లాలి బాబాయ్ అని అంటుంది. అప్పుడు చంద్రమ్మతో ఒక గ్లాస్ బియ్యం ఎక్కువగా పెట్టు మా నాన్న కనిపిస్తే ఇంటికి తీసుకొని వస్తాను అని అంటుంది శౌర్య. అప్పుడు ఇంద్రుడు ఏం చెప్పాలో అర్థం కాక ఆకలిగా ఉంది తిన్న తర్వాత వెళ్దాం అని చెబుతాడు.
 

38

మరొకవైపు చారుశీల జరిగిన విషయాలు తలచుకొని ఆలోచిస్తూ ఉంటుంది. సీన్ ఇలా రివర్స్ అయ్యిందేంటి కార్తీక్ ఇలా ఎందుకు అబద్ధం చెప్పాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏదో ఒకటి చేయాలి అని చారుశీల ఆలోచిస్తూ ఉంటుంది. మరొకవైపు సౌందర్య వాళ్ళు వస్తూ ఉండగా అప్పుడు సౌందర్య ఈ ఊరికి అసలు నా జీవితంలో వస్తానని అనుకోలేదు అంజి. ఎక్కడో ముంబై ఢిల్లీ ఆ ప్రదేశంలో తిరిగే నేను ఈ విధంగా ఈ పల్లెటూర్లలో వెతుకుతున్నాను అంటే దేవుడు నాకు అంతా మంచే చేస్తాడని నాకనిపిస్తోంది అంటుంది సౌందర్య. మరొకవైపు చారుశీల దీప చనిపోబోతోంది అన్న అబద్ధం చెప్పి శాశ్వతంగా చంపేద్దామనుకుంటే ఇప్పుడు అవకాశం లేకుండా చేశాడు కార్తీక్ అని అనుకుంటూ ఉంటుంది చారుశీల.
 

48

కాబట్టి ఆ ప్రాణం తీసే పనేదో నేనే చేయాలి ఎవరికీ అనుమానం రాకుండా పని పూర్తి చేయాలి అని అనుకుంటూ ఉంటుంది చారుశీల. ఇంతలోనే పండరి అక్కడికి రావడంతో రా పండరి నీ కోసమే ఎదురు చూస్తున్నాను అని అంటుంది. అప్పుడు ఏమీ తెలియని దానిలా ఆ దీప ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతుంది. అప్పుడు పండరి దీపమ్మ ప్రతిక్షణం ఏడుస్తూ కుమిలిపోతూనే ఉంది అని అంటుంది. ఇప్పుడు చారుశీల అబద్ధం చెబుతూ ఈరోజే దీప కూడా సంబంధించిన రిపోర్ట్స్ వచ్చాయి దీప ఆరోగ్యం కూడా అంతకంతకు క్షీణిస్తోంది అని అంటుంది. దీపమ్మ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందా అనడంతో మందులు వాడితే సరిపోతుంది అని అంటుంది.
 

58

ఆ మందులు ఇవ్వండమ్మా అనడంతో ఎలా ఇవ్వాలో అర్థం కాక నిన్ను రమ్మని చెప్పాను అని అంటుంది. కార్తీక్ సార్ కి చెప్పి ఆరోగ్యం బాగోలేదని చెప్పి ఇప్పించండి అని అనడంతో కార్తీక్ కి ఈ విషయం తెలియదు అన్నది అని అంటుంది. అప్పుడు ఎన్నో అబద్ధాలు ఆడి తన చేతిలో ఉన్న టాబ్లెట్స్ పండరీకి ఇచ్చి క్రమం తప్పకుండా ఈ టాబ్లెట్స్ ని వాడమని చెప్పు అని అంటుంది. రోజుకు మూడు పూటలా ఇవ్వాలి అంటూ దీపను చంపే ప్లాన్ వేస్తుంది చారుశీల.  మరొకవైపు సౌందర్య వాళ్లు చంద్రుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు. అప్పుడు సౌర్య వాళ్ళని చూసి షాక్ అవుతుంది. అప్పుడు సూర్య తనని తీసుకెళ్లడానికి వచ్చారు అనుకొని నేను రాను రానమ్మ అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు నేను తీసుకెళ్లడానికి వచ్చానా అని మీకు చెప్పానా అని అంటుంది సౌందర్య.
 

68

అప్పుడు ఆనందరావు నువ్వు రాలేదని చెప్పి మీ నానమ్మ ఇక్కడ ఉంది మనమందరం కలిసి ఇక్కడే ఉండబోతున్నాము అనడంతో ఇంద్రుడు టెన్షన్ పడుతూ ఇక్కడేనా అని అంటాడు. నువ్వే చెప్పావు కదా ఇంద్రుడు ఇక్కడే ఉండమని అందుకే వచ్చేసాను అని అంటుంది. అప్పుడు సౌందర్య వచ్చినందుకు శౌర్య ఆనందపడుతూ ఉంటుంది. ఆ తర్వాత అందరూ కలిసి లోపలికి వెళ్తారు. అప్పుడు సౌర్య హీమ పైన సీరియస్ అయ్యి నాతో మాట్లాడాలని ప్రయత్నించకు అని అంటుంది. మరొకవైపు ఇంద్రుడు కార్తీక్ కి ఫోన్ చేయాలి అని చూస్తుండగా చంద్రమ్మ పిలవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు దీప జరిగిన విషయాలు తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది.
 

78

అప్పుడు కార్తీక్ దీపను చూసి బాధపడుతూ నన్ను క్షమించు దీపనీకి అబద్ధం చెప్పాను అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు కార్తీక్ ఎంత నచ్చచెప్పడానికి ప్రయత్నించినా దీప మాత్రం కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు దీప మనం వాళ్ల దగ్గరికి వెళ్లి లేము కనీసం దూరం నుంచి అయినా చూస్తాను డాక్టర్ బాబు ప్లీజ్ నన్ను తీసుకెళ్లండి అని ప్రాధేయపడడంతో సరే అని అంటాడు కార్తీక్. నిజంగానే తీసుకెళ్తారు కదా అనగా అవును అని అంటాడు కార్తీక్. అప్పుడు దీప బయలుదేరడానికి వెళుతుండగా పగటిపూట వద్దు సౌర్య మనల్ని చూస్తుంది. రాత్రి సమయంలో అయితే బాగుంటుంది ఈ రోజు రాత్రికి తీసుకెళ్తాను అని అంటాడు కార్తీక్. 

88

మరొకవైపు పండరీ చారుశీల ఇచ్చిన టాబ్లెట్స్ గురించి తెలియక దీపకు కాఫీలు కలిపి ఇస్తుంది. అప్పుడు కాఫీ తీసుకో దీపమ్మ అల్లంతో నాకేం తినాలని తాగాలని లేదు పండరి మా ఆయనకు అలా అవుతుంది అంటే ఎలా తినాలి ఎలా ఉండాలి పండరి అని అంటుంది. అప్పుడు పండరి దీపకి నచ్చ చెబుతూ ఉంటుంది. అప్పుడు దీప కాఫీ టేస్ట్ వేరేగా ఉంది ఏమయింది అనడంతో అదేం లేదు దీపమ్మ కాఫీ పొడి మార్చాను అని అంటుంది. మరొకవైపు హేమచంద్ర వాళ్ళ ఇంటికి సమీపంలో సౌందర్య వాళ్ళు కొత్త ఇంటికి వస్తారు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
దెబ్బ తిన్నాడు, మళ్ళీ లేచాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజయ్ దేవరకొండ రణబాలి.. మరో రెండు క్రేజీ అప్డేట్లు
Recommended image2
Panchali Panchabhartruka: క్విక్‌ గన్‌ మురుగన్‌గా రాజేంద్రప్రసాద్‌.. `పాంచాలి పంచభర్తృక`లో నటకిరీటి రచ్చ
Recommended image3
Pooja Hegde: బాలీవుడ్ కి వెళితే ఎవరైనా ఇలా మారిపోవలసిందేనా.. సోషల్ మీడియా మొత్తం పూజా హెగ్డే గురించే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved