- Home
- Entertainment
- Karthika Deepam: కార్తీక్ దీపలను విడగొట్టడానికి ప్రయత్నిస్తున్న చారుశీల.. దీపని మోసం చేస్తున్న కార్తీక్?
Karthika Deepam: కార్తీక్ దీపలను విడగొట్టడానికి ప్రయత్నిస్తున్న చారుశీల.. దీపని మోసం చేస్తున్న కార్తీక్?
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు డిసెంబర్ 21వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈ రోజు ఎపిసోడ్ లో సౌందర్య సరే అవన్నీ వదిలేసి నాతోపాటు రా అని తీసుకెళ్తుండగా నేను రాను అని అంటుంది శౌర్య. ఎందుకు రావు అని అనడంతో అమ్మ నాన్న నేను చంపిన అహిమా ఉన్న చోటికి నేను రాను అనడంతో మన కర్మకి అలా జరిగితే దానిని ఎందుకు అంటావే అయినా అమ్మానాన్నలు బతికే ఉన్నారని అంటున్నావు కదా మరి ఇంకా ఎందుకు దాని మీద కోపం అని అంటుంది సౌందర్య. అమ్మ నాన్నలు చనిపోవడానికి ఆ హిమనే కారణం ఇప్పటికీ ఇంకా అమ్మ నానలను వెతకడానికి కారణం ఆ హిమ అని అంటుంది సౌర్య. అయినా అమ్మ నాన్న దొరికినా కూడా నేను ఆహిమను క్షమించను అని అనగా ఎన్నాళ్ళని ఇలాగే మాట్లాడుతావు అని సౌందర్య నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తుంది.
అప్పుడు సౌందర్య మీ అమ్మానాన్నలు లేరు శౌర్య ఆ ఆక్సిడెంట్ లో చనిపోయారు అనడంతో వెంటనే ఇంద్రుడు అలా అనకండి అమ్మ ఏదో ఒక చోట బతికే ఉంటారు అని కవర్ చేసుకుంటాడు. అప్పుడు చారుశీల మీరు కూడా వాళ్లు బతికే ఉన్నారన్న నమ్మకంతో వెతుకుతున్నారు కదా ఆంటీ అని అడగగా అవునమ్మా ఆ నమ్మకాలు ఆశలు మనుషుల్ని దగ్గర చేయాలి కానీ ఇలా దూరం చేయకూడదు కదా అని బాధపడుతుంది సౌందర్య. అప్పుడు సౌందర్య, సౌర్య ని బలవంతంగా తీసుకెళ్తుండగా ఇంద్రుడు సౌందర్య కాళ్ల మీద పడి సౌర్యను తీసుకెళ్లొద్దు అని చెబుతాడు. అప్పుడు సౌందర్య చేసేదేమీ లేక సరే అని అంటుంది. మరొకవైపు దీప వాళ్ళ డాక్టర్ అన్నయ్య దగ్గరికి రిపోర్ట్స్ తీసుకొని వెళ్తుంది.
దీప ఆ రిపోర్ట్స్ చూపించడంతో నీకు గుండె ఆపరేషన్ అయింది కదా అందుకు సంబంధించిన మెడిసిన్స్ ఇవి అని చెప్పగా నిజమే చెప్పండి అన్నయ్య నా దగ్గర దాచొద్దు నా ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు కదా అని అనగా వెంటనే అతను ఇంతమంది డాక్టర్స్ ఉండగా నీ ప్రాణాలకు ప్రమాదం తెప్పిస్తామా అని అంటాడు. ఎందుకు నువ్వు అలా ఆలోచిస్తున్నావు దీప అని అనగా ఆయన ప్రవర్తన నన్ను ఆలోచించేలా చేస్తుంది అన్నయ్య. నన్ను ఏ పని చి అని ఇవ్వడం లేదు అనడంతో వెంటనే అతను బావగారికి నీ మీద ఉన్న ప్రేమ దాన్నే నువ్వు అనుమానిస్తున్నావు అని అంటాడు. అప్పుడు అతను దీప కి నచ్చ చెబుతాడు. మరొకవైపు కార్తీక్ దీప కోసం వెతుకుతుండగా ఇంతలో పండరీ వచ్చి దీపమ్మ గుడికి వెళ్ళింది అని చెప్పడంతో కార్తీక్ టెన్షన్ పడుతూ ఉంటాడు.
అప్పుడు సరే పండరి నాకు కొంచెం పని ఉంది నేను వెళ్తున్నాను నువ్వు వెళ్లి దీపని ఇంటికి తీసుకొని రా పో అని అనగా వెంటనే పండరి దీపమ్మ పాపని వెతకడం నీకు ఇష్టం లేదా అనగా ఏం మాట్లాడుతున్నావు అనడంతో అదే సారూ దీపమ్మకి పాపని చూపించడం మీకు ఇష్టం లేదని అనుకుంటున్నాను అనగా దీపకి హెల్త్ బాగోలేదు కాబట్టి నేను అలా మాట్లాడుతున్నాను పండరి అని అనగా ఆ వ్యాధి కంటే ఈ మనో వ్యాధి చాలా ప్రమాదం సారు ఆ విషయం నాకంటే మీకే బాగా తెలుసు అని అంటుంది. అప్పుడు పండరీ కార్తీక్ ప్రవర్తిస్తున్న తీరుని అనుమానిస్తూ నిలదీస్తుంది. ఆరోజు ఇంద్రుడు వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవడానికి కారణం కూడా మీరే అని నాకు అనుమానం వచ్చింది అని అంటుంది పండరి.
అప్పుడు కార్తీక్ వంట గురించి మాట్లాడడంతో నేనే ఏం మాట్లాడుతున్నాను మీరే మాట్లాడుతున్నారు సారు అని అడగగా ఆమె వ్యక్తిగత విషయాలు అడగడంతో పండరి మౌనంగా ఉంటుంది. మరొకవైపు చారుశీల ఇంకొక ఆమె దీప రిపోర్ట్స్ గురించి వాదించుకుంటూ ఉంటారు. అప్పుడు చారుశీల తన నిజస్వరూపాన్ని బయటపెడుతుంది. నేను ఆ మోనిత మనిషిని మోనిత కోసమే ఇదంతా చేస్తున్నాను కార్తిక్ దీపని విడగొట్టడమే నా ప్లాను అని అంటుంది చారుశీల. అందుకే ఈ రిపోర్ట్స్ మార్చి దీపని కార్తీక్ ని దూరం చేయాలని చూస్తున్నాను అని అంటుంది. మరొకవైపు కార్తీక్ ఇంద్రుడు కోసం హోటల్లో ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలోనే దీప కార్తీక్ ఉన్న హోటల్ దగ్గరికి వస్తుంది. అప్పుడు కార్తీక్ దీప దగ్గరికి వెళ్లి ఎక్కడికి వెళ్లావు దీప ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు.
నేను హేమచంద్ర అన్న దగ్గరికి వెళ్లాను చిల్లర కోసం ఇక్కడికి వచ్చాను అని అంటుంది దీప. రిపోర్ట్స్ అన్నయ్యకు చూపించాను నాకు అంత ప్రమాదం లేదని తెలిసింది అని అంటుంది దీప. అప్పుడు కార్తీక్ ఇంద్రుడు ఇక్కడికి వచ్చేస్తాడు ఇంతలోనే దీపని పంపించాలి అని దీపని అక్కడినుంచి వెళ్ళమని చెబుతుండగా ఇంతలో ఇంద్రుడు అక్కడికి రావడంతో పక్కకు వెళ్లిపోమని సైగా చేస్తాడు. అప్పుడు దీప ఇంద్రుడిని చూసి డాక్టర్ బాబు ఆ ఇంద్రుడు వచ్చాడు అనడంతో లేదు దీప అనగా లేదు డాక్టర్ బాబు వెళ్తున్నాడు అని దీప, కార్తీక్ ఇద్దరు ఆ ఇంద్రుడిని ఫాలో అవుతూ వెళ్తారు. అప్పుడు ఇంద్రుడిని ఫాలో అవుతూ ఎలా అయినా పట్టుకోవాలి అనుకుంటూ ఉంటారు. అప్పుడు ఇంద్రుడు తప్పించుకొని పోవడంతో దీప బాధపడుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ మాత్రం హమ్మయ్య అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత దీపని ఇంటికి వెళ్ళమని నచ్చచెబుతాడు.