చిరు కంటే నా రెమ్యునరేషన్ 5 రెట్లు ఎక్కువ.. అంతా మార్చేసింది అల్లు అరవిందే, చంద్రమోహన్ ఏం చెప్పారంటే
చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో చంద్రమోహన్ చిరంజీవితో కలసి ప్రాణం ఖరీదు, తాయారమ్మ బంగారయ్య లాంటి చిత్రాల్లో నటించారు. అప్పటి అనుభవాలని చంద్రమోహన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
సీనియర్ నటుడు చంద్రమోహన్ నేడు తుదిశ్వాస విడిచారు. దీనితో చిత్ర పరిశ్రమలో విషాదం అలుముకుంది. 900 పైగా చిత్రాల్లో నటించిన అనుభవం ఆయనది. హీరోగా, క్యారెక్టర్ ఆరిస్ట్ గా, కమెడియన్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో రాణించారు. కొంతకాలంగా చంద్రమోహన్ హృదయ సంబంధించిన సమస్యలతో భాదపడుతున్నారు.
నేడు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీనితో తెలుగు రాష్ట్రాల్లో సినీ రాజకీయ ప్రముఖులంతా చంద్రమోహన్ మృతికి సంతాపం తెలుపుతున్నారు. చంద్రమోహన్ మరణించడంతో ఆయన కెరీర్ ని, గతంలో చెప్పిన విషయాలని అభిమనులు నెమరు వేసుకుంటున్నారు. చంద్రమోహన్ తో నటించిన శ్రీదేవి, జయసుధ, భానుప్రియ లాంటి హీరోయిన్లతా స్టార్స్ గా మారారు. హీరోయిన్ల విషయంలో చంద్రమోహన్ ని లక్కీ యాక్టర్ అంటుంటారు.
ఇక మెగాస్టార్ చిరంజీవితో చాలా చిత్రాల్లో చంద్రమోహన్ నటించారు. చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో చంద్రమోహన్ చిరంజీవితో కలసి ప్రాణం ఖరీదు, తాయారమ్మ బంగారయ్య లాంటి చిత్రాల్లో నటించారు. అప్పటి అనుభవాలని చంద్రమోహన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
అప్పటికి చిరంజీవి కంటే నేను చాలా సీనియర్. ప్రాణం ఖరీదు చిత్రానికి చిరంజీవికి 5 వేలు ఇస్తే నాకు 25 వేలు ఇచ్చారు. చిరు సిన్సియర్ గా ఉండేవాడు. రఫ్ నెస్ కనిపించేది. మంచి నటుడు కావాలనే తపన ఉండేది. అంతా చిరంజీవి డ్యాన్సులు చాలా బాగా చేస్తున్నాడు అనేవారు. ఆ రోజుల్లో ఏఎన్నార్ తర్వాత ఇండస్ట్రీలో డ్యాన్స్ చేసేది నేను ఒక్కడినే. చిరంజీవి వచ్చాక తనకంటూ ఓన్ స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు.
అయితే చిరంజీవి కెరీర్ విషయంలో చంద్రమోహన్ చేసిన వ్యాఖ్యలు గతంలో కాస్త వైరల్ అయ్యాయి. చిరంజీవిని నేను అర్జునుడిగా.. అల్లు అరవింద్ ని కృష్ణుడిగా పోలుస్తాం. సారధి లేకపోతే అర్జునుడు నథింగ్. అర్జునుడి కి సలహాలు ఇస్తూ నడిపించింది కృష్ణుడు. అలాగే చిరంజీవి విషయంలో కూడా అల్లు అరవింద్ బాగా ఉపయోగపడ్డారు.
ఎవరితో సినిమాలు చేయాలి, ఎంత రెన్యుమరేషన్ తీసుకోవాలి, ఏ బ్యానర్ కి సైన్ చేయాలి ఇలా చిరంజీవి విషయంలో నిర్ణయాలన్నీ డిసైడ్ చేసేది అల్లు అరవిందే. అదే చిరు కెరీర్ ని మార్చేసింది అని చంద్రమోహన్ అన్నారు. ఏది ఏదేమైనా చంద్రమోహన్ లాంటి గొప్ప ఆర్టిస్ట్ ని చిత్ర పరిశ్రమ కోల్పోయింది. చంద్రమోహన్ 1943 మే 23న కృష్ణాజిల్లా పమిడిముక్కలలో జన్మించారు. చంద్రమోహన్ కి ఇద్దరు కుమార్తెలు సంతానం.