నేషనల్ అవార్డు గెలిచిన సంతోషం.. 'కార్తికేయ 3' అప్డేట్ ఇచ్చేశారు
శుక్రవారం రోజు 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన జరిగింది. పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయం సాధించిన కార్తికేయ 2 చిత్రాన్ని ఉత్తమ తెలుగు భాషా చిత్రంగా ప్రకటించారు.
నిఖిల్ సిద్దార్థ్ నటించిన కార్తికేయ 2 ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. శుక్రవారం రోజు 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన జరిగింది. పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయం సాధించిన కార్తికేయ 2 చిత్రాన్ని ఉత్తమ తెలుగు భాషా చిత్రంగా ప్రకటించారు.
దీనితో కార్తికేయ 2 చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశానికి డైరెక్టర్ చందూ ముండేటి, నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, టిజి విశ్వప్రసాద్ హాజరయ్యారు.
కార్తికేయ 2 చిత్రానికి జాతీయ అవార్డు వస్తుందని ఊహించలేదని.. ఆ కృష్ణుడే తమని జాతీయ అవార్డు వైపు నడింపించారని తెలిపారు. ఈ సందర్భంగా కార్తికేయ 3 అప్డేట్ ఇచ్చారు. కార్తికేయ 3 చిత్ర కథ రాస్తున్నా. తండేల్ చిత్రం పూర్తయ్యాక కార్తికేయ 3 కోసం సమయం కేటాయిస్తా.
నాతోపాటు, నిర్మాతలు, హీరో నిఖిల్ అంతా కథపై ఏకాభిప్రాయానికి వచ్చాక కార్తికేయ 3 ప్రారంభం అవుతుందని చందూ ముండేటి తెలిపారు. కార్తికేయ 3 పై ఉన్న అంచనాలకి తగ్గట్లుగానే అద్భుతమైన కథని రెడీ చేస్తానని చందూ ముండేటి అన్నారు.