- Home
- Entertainment
- Guppedantha Manasu: కూతురు ప్రవర్తనకి కంగారుపడుతున్న చక్రపాణి.. పెళ్ళెప్పుడంటూ రిషికి షాకిచ్చిన వసు?
Guppedantha Manasu: కూతురు ప్రవర్తనకి కంగారుపడుతున్న చక్రపాణి.. పెళ్ళెప్పుడంటూ రిషికి షాకిచ్చిన వసు?
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. తను ప్రేమించిన వాడు దూరమైపోతాడేమో అని కంగారు పడుతున్న ఒక ప్రేమికురాలి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఆగస్టు 21 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో మీరు వసమ్మని దూరం పెట్టిన దగ్గరనుంచి తను అలాగే ఉంది. ఈరోజు మీ జ్ఞాపకాలు ఏమైనా గుర్తొచ్చాయేమో.. అయినా మీరు తనని దూరం పెట్టడంలో తప్పులేదు. తను మిమ్మల్ని అంతగా గాయపరిచింది అంటాడు చక్రపాణి. మీరు నా బాధ కూడా అర్థం చేసుకోండి ఇక ఈ టాపిక్ వదిలేయండి అని వెళ్ళిపోతుంటాడు రిషి.
అప్పుడు ఏంజెల్ ఇంటికి వచ్చిన విషయం గుర్తొస్తుంది చక్రపాణికి. అదే విషయం రిషికి చెప్తాడు. ఏంజెల్ ఏం మాట్లాడి ఉంటుంది అని ఆలోచనలో పడతాడు రిషి. ఆ తర్వాత ఏంజెల్ దగ్గరికి వచ్చి నువ్వు వసుధార మేడం ని కలిసావా అని అడుగుతాడు రిషి. జరిగిందంతా రిషికి చెప్పేసిందేమో అని కంగారుపడుతుంది ఏంజెల్. ఎందుకు అలా అడుగుతున్నావు తను ఏమైనా చెప్పిందా అని అడుగుతుంది ఏంజెల్.
తెలియదు కాబట్టే నిన్ను అడుగుతున్నాను పొద్దుటి నుంచి తను చాలా మూడీగా ఉంది ఏం జరిగింది అని అడుగుతాడు. తను మూడిగా ఉంటే నన్ను అడుగుతావేంటి.. తనకి పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి కదా అంటుంది ఏంజెల్. అసలు నువ్వు తనతో ఏం మాట్లాడావు అని అడుగుతాడు రిషి. మేము, మేము ఆడవాళ్ళం. ఏవేవో మాట్లాడుకుంటాము అవన్నీ మీకు చెప్పలేము అంటూ టైం అవుతుందని రిషి ని భోజనానికి తీసుకువెళ్తుంది ఏంజెల్.
మరోవైపు ఏంజెల్ అన్నమాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటుంది వసుధార. ఇంతలో చక్రపాణి వచ్చి పొద్దున్న అల్లుడుగారు కలిశారు. నువ్వు ఎందుకు కంగారులో ఉన్నావు అని నన్ను అడిగారు అంటాడు. అయినా ఏమీ స్పందించదు వసుధార. మళ్లీ గట్టిగా పిలిచి జరిగిందంతా చెప్తాడు చక్రపాణి. ఏం చెప్పమంటావు నాన్న నా ప్రాణానికి ప్రాణమైన రిషి సార్ నాకు దూరమైపోతారేమో అని భయంగా ఉంది అని మనసులోనే బాధపడుతుంది వసుధార.
కూతురి కళ్ళల్లో నీళ్లు చూసి కంగారు పడిపోతాడు చక్రపాణి. ఏం జరిగింది అంటూ ఆరాటంగా అడుగుతాడు. ఏం జరగలేదు నన్ను దయచేసి నన్ను ఏమీ అడగకండి అనటంతో పోనీలే భోజనం చేద్దాం రా అంటాడు చక్రపాణి. నాకు ఆకలిగా లేదు నువ్వు వెళ్లి భోజనం చేయి అని తండ్రికి చెప్పటంతో ఇంకేమి చేయలేక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు చక్రపాణి. కడుపునిండా బాధ ఉంటే తిండి ఎలా సహిస్తుంది. తాత్కాలికంగా మా మధ్యన వచ్చిన దూరాన్నే నేను భరించలేకపోతున్నాను.
అలాంటిది శాశ్వతంగా నా రిషి సార్ దూరమైతే నేను భరించలేను. భగవంతుడా.. నువ్వే మా ఇద్దరినీ కలపాలి అని భగవంతుణ్ణి కోరుకుంటుంది వసుధార.మరోవైపు భోజనాల దగ్గర కూర్చున్న రిషి వసుధార ఎందుకు అలా ఉంది.. ఎవరిని అడిగినా నిజం చెప్పటం లేదు తనకి ఏం జరిగిందో తెలుసుకోకపోతే నా మనసు ఉండబట్టడం లేదు అని అనుకుంటాడు. ఎందుకు అలా ఉన్నావ్ రిషి.. నువ్వు అలా ఉంటే నాకు కూడా బాధగా ఉంటుంది కదా అంటుంది ఏంజెల్.
అలాంటిదేమీ లేదు నాకు ఆకలిగా లేదు అని చెప్పి ఏంజెల్ ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి. పూర్వం ఋషులు ఇలాంటి ఒంటరితనాన్ని కోరుకునేవారు ఇప్పుడు మనుషుల మధ్య ఉన్న కూడా రిషి ఒంటరితనాన్ని కోరుకుంటున్నాడు అనుకుంటుంది ఏంజెల్. ఆ తర్వాత ఎందుకలా ఉన్నావు అంటూ మెసేజ్ పెడతాడు రిషి. ఏం లేదు సార్ ఇది కాలేజీ విషయం కాదు మీకు చెప్పుకోవటానికి.
అయినా మీకు నాకు ఏం సంబంధం లేదని చెప్పారు కదా మరి ఎలా షేర్ చేసుకుంటాను అంటుంది వసుధార. తోటి లెక్చరర్ గా మీకు ఏమైనా కష్టం వస్తే నేను సాల్వ్ చేస్తాను పర్వాలేదు చెప్పండి అంటాడు రిషి. మీ పెళ్లి ఎప్పుడు అని అడుగుతుంది వసుధార. ఒక్కసారిగా షాక్ అవుతాడు రిషి. అసలు నా గురించి ఏమనుకుంటుంది అంటూ వసుధారకి ఫోన్ చేస్తాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.