Guppedantha Manasu: వసుధార వల్ల కన్నీళ్లు పెట్టుకున్న చక్రపాణి.. చావుబతుకుల్లో జగతి, మహేంద్ర!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. కొడుక్కి మరొక అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయిందని తెలుసుకొని కంగారు పడుతున్న తల్లిదండ్రుల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు సెప్టెంబర్ 9 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో విశ్వనాథం ఫోన్ చేస్తే నాకు పని ఉంది అయ్యాక వస్తాను అంటాడు రిషి. సరే అని ఫోన్ పెట్టేస్తాడు విశ్వనాథం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి, నిజం చెప్పకుండా ఉండలేను. అలా అని చెప్తే విశ్వనాథం గారి గుండె ఆగిపోతుంది అంటూ బాగా స్ట్రెస్ ఫీల్ అవుతాడు రిషి. నిజం చెప్పకుండా పెళ్లి చేసుకోండి అంటుంది వసుధార. వసుధారని కోప్పడి అలా మాట్లాడి నాకు కోపం తెప్పించకండి. ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటూ కేకలు వేస్తాడు రిషి.
మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళను. మీరు వెళ్తే నేను వెళ్తాను అంటూ మొండికేస్తుంది వసుధార. సీన్ కట్ చేస్తే జగతి దంపతులు కార్ లో ప్రయాణం చేస్తూ వసుధారకి ఫోన్ చేస్తారు. మేం విన్నది నిజమేనా రిషి పెళ్లికి ఒప్పుకున్నాడా అని అడుగుతాడు మహేంద్ర. ఆయన పెళ్ళికి ఒప్పుకోలేదు కానీ ఒప్పుకున్నారు అనుకొని వాళ్ళు బ్రమపడిపోతున్నారు అంటూ బాధగా చెప్తుంది వసుధార. ఏమి కంగారు పడకు మేము వచ్చేస్తున్నాము ఎలాగైనా ఈ పెళ్లి ఆపేద్దాము.
కానీ మేము వస్తున్నట్టు రిషికి చెప్పకు, మళ్లీ మన అందరం కలిసి ఏదైనా ప్లాన్ చేశామనుకుంటాడు అంటాడు మహేంద్ర. సరే అని ఫోన్ పెట్టేస్తుంది వసుధార. మరోవైపు రౌడీతో మాట్లాడుతూ చెప్పింది చేసావు కదా అంటాడు శైలేంద్ర. చేశాను సార్, కారు బ్రేకులు అన్ని ఫెయిల్ చేసేసాను వాళ్లు ఇక పైకి పోవటం ఒకటే లేటు అంటాడు రౌడీ. రౌడీ చేతిలో డబ్బులు పెట్టి అదే జరిగితే మరో నాలుగింతలు డబ్బు ఇస్తాను అంటాడు శైలేంద్ర.
ఆ రౌడీ సంతోషంగా డబ్బు తీసుకొని సరే సర్ నేను వాళ్ళని ఫాలో అవుతాను అని చెప్పి వెళ్ళిపోతాడు. మరోవైపు తండ్రికి కాఫీ ఇస్తుంది వసుధార. నువ్వు అల్లుడుగారు ఇలా ఒకరి కోసం ఒకరు పరితపించపోతూ ఉంటే నాకు కాఫీలు టిఫిన్లు ఏం ఎక్కుతాయి. అల్లుడు గారిని చూస్తే నాకు చాలా బాధగా ఉంది. ఏ పాపము తెలియని ఆ మనిషికి ఎందుకు ఇన్ని కష్టాలు పరిస్థితుల ప్రభావం వలన మీరు చేసిన గాయం ఆయనని బాధపెడుతుంది. ఆయన పరాయి ఇంట్లో తలదాచుకోవలసి వస్తుంది. ఇప్పుడు మళ్లీ ఈ సమస్య వెంటాడుతుంది.
అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను అంటాడు చక్రపాణి. ఏంటని అడుగుతుంది వసుధార. విశ్వనాథం గారికి నేను వెళ్లి నిజం చెప్పేస్తాను. మీరిద్దరూ ఇలా బాధపడుతుంటే చూడలేను అంటూ అక్కడ నుంచి వెళ్ళబోతాడు చక్రపాణి. తండ్రిని ఆపి మీరు ఇలా చేస్తే అమ్మ మీద ఒట్టు. రిషి సార్ చెప్పకుండా మనం చెప్తే బాగోదు అంటూ తండ్రి కాళ్ళకి బంధం వేస్తుంది వసుధార. ఎంత పని చేసావు అంటూ భార్య ఫోటో దగ్గరికి వెళ్లి చూసావా వసమ్మ నన్ను ఎలా కట్టిపడేస్తుందో.
తండ్రిగా తనకోసం నేను ఏమి చేయకూడదా అంటూ బాధగా కన్నీరు పెట్టుకుంటాడు చక్రపాణి. మీరేమీ కంగారు పడకండి జగతి మేడం వాళ్ళు వస్తున్నారు. రిషి సార్ తల్లిదండ్రులుగా వాళ్ళు మా జీవితాన్ని చక్కబెడతారు. అంతవరకు మీరు ఆవేశపడకండి అని చెప్పటంతో శాంతిస్తాడు చక్రపాణి. మరోవైపు మహేంద్ర దంపతుల కారు బ్రేక్ ఫెయిల్ అయ్యి దంపతులు ఇద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతారు. అది చూసిన రౌడీ చనిపోయారు అనుకొని విషయం సార్ కి చెప్పాలి అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
కానీ మహేంద్ర దంపతులని అటుగా వస్తున్న కొంతమంది సేవ్ చేస్తారు. జగతి వసుధారకి ఫోన్ చేయమని చెప్పడంతో ఒక వ్యక్తి జగతికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు. కంగారుపడిన వసుధార రిషి కి ఫోన్ చేస్తుంది. కానీ అతను లిఫ్ట్ చేయడు. సార్ వస్తే జరిగింది చెప్పండి అని తండ్రికి చెప్పి తను జగతి వాళ్ళ దగ్గరికి బయలుదేరుతుంది వసుధార. మరోవైపు పిన్ని, బాబాయి చనిపోయారు అని ఆనందంగా తల్లికి చెప్తాడు శైలేంద్ర. నిజంగానే చనిపోయారా అంటుంది దేవయాని.వాళ్ళు చనిపోయారో, ఇంకేదైనా జరిగిందో మనకి అనవసరం.
కొద్దిరోజులు ఇక్కడికి రాకుండా ఉంటే చాలు. ఈలోపు మన పని మనం చక్కబట్టేసుకుందాం అంటాడు శైలేంద్ర. ఇప్పుడు నా కొడుకు వి అనిపించుకున్నావు అంటూ కొడుకుని మెచ్చుకుంటుంది దేవయాని. మరోవైపు ఏంజెల్ వాళ్ళు కంగారుపడుతూ రిషికి ఫోన్ చేస్తూ ఉంటారు. రిషి ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయడు. అప్పుడు ఏంజెల్ వసుధారకి ఫోన్ చేస్తుంది. అప్పటికే కంగారుగా జగతి వాళ్ళ దగ్గరికి వెళ్తున్న వసుధార తర్వాత కాల్ చేస్తాను అని చెప్పి మెసేజ్ పెడుతుంది. అసలు ఏం జరుగుతుంది అంటూ అయోమయానికి గురవుతారు ఏంజెల్, విశ్వనాథం. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.