- Home
- Entertainment
- Celebrities Praying Shiva : శివదర్శనం చేసుకున్న సెలబ్రెటీలు.. ఈ స్టార్స్ అంతా శివభక్తులే..
Celebrities Praying Shiva : శివదర్శనం చేసుకున్న సెలబ్రెటీలు.. ఈ స్టార్స్ అంతా శివభక్తులే..
మహా శివరాత్రి సందర్భంగా సెలబ్రెటీలు ఆ భోళా శంకురుడైన శివుడి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తితో శివాలయాలను సందర్శించారు. హీరోయిన్ ప్రణీత, మౌనీరాయ్ శివుడికి పూజలు చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు, తెలుగు ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.

మహా శివరాత్రి 2022 సందర్భంగా సెలబ్రెటీలు ఆ భోళా శంకురుడైన శివుడి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తితో శివాలయాలను సందర్శించారు. శివునికి అమితమైన భక్తులైన సెలబ్స్ తమ సమయాన్ని ఆయా ఆలయాల్లోనే గడిపేందుకు కేటాయించారు. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన ఫ్యాన్స్ కు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.
బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌటేలా (Urvashi Rautela) కూడా శివుడి సేవకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా కేదారినాథ్ లోని శివాలయాన్ని సందర్శించారు. పూర్తిగా శివభక్తురాలిగా వేషాధారణ మార్చుకొని భక్తిని చాటుకున్నారు. ‘త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్.. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్.. ఓం నమః శివా! అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీ జీవితంలో సానుకూల పరిస్థితులు ఏర్పడేలా.. పరమశివుని దివ్య శక్తులు ఎల్లప్పుడూ ఉంటాయి.. హరహర మహాదేవ్’అంటూ కోరుకుంది.
హీరోయిన్ ప్రణీత సుభాష్ (Pranitha Subhash) మహా శివరాత్రి సందర్భంగా శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. కర్ణాటకలోని ఖాద్రి మంజునాథస్వామి ఆలయంలో లింగాభిషేకం నిర్వహించింది. అనంతరరం శివుడి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని శివదర్వనం చేసుకుంది.
టాలీవుడ్ హాట్ బ్యూటీ.. సమంతా రూత్ ప్రభు (Samantha) కూడా శివునిపై బలమైన నమ్మకాన్ని కలిగి ఉంది. అలాగే శివుడికి భక్తురాలు. ఆమె శివారాధనతో పాటు.. ధ్యానం.. కూడా చేస్తుంది.
నటి జాన్వీ కపూర్ కూడా శివుడికి భక్తురాలు. గతేడాది కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించి, శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా కూడా శివుడి పూజల్లో పాల్గొన్నారు. ఇక బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా శివుడి భక్తురాలే. కంగనా తరచుగా ఉజ్జయినిలోని మహాకాళ ఆలయాన్ని సందర్శిస్తుంది, అక్కడ ఆమె ప్రతిరోజూ తెల్లవారుజామున 4 గంటలకు జరిగే భస్మ ఆరతికి కూడా హాజరవుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం, కంగనా ఉజ్జయినిలోని మంగళనాథ్ ఆలయంలో భాట్ పూజ చేసింది.
అలాగే నాగిని ఫేమ్ మౌనీ రాయ్ (Mouni Roy) కూడా ఈ రోజు శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరులో గల ఆదియోగి విగ్రహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మహాశివుడికి ప్రత్యేక పూజలు చేసి, శివదర్శనం చేసుకుంది. అలాగే అభిమానులు, ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపింది.
సంజయ్ దత్ కు శివునిపై అపారమైన భక్తి, నమ్మకం. ప్రతి సంవత్సరం, సంజయ్ దత్ మహాశివరాత్రి జరుపుకుంటారు. అతను తన ఎడమ భుజంపై శివుని పచ్చబొట్టు కూడా వేయించున్నాడు. దీన్ని బట్టి సంజయ్ శివుడికి ఎంత పెద్ద భక్తుడో అర్థం చేసుకోవచ్చు.
బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవగన్ (Ajay Devgan) కూడా శివునికి పెద్ద భక్తుడు అన్నది అందరికీ తెలిసిందే. అతని దర్శకత్వం వహించిన చిత్రం 'శివాయ్' కూడా శివుని మానవ అంశాల ఆధారంగా రూపొందించబడింది. అజయ్ తన చేతిపై శివుడి పచ్చబొట్టును కూడా వేయించుకున్నారు.