MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కనుల పండుగలా నటి సుమలత కుమారుడి పెళ్లి వేడుక.. హాజరైన రజనీ, యష్, మోహన్ బాబు.. ఫొటోస్ ఇవిగో

కనుల పండుగలా నటి సుమలత కుమారుడి పెళ్లి వేడుక.. హాజరైన రజనీ, యష్, మోహన్ బాబు.. ఫొటోస్ ఇవిగో

నేడు సుమలత కుమారుడు అభిషేక్ అంబరీష్ వివాహం కనుల పండుగలా గ్రాండ్ గా జరిగింది. అభిషేక్ అంబరీష్.. అవివా బిదప అనే ఎంట్రపెన్యూర్ మోడల్ ని వివాహం చేసుకున్నాడు.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 05 2023, 04:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

సీనియర్ నటి సుమలత సౌత్ లో తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా ఆమె 80, 90 దశకాల్లో హీరోయిన్ గా నటించారు. తెలుగులో అనేక చిత్రాల్లో నటించి హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు పొందారు. 

 

28

ముఖ్యంగా సుమలత మెగాస్టార్ చిరంజీవితో కలసి శుభలేఖ, ఖైదీ, చట్టంతో పోరాటం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత ఆమె 1991లో కన్నడ దివంగత నటుడు అంబరీష్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి అభిషేక్ అంబరీష్ సంతానం. 

 

38

సుమలత భర్త అంబరీష్ 2018లో మరణించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం సుమలత రాజకీయాల్లో సైతం రాణిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆమె మాండ్య నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. 

 

48

ఇదిలా ఉండగా నేడు సుమలత కుమారుడు అభిషేక్ అంబరీష్ వివాహం కనుల పండుగలా గ్రాండ్ గా జరిగింది. అభిషేక్ అంబరీష్.. అవివా బిదప అనే ఎంట్రపెన్యూర్ మోడల్ ని వివాహం చేసుకున్నాడు. వేద మంత్రాల సాక్షిగా మూడుముళ్ల బంధంతో ఈ జంట ఒక్కటయ్యారు. 

 

58

చూడముచ్చటగా ఉన్న ఈ జంట పెళ్లి ఫోటొలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నవ వధూవరులు ఇద్దరూ సాంప్రదాయ వస్త్రధారణలో వెలిగిపోతున్నారు. 

 

68

అంబరీష్ ఫ్యామిలీకి సౌత్ లో దాదాపు స్టార్ హీరోల ఫ్యామిలీస్ అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. అంబరీష్ లెజెండ్రీ నటుడిగా వెలుగు వెలిగారు. ఆ అనుబంధంతో సౌత్ నుంచి చాలా మంది స్టార్ హీరోలు, పొలిటిషియన్లు సుమలత కుమారుడి వివాహానికి హాజరయ్యారు. 

 

78

సూపర్ స్టార్ రజనీకాంత్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కెజిఎఫ్ హీరో యష్, కిచ్చా సుదీప్, మోహన్ బాబు, రఘురామ కృష్ణంరాజు లాంటి వారంతా పెళ్ళిలో సందడి చేశారు. 

 

88

జంట చూడముచ్చటగా ఉందని అభిమానులు కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఈ పెళ్లి వేడుకకి పునీత్ రాజ్ కుమార్ సతీమణి అశ్విని కూడా హాజరయ్యారు. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
సాయి పల్లవి 4000 కోట్ల సినిమాలోకి.. హాలీవుడ్ డైరెక్టర్ ఎంట్రీ?
Recommended image2
Vijay: ఎన్నికల ప్రచారానికి గంట ప్రయాణం..విజయ్ ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా?
Recommended image3
సినిమాల్లోకి రాక‌ముందు.. ఈ హీరోయిన్ల పేర్లు ఏంటో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved