ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్‌లో ‘లక్కీ’ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
చిన్ననాటి ఫొటోలను ఇప్పుడు చూసుకుంటుంటే భలే విచిత్రంగా అనిపిస్తుంది. పాత ఆల్బమ్‌ను ముందు వేసుకుంటే ఎన్నో జ్ఞాపకాలు కళ్ల ముందు కదలాడుతుంటాయి. అయితే కేవలం మనలాంటి సామాన్యులకే కాదు సెలబ్రిటీలకు కూడా వరిస్తుంది..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య దూరం పూర్తిగా తగ్గిపోతోంది. కేవలం తమ కెరీర్ పరమైన విషయాలు మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే తమ చిన్న నాటి ఫొటోలోను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ అందాల పోస్ట్ చేసిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
పైన ఫొటోలో ఓ అబ్బాయి పక్కన నిలబడి క్యూట్‌గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా.? ఈ చిన్నారి ఇప్పుడు ఒక టాప్ హీరోయిన్. తాజాగా వరుస విజయాలను తన ఖాతాలో వేసుకొని లక్కీ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. ఈ ఏడాదిలో చివరిలో టాలీవుడ్‌లో వచ్చిన సూపర్ హిట్ మూవీలో నటించి మెప్పించింది. చేసినవి కొన్ని సినిమాలే అయినా నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. నాల్గవ చిత్రంలోనే మహేష్ బాబు సరసన నటించే అవకాశం సొంతం చేసుకుంది. ఈపాటికే ఈ చిన్నది ఎవరో మీరు ఓ ఐడియా వచ్చేసే ఉంటుంది. అవును మీరు అనుకుంటోంది నిజమే. ఈ చిన్నారి మరెవరో కాదు. అందాల తార మీనాక్షి చౌదరినే.
హర్యానాకు చెందిన మీనాక్షి చౌదరి నేషనల్ డెంటల్ కాలేజీలో తన విద్యనభసించింది. అయితే ఆ తర్వాత నటనపై ఉన్న ఇష్టంతో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. 2018 ఫెమినా మిస్ ఇండియా ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. అలాగే మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్‌లో కూడా ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. 2019లో బాలీవుడ్‌లో వచ్చిన అప్‌స్టార్ట్స్ అనే మూవీ ద్వారా వెండి తెరకు పరిచయమైంది. 2021లో ఇచట వాహనాలు నిలపరాదు మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. రెండో సినిమా ఖిలాడీతో తొలి వజయం సాధించిన బ్యూటీ మూడో చిత్రం హిట్‌తో మరో విజయం సొంతం చేసుకుంది.
ఇక తర్వాతి చిత్రం గుంటూరు కారంలో ఏకంగా మహేష్ సరసన నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో పాత్ర నిడివి కొంతే అయినా తన నటనతో ఆకట్టుకుంది. ఇక తాజాగా లక్కీ భాస్కర్ మూవీతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ తర్వాత మట్కా, మెకానిక్ రాకీ మూవీలతో అలరిచింది. ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం, అనగనగా ఒక రాజు మూవీలతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమవుతోంది. మరి ఈ బ్యూటీకి 2025 ఎలాంటి విజయాలను అందిస్తుందో చూడాలి.