MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Allu Arjun: అల్లు అర్జున్ టార్గెట్ గా ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్, పుష్ప2 రికార్డ్స్ కి డ్రాగన్ తో చెక్ పెట్టబోతున్నాడా?

Allu Arjun: అల్లు అర్జున్ టార్గెట్ గా ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్, పుష్ప2 రికార్డ్స్ కి డ్రాగన్ తో చెక్ పెట్టబోతున్నాడా?

తెలుగు హీరోలు పాన్ ఇండియా రికార్డులతో దూసుకుపోతున్నారు...టాప్ లో అల్లు అర్జున్ ఉండగా.. ఎన్టీఆర్ బన్నీ రికార్డును బ్రేక్ చేయడానికి మాస్టర్ ప్లాన్ వేశాడా? ప్రశాంత్ నీల్ సినిమాతో తారక్ ఏం చేయబోతున్నాడు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 27 2026, 11:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు హీరోల హవా..
Image Credit : Twitter

పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు హీరోల హవా..

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం తెలుగు హీరోల హవా కొనసాగుతుంది. టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా సినిమాలలో రచ్చ చేస్తున్నారు. పోటా పోటీగా రికార్డులు బ్రేక్ చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన హవా కొనసాగిస్తున్నాడు. పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర అల్లు అర్జున్ పుష్ప2 సినిమాతో హైయోస్ట్ కలెక్షన్స్ సాధించి.. టాప్ రికార్డు క్రియేట్ చేయగా.. ఆ రికార్డును బ్రేక్ చేయడానికి స్టార్ హీరోలు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. దాంతో టైర్-1 హీరోల మధ్య బాక్సాఫీస్ పోటీ కూడా రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అల్లు అర్జున్ రికార్డును బ్రేక్ చేయడం సాధ్యమేనా?
Image Credit : our own

అల్లు అర్జున్ రికార్డును బ్రేక్ చేయడం సాధ్యమేనా?

ఈమధ్య పెద్ది సినిమాతో రామ్ చరణ్ భారీ సక్సెస్ ను సాధించి.. బాక్సాఫీస్ ను షేక్ చేయాలని గట్టిగా ప్రయత్నం చేశాడు. కానీ పెద్ది యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది. చరణ్ నటనకు మాత్రం 100 మార్కులు పడ్డాయి. ఇక నెక్ట్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రికార్డుపై కన్నేసినట్టు తెలుస్తోంది. అందుకోసం పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్లున్నాడు తారక్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందుతున్న డ్రాగన్' సినిమాతో అల్లు అర్జున్ రికార్డును బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

Related Articles

Related image1
Samantha : సమంత భర్త రాజ్ మొదటి భార్య ఏం చేస్తుందో తెలుసా? విసిగిపోయి చివరికి ఏం చేసిందంటే?
Related image2
Sobhita Dhulipala: నాగచైతన్యకు సమంతనే సరైన జోడి..? శోభిత ధూళిపాళ కు షాక్, మండిపడుతున్న నెటిజన్లు
35
డ్రాగన్ సినిమాతో ఎన్టీఆర్ ట్రై చేయబోతున్నాడా?
Image Credit : Asianet News

డ్రాగన్ సినిమాతో ఎన్టీఆర్ ట్రై చేయబోతున్నాడా?

పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,850 కోట్ల కలెక్షన్లను సాధించిన విషయం తెలిసిందే. ఇక ఆ నెంబర్ ను దాటి బాక్సాఫీస్ బాద్షా అనిపించుకోవాలన్న లక్ష్యంతో ఎన్టీఆర్ ముందుకు వెళ్తున్నాడని ప్రచారం జరుగుతోంది. అందుకే ఎన్టీఆర్ తన సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. లేట్ అయినా పర్లేదు.. పక్కాగా టార్గెట్ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉన్నాడట తారక్. మరి పుష్ప2 కలెక్షన్స్ ను డ్రాగన్ బ్రేక్ చేయడం సాధ్యం అవుతుందా?

45
పుష్ప2 భారీ విజయానికి కారణాలు ఇవే?
Image Credit : Asianet News

పుష్ప2 భారీ విజయానికి కారణాలు ఇవే?

ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాతో పుష్ప2 రికార్డులను బద్దలు కొట్టడం సాధ్యం కాదనే తెలుస్తోంది. పుష్ప ఫస్ట్ పార్ట్ మూవీ చూసిన తరువాతే.. సెకండ్ పార్ట్ మూవీపై ఆడియన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి. ఆ సినిమా ఎప్పుడొస్తుందా అని పాన్ ఇండియా లెవల్లో అభిమానులు ఎదురు చూశారు. రిలీజ్ కు ముందే భారీ అంచనాలు ఏర్పడటంతో.. అదే బజ్ రెండో భాగానికి విపరీతమైన అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్ షోలలో రికార్డు స్థాయి వసూళ్లు రావడానికి ప్రధాన కారణంగా నిలిచింది. రిపీట్ ఆడియన్స్ వల్ల కూడా పుష్ప 2 కి భారీ కలెక్షన్లు వచ్చేలా చేసింది.

55
ఎన్టీఆర్ డ్రాగన్ సంగతేంటి?
Image Credit : Asianet News

ఎన్టీఆర్ డ్రాగన్ సంగతేంటి?

ఇక ఎన్టీఆర్ నటిస్తున్న 'డ్రాగన్' విషయానికి వస్తే, ప్రస్తుతం ఆ సినిమాపై అదే స్థాయి బజ్ కనిపించడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండటంతో భవిష్యత్తులో పరిస్థితులు ఎలా మారతాయో చూడాల్సి ఉంది. విడుదలకు ముందు ప్రచారం, టీజర్లు, ట్రైలర్లు, పాటలు, ప్రేక్షకుల్లో ఏర్పడే ఆసక్తి వంటి అంశాలు సినిమా వసూళ్లపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bhagyaraj: ఒకే కథ, ఇద్దరు దిగ్గజాలు, రెండు బ్లాక్‌బస్టర్లు.. భాగ్యరాజ్, భారతీరాజా చేసిన అద్భుతం
Recommended image2
Bhagyaraj Passed Away: గురువు మరణించిన 17 రోజులకే శిష్యుడు కూడా.. దర్శకుడు భాగ్యరాజ్ కన్నుమూత!
Recommended image3
Varanasi Movie: రాజమౌళి కల చెల్లాచెదురు, వారణాసిలో ఆ సీన్లు లేనట్లే.. జక్కన్న ఎందుకిలా చేశారు ?
Related Stories
Recommended image1
Samantha : సమంత భర్త రాజ్ మొదటి భార్య ఏం చేస్తుందో తెలుసా? విసిగిపోయి చివరికి ఏం చేసిందంటే?
Recommended image2
Sobhita Dhulipala: నాగచైతన్యకు సమంతనే సరైన జోడి..? శోభిత ధూళిపాళ కు షాక్, మండిపడుతున్న నెటిజన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved