- Home
- Entertainment
- Buchibabu: గురుశిష్యులని మళ్ళీ కలిపిన ఎన్టీఆర్.. సుకుమార్ కి ఉప్పెన డైరెక్టర్ సాయం..
Buchibabu: గురుశిష్యులని మళ్ళీ కలిపిన ఎన్టీఆర్.. సుకుమార్ కి ఉప్పెన డైరెక్టర్ సాయం..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీ క్రేజ్ రోజు రోజుకి ఎల్లలు దాటుతోంది. దేశం మొత్తం ప్రస్తుతం పుష్ప 2 కోసం ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో పుష్ప 2పై ఇప్పుడు అంచనాలు మాములుగా లేవు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీ క్రేజ్ రోజు రోజుకి ఎల్లలు దాటుతోంది. దేశం మొత్తం ప్రస్తుతం పుష్ప 2 కోసం ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో పుష్ప 2పై ఇప్పుడు అంచనాలు మాములుగా లేవు. ఆ అంచనాలని మ్యాచ్ అయ్యేలా సుకుమార్ పుష్ప ది రూల్ స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు.
స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో షూటింగ్ ఆలస్యం అవుతోంది. సెప్టెంబర్ నుంచి అయినా షూటింగ్ ప్రారంభించాలని సుకుమార్ భావిస్తున్నారు. దీనితో తన అసిస్టెంట్ డైరెక్టర్స్, రైటింగ్ టీం తో కలసి యుద్ధప్రాతిపదికన స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక క్రేజీ న్యూస్ బయటకి వచ్చింది.
పుష్ప 2 స్క్రిప్ట్ వర్క్ కోసం ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తన గురువుతో చేతులు కలిపారు. రీసెంట్ గా బుచ్చిబాబు పుష్ప స్క్రిప్ట్ వర్క్ లో జాయిన్ అయ్యారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో బుచ్చిబాబు రంగస్థలం చిత్రం కోసం సుకుమార్ తో కలసి స్క్రిప్ట్ వర్క్ లో పనిచేశారు. రంగస్థలం చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే.
ఇప్పుడు మళ్ళి బుచ్చిబాబు తన గురువుతో చేతులు కలపడంతో బెస్ట్ స్క్రిప్ట్ తయారవడం ఖాయం అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటున్నారు. బుచ్చిబాబు తన గురువుకి సాయం చేయడానికి ఒకరకంగా ఎన్టీఆర్ కారణం అనే చెప్పాలి. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు ఎన్టీఆర్ తో సినిమా చేయాల్సి ఉంది. ఎన్టీఆర్ కూడా ఓకె చెప్పారు.
ఇంతలో కొరటాల శివతో ఎన్టీఆర్ సినిమా ప్రకటించారు. దీనితో బుచ్చిబాబు మరికొంతకాలం ఎదురుచూడాలి లేదా కొత్త సినిమా చేసుకోవాలి. ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాడు కాబట్టి సుకుమార్ బుచ్చిబాబుని పుష్ప 2 స్క్రిప్ట్ వర్క్ కోసం పిలిచారట. అలా ఎన్టీఆర్ పరోక్షంగా మరోసారి గురు శిష్యులని కలిపారు.
సుకుమార్ తన అసిస్టెంట్స్ అందరితో కలిసి పుష్ప 2 కథపై చర్చలు జరుపుతున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ లో బుచ్చిబాబు సుకుమార్ కి సలహాలు ఇస్తున్నారు. పుష్ప 2 కోసం సుకుమార్ ఏ రేంజ్ లో మైండ్ బెండింగ్ చేస్తున్నారో ఈ పిక్స్ చూసి అర్థం చేసుకోవచ్చు. మైత్రి మూవీస్ నిర్మాతలు పుష్ప 2 కి 350 కోట్ల బడ్జెట్ ఫిక్స్ చేసినట్లు టాక్.