- Home
- Entertainment
- చనిపోయే గంట ముందు ఎమ్మెస్ నారాయణ ఏం కోరుకున్నారో తెలుసా.. బ్రహ్మానందం మాటలకు కన్నీళ్లు ఆగవు..
చనిపోయే గంట ముందు ఎమ్మెస్ నారాయణ ఏం కోరుకున్నారో తెలుసా.. బ్రహ్మానందం మాటలకు కన్నీళ్లు ఆగవు..
టాలీవుడ్ లో లెజెండ్రీ హాస్య నటులలో ఎమ్మెస్ నారాయణ ఒకరు. తాగుబోతు వేషాలకు ఆయన ఒక బ్రాండ్. తాగుబోతు పాత్రలతో ఎమ్మెస్ నారాయణ పండించిన హాస్యం అంతా ఇంతా కాదు.

టాలీవుడ్ లో లెజెండ్రీ హాస్య నటులలో ఎమ్మెస్ నారాయణ ఒకరు. తాగుబోతు వేషాలకు ఆయన ఒక బ్రాండ్. తాగుబోతు పాత్రలతో ఎమ్మెస్ నారాయణ పండించిన హాస్యం అంతా ఇంతా కాదు. అదే విధంగా దూకుడు, దుబాయ్ శీను చిత్రంలో ఫైర్ స్టార్ సల్మాన్ రాజ్ గా ఎమ్మెస్ నారాయణ కామెడీలో విశ్వరూపం ప్రదర్శించారు.
అయితే ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మానందం మధ్య చెరగని స్నేహం ఉంది. ఎన్నో చిత్రాల్లో వీరిద్దరూ కలసి నటించారు. వీళ్లిద్దరి మధ్య స్నేహానికి ఒక ఉదాహరణ ఉంది. ఎమ్మెస్ నారాయణ చివరి దశలో జరిగిన సంఘటనని బ్రహ్మానందం ఓ ఇంటర్వ్యూలో వివరించారు.
అనారోగ్యం కారణంగా ఎమ్మెస్ నారాయణ ఆసుపత్రిలో చేరినప్పుడు ఆయన పరిస్థితి విషమించింది. మరో గంటలో మరణిస్తారు అనగా ఎమ్మెస్ నారాయణ తన కుమార్తెని పిలిచి పేపర్ అడిగారట. ఆ పేపర్ పై బ్రహ్మానందం అన్నయ్యని చూడాలని ఉంది అని రాశారట. దీనితో ఎమ్మెస్ నారాయణ కుమార్తె బ్రహ్మానందం కి ఫోన్ చేశారు. ఆ టైంలో తాను ఆరడగుల బులెట్ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నట్లు తెలిపారు.
ఎమ్మెస్ నారాయణ కూతురు ఫోన్ చేసి విషయం చెప్పడంతో బ్రహ్మి డైరెక్టర్ కి చెప్పి ఆసుపత్రికి వెళ్లారు. బ్రహ్మానందం రాగానే ఎమ్మెస్ నారాయణ ఆయన చేయి పెట్టుకున్నారట. ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు కొంత అర్థం అవుతోంది కొంత అర్థం కావడం లేదు. నానా చేతిని గట్టిగా పట్టుకుని అన్నయ్య అంటున్నాడు.
ఎమ్మెస్ భాదని చూస్తూ నేను భరించలేకపోయా.. పక్కకు వచ్చేశా. నేను పక్కకి వచ్చిన 15 నిమిషాల్లో ప్రాణం పోయింది అంటూ బ్రహ్మి భావోద్వేగానికి గురయ్యారు. ఎమ్మెస్ నారాయణ కమెడియన్ మాత్రమే కాదు.. వాడొక ప్రత్యేకమైన వ్యక్తి. చాలా సింపుల్ గా జోకులు వేస్తుంటాడు. నార్మల్ గా మాట్లాడినట్లే ఉంటుంది అందులో పంచ్ ఉంటుంది. నాకు ఇష్టమైన కమెడియన్ అతడే అని బ్రహ్మి అన్నారు.
ఎల్బీ శ్రీరామ్, కృష్ణ భగవాన్ లాంటి వారిపై ఎమ్మెస్ నారాయణ వేసే పంచ్ లకు నేను కడుపుబ్బా నవ్వే వాడిని. ఒకసారి షూటింగ్ లో వర్షం పడుతోంది. అంతా వర్షం ఎప్పుడు ఆగుతుందా అని ఎదురుచూస్తున్నాం. వర్షం ఆగిపోతుంది అంటారా గురువుగారు అని కృష్ణ భగవాన్ ఎమ్మెస్ ని అడిగారు. ఆగకుండా పడే వర్షాన్ని నా జన్మలో ఇంత వరకు చూడలేదు అని ఎమ్మెస్ సెటైర్ వేశాడు.