అందుకే పిల్లలు వద్దనుకున్నాం, నా భార్యకు అంతకు ముందే పెళ్లైయింది : నటుడు బ్రహ్మాజీ
టాలీవుడ్ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ తన జీవితం గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. తాము పిల్లలు వద్దనుకున్నామని.. దానికి ఒక కారణం ఉందన్నారు. తన ఫ్యామిలీ లైఫ్ గురించి మరికొన్ని విషయాలు వెల్లడించారు.

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో బ్రహ్మాజీ ఒకరు. వయస్సు పెరుగుతున్నా.. అప్పటికి ఇప్పటికీ బ్రహ్మాజీ ఓకేలా ఉంటారు. డిఫరెంట్ క్యారెక్టర్స్ తో.. ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించిన బ్రహ్మాజీ.. తన నటనతో టాలీవుడ్ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా బ్రహ్మాజీ అద్భుతమైన పాత్రల్లో మెరుపులు మెరిపించాడు
అయితే ఆయన పర్సనల్ లైఫ్ గురించి చాలా తక్కు వ మందికి తెలుసు. ఆయన ఫ్యామిలీ పిల్లల గురించి ఎక్కడ ప్రస్తావన రాలేదెప్పుడు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... తన జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని బయట పెట్టారు.
ముఖ్యంగా తన భార్య పిల్లల గురించిన నిజాన్ని బ్రహ్మాజీ ఆడియన్స్ తో పంచుకున్నారు. తాను చెన్నైలో ఉన్నప్పుడు పరిచయమైన ఒక బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని ఆయన తెలిపారు.ఇక తమకు పెళ్లి జరిగే సమయానికి ఆమె భర్త నుంచి విడాకులు తీసుకుందని.. అప్పటికే ఆమెకు ఓ బాబు ఉన్నాడని బ్రహ్యాజీ వివరించారు.
ఇక అప్పటికే బాబు ఉన్నప్పుడు మనకు మళ్లీ పిల్లలు ఎందుకని అనిపించిందని....అందుకే ఇద్దరం ఆలోచించుకుని ఇక పిల్లలు వద్దనుకున్నామని అన్నారు బ్రహ్మాజీ. ఇక తన భార్య కుమారుడినే తన కుమారుడిగా పెంచి పెద్ద చేసి.. పెళ్లి కూడా చేశాడు బ్రహ్మాజీ. అంతే కాదు ఆ అబ్బాయిని పిట్టకథ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం కూడా చేశాడు బ్రహ్మాజీ.
అయితే ఇదంతా తెలిసిన నెటిజన్లు బ్రహ్మాజీని శభాష్ అంటున్నారు. ఇక తన సినిమా జీవితం గురించి బ్రహ్మాజీ మాట్లాడుతూ... తనకు సినిమా కష్టాలేమీ లేవని అన్నారు. తన సినిమా జీవితం చాలా సాఫీగా సాగిపోయిందన్నారు. ఇప్పటికీ అంతే సాగుతుందన్నారు. ఇక తన బాల్యం, సినిమా ఎంట్రీ గురించి కూడా ఆయన పంచకున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో పుట్టి, పశ్చిమగోదావరి జిల్లాలో పెరిగానని... తన తండ్రి తహసీల్దార్ అని చెప్పారు. చదువు పూర్తయిన తర్వాత చెన్నైకి వెళ్లి నటనలో శిక్షణ తీసుకున్నానని తెలిపారు. ట్రైనింగ్ తీసుకునే సమయంలోనే తనకు రవితేజ, కృష్ణవంశీ, రాజా రవీంద్ర వంటి వారు పరిచయమయ్యారని చెప్పారు.
తన కెరీర్ తొలి రోజుల్లోనే మంచి గుర్తింపు వచ్చిందని... అయితే ఆ తర్వాత పదేళ్ల పాటు వచ్చిన పాత్రలు తనకు సంతోషాన్ని ఇవ్వలేదని తెలిపారు. ఇప్పుడు మళ్లీ మంచి పాత్రలు వస్తున్నాయని చెప్పారు. టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల్లో బ్రహ్మాజీకి తప్పకుండా ఓ క్యారెక్టర్ ఉంటుంది. అంతలా ఆయన తెలుగు పరిశ్రమతో బంధం పెనవేసుకుని ఉన్నారు.