MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాటీ.. ఆంటీ అంటూ యాంకర్ సుమకి షాకిచ్చిన బ్రహ్మాజీ.. అనసూయని లాగుతూ రచ్చ లేపుతున్న నెటిజన్లు

నాటీ.. ఆంటీ అంటూ యాంకర్ సుమకి షాకిచ్చిన బ్రహ్మాజీ.. అనసూయని లాగుతూ రచ్చ లేపుతున్న నెటిజన్లు

ఏ సినిమా ఫంక్షన్‌లోనైనా యాంకర్‌ సుమ, బ్రహ్మాజీ ఉన్నారంటే అక్కడ నవ్వులు పూయాల్సిందే. లేటెస్ట్ గా వీరి మధ్య పంచ్‌లు కాస్త సీరియస్‌గా మారిపోతున్నాయి. అనసూయని లాగుతూ రచ్చ చేస్తున్నారు.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Sep 21 2022, 01:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

బ్రహ్మాజీ ఏజ్‌ గురించి తరచూ చర్చ జరుగుతుంటుంది. తాత బ్రహ్మాజీ అని, అంకుల్‌ అని, బాలనటుడు అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తుంటారు సుమ. అందుకు బ్రహ్మాజీ కూడా అంతే సరదాగా రిప్లై ఇస్తుంటారు. వీరిద్దరి మధ్య పంచ్‌లు ఆద్యంతం కడుపుబ్బ నవ్విస్తుంటాయి. ఆడియెన్స్ ని అలరిస్తూ ఈవెంట్‌కే హైలైట్‌గా నిలుస్తుంటాయి. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

తాజాగా సుమ కనకాల.. నాగశౌర్య నటించిన `కృష్ణ వ్రింద విహారి` చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో కమెడీయన్‌ బ్రహ్మాజీ పాల్గొన్నారు. ఎప్పటిలాగే బ్రహ్మాజీ, సుమ మధ్య ఓ సరదాగా కన్వర్జేషన్‌ నడిచింది. ఇద్దరు కలిసి నవ్వులు పూయించారు. 
 

38

ఈవెంట్‌ మధ్యలో బ్రహ్మాజీ వద్దకు వచ్చింది యాంకర్‌ సుమ. ఇక్కడ హాయిగా, రిలాక్స్ గా అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి బ్రహ్మాజీ గారు అంటూ ఆయన్ని కదిపే ప్రయత్నం చేసింది సుమ. ఇంతకు ముందు నుంచి మీ మనోభావాలేమైనా దెబ్బ తిన్నాయా? అంటూ ప్రశ్నించింది. దేనికి అంటూ ఆయన అడగ్గా, లేట్‌గా పిలిచినందుకు అని చెప్పిందిసుమ. 
 

48

దానికి బ్రహ్మాజీ రియాక్ట్ అవుతూ, కొంచెం ఆకలేస్తుంది. షూటింగ్ నుంచి వచ్చాము. మళ్లీ మార్నింగ్‌ షూటింగ్‌ ఉంది` అంటూ చెప్పే ప్రయత్నం చేశారు. ఇంకా చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అని సుమ అనగా, ఏమైనా అడగండి అంటూ బదులిచ్చాడు బ్రహ్మాజీ. దీంతో ప్రశ్నలు స్టార్ట్ చేసిన సుమ.. మీ ఆస్తి వివరాలు చెప్పమనగా, లోలోపల గునుగుతూ మీ రాజీవ్ కంటే ఎక్కువ అన్నట్టగా బదులిచ్చాడు. 
 

58

దీంతో రెండో ప్రశ్న అంటూ మీ ఏజ్‌ ఎంత అని ప్రశ్నించింది యాంకర్‌ సుమ. దీనికి బ్రహ్మాజీ స్పందిస్తూ `యూ నాటీ..ఏ ఆంటీ` అంటూ అందరి ముందే షాకిచ్చాడు. ఈ దెబ్బకి సుమ ముఖం వాడిపోయింది. ఇది ఏంటో ఎటువెళ్లిపోతుందో ఏంటో.. అంటూ నో కామెంట్‌ అని చెప్పింది సుమ. అంతేకాదు రేపు ఎవరితో షూటింగో కాస్త చూసుకోండి అని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేయడంతోపాటు ఈవెంట్‌లో ఆద్యంతం నవ్వులు పూయించింది. 
 

68

ఇంత వరకు బాగానే ఉంది. ఇప్పుడు బ్రహ్మాజీ చేసిన కామెంట్లు అనసూయని ఉద్దేశించి అనే వాదన తెరపైకి తీసుకొస్తున్నారు నెటిజన్లు. సుమ కూడా ఏంటో ఇది ఎటువెళ్తుందోఏమో అని చెప్పడంలో అర్థం కూడా అనసూయని ఉద్దేశించే అని అంటున్నారు. ఈ సరదాగా కన్వర్జేషన్‌లోకి అనసూయని లాగుతూ మరింత రచ్చ చేస్తున్నారు ఇంటర్నెట్‌ కుర్రాళ్లు. 

78

ఇటీవల అనసూయని నెటిజన్లు `ఆంటీ` అంటూ ట్రోల్‌ చేసిన విషయం తెలిసిందే. కత్తిలాగా ఉన్న తనని ఆంటీ ఎలా అంటారంటూ ఆమె ఫైర్‌ అయ్యింది. ఏజ్‌ అబ్యూజింగ్‌ అంటూ కేసుకూడా పెట్టింది. ఇది మరింత రచ్చగా మారింది. సోషల్‌ మీడియాలో అనసూయ దారుణంగా ఆడుకున్నారు నెటిజన్లు. ఇప్పుడిప్పుడే ఆ వివాదాన్ని మర్చిపోతున్నారు. ఇప్పుడు సుమ బ్రహ్మాజీని గెలకడం, ఆయన `నాటీ.. ఆంటీ` అంటూ కామెంట్లు చేయడం పరోక్షంగా అనసూయనే అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

88

ఆంటీ అన్నందుకు మా పై అంతెత్తున్న ఎగిరిన అనసూయ ఇప్పుడు దీనిపై ఏం చెబుతుందో చూడాలని, ఇప్పుడు ఏం అంటావు అనసూయ అని కామెంట్లతో రెచ్చిపోతున్నారు. అనసూయని ట్యాగ్‌ చేస్తూ ఈ వీడియో క్లిప్పుని షేర్‌ చేస్తున్నారు. దీంతో ఇప్పుడిది సోషల్‌ మీడియాలో దుమారం రేపుతుంది. మరోసారి హాట్‌ యాంకర్‌ అనసూయని ఈ వివాదంలోకి లాగితే అది మరింత రచ్చగా మారుతుందని చెప్పొచ్చు. మరి దీనిపై అనసూయ స్పందిస్తుందా? లేదా అనేది చూడాలి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijayashanti దెబ్బకు ఉన్న కొంప కూడా పోయింది, నాలుగేళ్లు ఇండస్ట్రీకి దూరం.. కసితో బాక్సాఫీస్ బద్దలు
Recommended image2
Chiranjeevi: పాట‌లో దాగిన జీవిత స‌త్యం.. రీల్స్‌లో వైర‌ల్ అవుతోన్న ఈ పాట వెన‌క ఇంత అర్థం ఉందా.?
Recommended image3
ఎన్టీఆర్ వల్ల 17 సినిమాలు వదులుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved